Cab Drivers: క్యాబ్ డ్రైవర్ల కష్టాల జర్నీ.. వెంటాడుతున్న ఆర్థిక ఇబ్బందులు.. సర్వేలో ఆసక్తికర అంశాలు..

|

Jul 19, 2024 | 5:27 PM

కార్లలో తిరగడానికి మనందరం ఇష్టపడతాం. కానీ ఖర్చు కొంచెం ఎక్కువ కావడంతో బస్సులలో ప్రయాణిస్తాం. అత్యవసర సమయంలో, తొందరంగా వెళ్లాల్సి వచ్చినప్పుడు క్యాబ్ లను బుక్ చేసుకుని ప్రయాణం సాగిస్తాం. ఎప్పుడూ కార్లలోనే తిరిగే క్యాబ్ డ్రైవర్లను చూసి వీరి ఉద్యోగం చాలా బాగుంటుందని భావిస్తాం. కానీ 70 శాతం మంది క్యాబ్ డ్రైవర్లు ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్నారు. వారంలో దాదాపు 60 గంటలు పనిచేసినా సరైన ఆదాయం రాక ఆర్థికంగా అవస్థలు పడుతున్నారు.

Cab Drivers: క్యాబ్ డ్రైవర్ల కష్టాల జర్నీ.. వెంటాడుతున్న ఆర్థిక ఇబ్బందులు.. సర్వేలో ఆసక్తికర అంశాలు..
Cabs
Follow us on

దేశంలోని యువత నేడు ఉద్యోగ, వ్యాపార రంగాలలో దూసుకువెళుతున్నారు. అలాగే స్వయం ఉపాధి అవకాశాలను మెరుగుపర్చుకుంటున్నారు. స్వయం ఉపాధికి సంబంధించి ఎక్కువగా మోటారు రంగంపై ఆధారపడ్డారు. ముఖ్యంగా పట్టణాల్లో మనకు క్యాబ్ లు ఎక్కువగా కనిపిస్తాయి. వాటిని నడుపుతూ చాలామంది జీవనం సాగిస్తున్నారు. ఇటీవల ఓ సంస్థ క్యాబ్ డ్రైవర్ల ను సర్వే చేసి అనేక ఆసక్తికర విషయాలను వెలుగులోకి తీసుకువచ్చింది. వారు పడుతున్న కష్టాలు, ఇబ్బందులను తెలియజేసింది. ప్లాట్ ఫాం కంపెనీలలో పనిచేసే క్యాబ్ డ్రైవర్లు ఎక్కువగా ఇబ్బందులు పడుతున్నట్టు గుర్తించింది.

క్యాబ్ డ్రైవర్ల కష్టాలు..

కార్లలో తిరగడానికి మనందరం ఇష్టపడతాం. కానీ ఖర్చు కొంచెం ఎక్కువ కావడంతో బస్సులలో ప్రయాణిస్తాం. అత్యవసర సమయంలో, తొందరంగా వెళ్లాల్సి వచ్చినప్పుడు క్యాబ్ లను బుక్ చేసుకుని ప్రయాణం సాగిస్తాం. ఎప్పుడూ కార్లలోనే తిరిగే క్యాబ్ డ్రైవర్లను చూసి వీరి ఉద్యోగం చాలా బాగుంటుందని భావిస్తాం. కానీ 70 శాతం మంది క్యాబ్ డ్రైవర్లు ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్నారు. వారంలో దాదాపు 60 గంటలు పనిచేసినా సరైన ఆదాయం రాక ఆర్థికంగా అవస్థలు పడుతున్నారు.

మూడు నగరాల్లో సర్వే..

దేశవ్యాప్తంగా మూడు నగరాల్లో దాదాపు 1200 మంది క్యాబ్ డ్రైవర్లను సర్వే చేసిన తర్వాత ఆ సంస్థ ఒక నివేదికను వెల్లడించింది. దాని ప్రకారం..

