
మ్యూచువల్ ఫండ్స్.. అధిక రాబడి కావాలనుకునే వారికి బెస్ట్ ఆప్షన్. అయితే కాస్త రిస్క్ ఉంటుంది. దానిని భరించాల్సి ఉంటుంది. సాధారణంగా మ్యూచువల్ ఫండ్స్ దీర్ఘకాలంలో అధిక రాబడిని అందిస్తాయి. తక్కవ వ్యవధితో పెడితే రిస్క్ మరింత పెరిగే అవకాశం ఉంటి. అయితే ఇటీవల కాలంలో మ్యూచువల్ ఫండ్స్ లో సిస్టమాటిక్ ఇన్వెస్ట్ మెంట్ ప్లాన్స్(ఎస్ఐపీ) చాలా పాపులర్ అవుతున్నాయి. వీటిల్లో తక్కువ సమయంలో అధిక రాబడులు వస్తున్నాయి. వీటిలో తక్కువ మొత్తంలో మీరు పెట్టుబడులు పెట్టుకోవచ్చు. అదే సమయంలో అధిక రాబడులు వచ్చే అవకాశం ఉంటుంది. వ్యవధి కూడా చాలా ఫ్లెక్సీబుల్ గా ఉంటుంది. దీంతో వీటిలో సామాన్యులు ,మధ్య తరగతి వారు కూడా పెట్టుబడులు పెడుతున్నారు. మీరు ఎక్కువ మొత్తాన్ని ఆదా చేయాలన్న ప్లాన్లో ఉంటే మీ ఆర్థిక ప్రణాళికకు ఈ ఎస్ఐపీలు బాగా ఉపకరిస్తాయనడంలో ఎలాంటి సందేహం లేదు. అయితే ఆ ఎస్ఐపీల్లో కూడా కొన్ని మాత్రమే అధిక రాబడులు ఇస్తాయి. వాటిని ఎంపిక చేసుకొని పెట్టుబడులు పెట్టాల్సి ఉంటుంది. ఈ నేపథ్యంలో మూడేళ్ల కాల వ్యవధితో అధిక రాబడిని అందించిన బెస్ట్ ఎస్ఐపీలు ఏంటి? వాటి గురించి తెలుసుకుందాం..
డైరెక్ట్ ప్లాన్.. ఈ చిన్న ఫండ్ వార్షిక ప్రాతిపదికన లెక్కకడితే ఒక సంవత్సరంలో 42.07 శాతం, రెండేళ్లలో 21.63 శాతం, మూడేళ్లలో 47.73 శాతం రాబడిని ఇచ్చింది. ఈ క్వాంట్ స్మాల్ క్యాప్ ఫండ్ మొత్తం ఫండ్ పరిమాణం రూ. 8,075.14 కోట్లు, సెప్టెంబర్ 29 నాటికి నెట్ అసెట్ వాల్యూ(ఎన్ఏవీ) పరిమాణం రూ. 195.97గా ఉంది. డైరెక్ట్ ప్లాన్ ఖర్చు నిష్పత్తి 0.77 శాతం. ఈ ఫండ్‌లో పెట్టుబడి పెట్టడానికి కనీస ఎస్ఐపీ మొత్తం రూ. 1,000. మూడేళ్ల క్రితం ఒకరు ఫండ్‌లో రూ.36,000 ఇన్వెస్ట్ చేసి ఉంటే, ప్రస్తుతం వారి కార్పస్ విలువ రూ.60,581.3గా ఉంటుంది.
రెగ్యులర్ ప్లాన్.. వార్షిక ప్రాతిపదికన ఒక సంవత్సరంలో 40.34 శాతం, రెండేళ్లలో 19.88 శాతం, మూడేళ్లలో 45.46 శాతం రాబడితో ఇది మ్యూచువల్ ఫండ్ మార్కెట్‌లో అతిపెద్ద లాభాల్లో ఒకటిగా నిలిచింది. దీన ప్రకారం మూడు సంవత్సరాల క్రితం రూ. 36,000 పెట్టుబడి వారు ప్రస్తుతం రూ. 59,005.60 రాబడిని అందుకుంటారు. ఈ ప్లాన్ మొత్తం ఫండ్ పరిమాణం రూ. 8,075 కోట్లు కాగా, సెప్టెంబర్ 29 నాటికి దాని ఎన్ఏవీ పరిమాణం రూ. 183.47గా ఉంది. ఈ ఫండ్ దేశీయ ఈక్విటీలలో 89.01 శాతం పెట్టుబడిని కలిగి ఉంది. దీని పోర్ట్‌ఫోలియోలోని టాప్ స్టాక్‌లను పరిశీలిస్తే రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్, హెచ్డీఎఫ్సీ బ్యాంక్ లిమిటెడ్, జియో ఫైనాన్షియల్ సర్వీసెస్.
