Savings Accounts: పొదుపు ఖాతాతో ఇన్ని ప్రయోజనాలా.. తెలుసుకోకపోతే నష్టపోతారు..

|

Jul 18, 2024 | 6:19 PM

పొదుపు ఖాతాలను సమర్థంగా నిర్వహించడం వల్ల అనేక ప్రయోజనాలు కలుగుతాయి. డబ్బులు భద్రంగా ఉండడంతో పాటు వడ్డీ వల్ల మరికొన్ని లాభం వచ్చే అవకాశం ఉంటుంది. బ్యాంకులు అందిస్తున్న వివిధ డిపాజిట్ పథకాలపై అవగాహన పెరుగుతుంది. మీ చక్కని ఆర్థిక ప్రణాళిక భవిష్యత్తు అవసరాలను తీర్చుతుంది. పొదుపు ఖాతాల వల్ల కలిగే ప్రయోజనాలు ఇవే.

Savings Accounts: పొదుపు ఖాతాతో ఇన్ని ప్రయోజనాలా.. తెలుసుకోకపోతే నష్టపోతారు..
Savings Account
Follow us on

నేటి కాలంలో ప్రతి ఒక్కరికీ బ్యాంకులోనో, పోస్టాఫీసులోనూ పొదుపు ఖాతాలు (సేవింగ్స్ అక్కౌంట్లు) ఉంటాయి. ఆర్థిక లావాదేవీల కోసం ఇవి అత్యంత అవసరం కూడా. సాధారణంగా వీటిని డబ్బులు దాచుకోవడానికి ఉపయోగిస్తారు. అయితే పొదుపు ఖాతాలతో ఇంకా అనేక ప్రయోజనాలు ఉన్నాయి. వీటిపై అవగాహన పెంచుకోవడం చాలా అవసరం. పొదుపు ఖాతాల వల్ల కలిగే ముఖ్యమైన పది ఉపయోగాలను తెలుసుకుందాం.

ఉపయోగాలివే..

పొదుపు ఖాతాలను సమర్థంగా నిర్వహించడం వల్ల అనేక ప్రయోజనాలు కలుగుతాయి. డబ్బులు భద్రంగా ఉండడంతో పాటు వడ్డీ వల్ల మరికొన్ని లాభం వచ్చే అవకాశం ఉంటుంది. బ్యాంకులు అందిస్తున్న వివిధ డిపాజిట్ పథకాలపై అవగాహన పెరుగుతుంది. మీ చక్కని ఆర్థిక ప్రణాళిక భవిష్యత్తు అవసరాలను తీర్చుతుంది. పొదుపు ఖాతాల వల్ల కలిగే ప్రయోజనాలు ఇవే.

డబ్బు సురక్షితం.. మనం కష్టబడిన సొమ్మును సురక్షితంగా దాచుకోవడానికి పొదుపు ఖాతాలు ప్రధానంగా ఉపయోగపడతాయి. అవసరమైనప్పుడు విత్ డ్రా చేసుకునే అవకాశం ఉంటుంది. దొంగల వల్ల, ఇతర కారణాల వల్ల డబ్బును నష్టపోయే ప్రమాదం ఉండదు. మీ డబ్బులను రక్షించే బాధ్యతను బ్యాంకు తీసుకుంటుంది

లావాదేవీలు సులభం.. పొదుపు ఖాతా ద్వారా డబ్బు లావాదేవీలను సులభంగా నిర్వహించవచ్చు. ఎవరికైనా డబ్బును పంపించడం సౌకర్యంగా ఉంటుంది. అవసరమైనప్పుడు నగదును ఉపసంహరించుకోవచ్చు. ఈ లావాదేవీల కోసం చార్జీలను చెల్లించాల్సిన అవసరం లేదు.