  • ప్రతి వారం 60 గంటలకు పైగా పనిచేసినప్పటికీ ఆర్థిక ఇబ్బందులు తప్పడం లేదని 70 శాతం క్యాబ్ డ్రైవర్లు తెలియజేశారు.
  • అధిక పని గంటల కారణంగా అనారోగ్య సమస్యల బారిన పడ్డామని 60 శాతం మంది ఆవేదన వ్యక్తం చేశారు.
  • క్యాబ్ పై వచ్చే ఆదాయంతో కుటుంబ పోషణ కష్టంగా మారుతోందని 50 శాతం మంది తెలిపారు. దీంతో రుణాలు పెరిగిపోతున్నాయన్నారు.
  • క్యాబ్ లు రోజురోజుకూ పెరిగిపోవడంతో వీరి మధ్య పోటీ నెలకొని డిమాండ్ తగ్గిపోతోంది. కొన్ని నగరాల్లో డ్రైవర్లు ఖర్చుల తర్వాత గంటకు రూ. 250 కంటే తక్కువ ఆదాయం సంపాదిస్తున్నారు.
  • డ్రైవర్లలో 75 శాతం మంది ప్లాట్‌ఫారం కంపెనీల ద్వారా దోపిడీకి గురవుతున్నట్లు భావిస్తున్నారు.

కారణాలు ఇవే..

క్యాబ్ డ్రైవర్ల ఆర్థిక ఇబ్బందులకు అనేక కారణాలు ఉన్నాయి. వాటిలో ముఖ్యమైన వాటిని తెలుసుకుందాం.

  • డ్రై రన్‌లు, ఎక్కువ సేపు పికప్‌లు, ట్రాఫిక్ జాప్యాలు, వేచి ఉండటం, కస్టమర్ రద్దు తదితర కారణాలతో నష్టం కలుగుతోంది. వారి ఆర్థిక ఇబ్బందులను మరింత తీవ్రతరం చేసే ప్రధాన కారణాలలో వీటిని ప్రధానంగా చెప్పవచ్చు.
  • అధిక వాహన నిర్వహణ ఖర్చులు, భారీ ప్లాట్‌ఫారమ్ కమీషన్లు (30 శాతం), గతేడాది 20 శాతం పెరిగిన ఇంధన ధరలు కూడా డ్రైవర్ల నికర ఆదాయాన్ని తగ్గించాయి.
  • ప్లాట్‌ఫారమ్ కంపెనీల ఏకపక్ష నిర్ణయాలతో 30 శాతం డ్రైవర్లు ఇబ్బందులు పడుతున్నారు. ముందస్తు నోటీసు, గడువు ప్రక్రియ లేకుండా తొలగించడంతో ఆకస్మికంగా ఆదాయాన్ని కోల్పోతున్నారు.

పరిష్కార మార్గాలు..

  • క్యాబ్ డ్రైవర్ల ఆర్థిక సమస్యల పరిష్కారానికి ఆ సంస్థ పలు అంశాలను సూచించింది. వాటిని అమలు చేయడం వల్ల వారికి ఆర్థిక భరోసా లభిస్తుందని తెలిపింది.
  • డ్రై రన్‌లు, ఎక్కువ కాలం పికప్‌లు, పనిలేకుండా ఉండే సమయం, రద్దు తదితర వాటికోసం పరిహారాన్ని అమలు చేయాలి. దీనివల్ల డ్రైవర్ల ఆదాయం దాదాపు 20 శాతం పెరుగుతుంది.
  • స్టాండర్డ్ మీటర్, కమీషన్ విధానం అమలు చేయాలి. చార్జిలో కనీసం 80 శాతం డ్రైవర్‌కు అందేలా చూడాలి.
  • ఒప్పందాలు సరళంగా ఉండాలి. వాటిని డ్రైవర్లకు అర్థమయ్యేలా స్థానిక భాషల్లో ఉండేలా చూడాలి.
  • ఆరోగ్య బీమా, భద్రతా చర్యలను తప్పనిసరిగా తీసుకోవాలి.
  • ఐడీ డీయాక్టివేషన్ వంటి చర్యలకు ముందు న్యాయమైన విచారణల కోసం ఫిర్యాదుల పరిష్కార యంత్రాంగాన్ని ఏర్పాటు చేయాలి.
  • పని గంటలను తగ్గించాలి. రోజుకు పది గంటలు మాత్రమే పని చేసేలా చూడాలి.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..