డైరెక్ట్ ప్లాన్.. మిడ్ క్యాప్ మ్యూచువల్ ఫండ్ కింద దీని అసెట్ అండర్ మేనేజ్‌మెంట్ (ఏయూఎం) రూ. 36,539.55 కోట్లుగా ఉంది. ఈ స్మాల్ క్యాప్ డైరెక్ట్ ప్లాన్ వార్షిక ప్రాతిపదికన ఒక సంవత్సరంలో 38.98 శాతం, రెండేళ్లలో 24.48 శాతం, మూడేళ్లలో 44.17 శాతం రాబడిని ఇచ్చింది. ఈ ఫండ్ నెట్ అసెట్ వాల్యూ(ఎన్ఏవీ) రూ. 135.52గా ఉంది. నెలకు కనీస పెట్టుబడి రూ. 100 కాగా, ప్లాన్ ఖర్చు నిష్పత్తి 0.72 శాతంగా ఉంది. ఈ ఫండ్ దేశీయ ఈక్విటీల్లో 97.73 శాతం పెట్టుబడులను కలిగి ఉంది. ట్యూబ్ ఇన్వెస్ట్‌మెంట్స్ ఆఫ్ ఇండియా లిమిటెడ్, హెచ్డీఎఫ్సీ బ్యాంక్, అపార్ ఇండస్ట్రీస్ లిమిటెడ్, కేపీఐటీ టెక్నాలజీస్ లిమిటెడ్ పోర్ట్‌ఫోలియోలోని కొన్ని అగ్ర స్టాక్ హోల్డింగ్‌లు ఇది నిర్వహిస్తుంది. మూడు సంవత్సరాల క్రితం ఈ ఫండ్ లో రూ. 36,000 పెట్టుబడి పెడితే ప్రస్తుతం రూ. 60,101.68 లభిస్తుంది.
రెగ్యూలర్ ప్లాన్.. ఈ ఫండ్ ఏయూఎం విలువ రూ. 36,539.55 కోట్లు. ఇది వార్షిక ప్రాతిపదికన ఒక సంవత్సరంలో 37.78 శాతం, రెండేళ్లలో 23.37 శాతం, మూడేళ్లలో 42.91 శాతం రాబడిని ఇచ్చింది. మూడేళ్ల క్రితం మ్యూచువల్ ఫండ్‌లో ఎవరైనా రూ.36,000 ఇన్వెస్ట్ చేసి ఉంటే, నేడు దాని విలువ రూ.59,173 అయ్యుంటుంది. సెప్టెంబర్ 29 నాటికి రెగ్యులర్ ప్లాన్ యొక్క ఎన్ఏవీ పరిమాణం రూ. 122.64, అయితే ఇది కేటగిరీ సగటులో 1.81 శాతంతో పోలిస్తే 1.55 శాతం వ్యయ నిష్పత్తిని కలిగి ఉంది. దీనిలో కూడా కనీస పెట్టుబడి రూ. 100, ఈ ఫండ్ పోర్ట్‌ఫోలియోలో టాప్ స్టాక్‌లు ట్యూబ్ ఇన్వెస్ట్‌మెంట్ ఆఫ్ ఇండియా లిమిటెడ్, హెచ్డీఎఫ్సీ బ్యాంక్ లిమిటెడ్ అపార్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ వంటివి ఉన్నాయి.
జనవరి 2013లో ప్రారంభించినప్పటి నుంచి ఈ ఫండ్ 634.59 శాతం సంపూర్ణ రాబడిని ఇచ్చింది. ఈ ఫండ్ వార్షిక ప్రాతిపదికన ఒక సంవత్సరంలో 41.80 శాతం, రెండేళ్లలో 20.90 శాతం, మూడేళ్లలో 41.52 శాతం రాబడిని ఇచ్చింది. సెప్టెంబర్ 29 నాటికి ఎన్ఏవీ పరిమాణం రూ. 117.42, ఫండ్ ఖర్చు నిష్పత్తి 0.70 శాతం కేటగిరీ సగటుతో పోలిస్తే 0.75 శాతంగా ఉంది. ఈ ఫండ్ దేశీయ ఈక్విటీలలో 93.61 శాతం పెట్టుబడిని కలిగి ఉంది. దీని పోర్ట్‌ఫోలియోలోని టాప్ స్టాక్‌లు సొనాటా సాఫ్ట్‌వేర్ లిమిటెడ్, బ్యాంక్ ఆఫ్ బరోడా, ఫస్ట్‌సోర్స్ సొల్యూషన్స్ లిమిటెడ్ వంటివి ఉన్నాయి.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..