బిల్లు చెల్లింపులు.. పొదుపు ఖాతా ద్వారా నెట్ బ్యాంకింగ్, డెబిట్ కార్డ్, యూపీఐ, చెక్ ద్వారా వివిధ బిల్లులను చెల్లించవచ్చు. ఉదాహరణకు ఇంటి అద్దె, యుటిలిటీలు, ఇంటర్నెట్, మొబైల్ బిల్లులు, అలాగే వివిధ వస్తువుల కొనుగోళ్లకు చెల్లింపులు ఉంటాయి.

పర్యవేక్షణ.. ఖర్చులను పర్యవేక్షించడానికి ఎంతో ఉపయోగపడుతుంది. పొదుపు ఖాతా స్టేట్‌మెంట్ అన్ని లావాదేవీల రికార్డులను అందిస్తుంది. భవిష్యత్తు ఖర్చులను సమర్థంగా ప్లాన్ చేసుకోవడానికి ఉపయోగపడుతుంది.

కనీస బ్యాలెన్స్.. పొదుపు ఖాతాలలో కనీస బ్యాలెన్స్ ఉంచాలి. లేకపోతే బ్యాంక్ నిర్ణీత రుసుము వసూలు చేస్తుంది. ఈ కనీస బ్యాలెన్స్ ఆయా బ్యాంకుల నిబంధనలకు అనుగుణంగా మారుతుంది. సాధారణంగా నెల ప్రాతిపదికన దీనిని లెక్కిస్తారు.

కనీస బ్యాలెన్స్ లెక్కింపు.. కనీస బ్యాలెన్స్ ప్రతిరోజూ కాకుండా నెల మొత్తం సగటు బ్యాలెన్స్ ఆధారంగా లెక్కిస్తారు. ఉదాహరణకు.. మీరు చాలా రోజుల పాటు రూ.10 వేల బ్యాలెన్స్ మెయింటెన్స్ చేస్తున్నారు. మధ్యలో రోజుకు రూ. 300,000 డిపాజిట్ చేసినా, మీ నెలవారీ సగటు బ్యాలెన్స్ ఇప్పటికీ రూ.10 వేలు గానే ఉంటుంది.

వడ్డీ ప్రయోజనం.. పొదుపు ఖాతాలోని జమ చేసిన డబ్బులను వడ్డీని కూడా బ్యాంకులు అందజేస్తాయి. ఈ వడ్డీరేటు సాధారణంగా 3 నుంచి 4 శాతం వరకూ ఉంటుంది. ఇది తక్కువే అయినప్పటికీ మీ డబ్బును ఇంట్లో ఉంచుకోవడం కంటే పొదుపు ఖాతాలో దాచుకోవడం వల్ల కొంత ప్రయోజనం కలుగుతుంది.

ఫిక్స్‌డ్ డిపాజిట్లు.. పొదుపు ఖాతాలో ఎక్కువ కాలం డబ్బు ఉంచాలని అనుకున్న వారికి ఫిక్స్‌డ్ డిపాజిట్లు (ఎఫ్ డీలు) చాలా ఉపయోగంగా ఉంటాయి. వడ్డీ రేటు కూడా అధికంగా ఉంటుంది. సీనియర్ సిటిజన్లకు మరింత వడ్డీ అందజేస్తారు.

పన్ను నిబంధనలు.. పొదుపు ఖాతాలో నిల్వ ఉంచిన డబ్బులకు వచ్చే వడ్డీ మీ పన్ను శ్లాబ్ కు లోబడి ఉంటుంది. ఈ వడ్డీ పూర్తిగా పన్ను రహితం కాదు. నిబంధనలు వర్తిస్తాయి.

వడ్డీపై పన్ను మినహాయింపు.. ఆదాయపు పన్ను శాఖలోని సెక్షన్ 80 టీటీఏ ప్రకారం పొదుపు ఖాతా నుంచి రూ. 10 వేల వరకూ వచ్చే వడ్డీకి పన్ను మినహాయింపు ఉంటుంది. ఈ పరిధి దాటితే పన్ను చెల్లిస్తారు. దీనివల్ల చిన్న పొదుపుదారులకు ఉపశమనం కలుగుతుంది.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..