Income Tax: ఆ దేశాల్లో ట్యాక్స్ కట్టక్కర్లేదు.. పౌరుల ఆదాయంపై పరిమితులూ ఉండవ్..

ఇటీవలే ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ కేంద్ర బడ్జెట్ 2024ను ఆవిష్కరించారు. దానిలో కొత్త, పాత విధానాలంటూ కొన్ని కొత్త స్లాబ్ లను ప్రకటించారు. దీనిపై ఇప్పుడు విస్తృతమైన చర్చ నడుస్తోంది. అయితే అసలు ప్రజల ఆదాయంపై పన్ను విధించని కొన్ని దేశాలు ప్రపంచంలో ఉన్నాయి. ఆయా దేశాల్లోని ప్రభుత్వాలు తమ పౌరులపై ఎటువంటి ఆదాయపు పన్ను విధించవు.

Income Tax: ఆ దేశాల్లో ట్యాక్స్ కట్టక్కర్లేదు.. పౌరుల ఆదాయంపై పరిమితులూ ఉండవ్..
Income Tax
Follow us

|

Updated on: Jul 27, 2024 | 6:54 PM

మన దేశంలో ప్రతి దానిపై పన్నులు ఉంటాయి. వ్యక్తి సంపాదించే ఆదాయం పైనా ట్యాక్స్ ఉంటుంది. పరిమితికి మించి సంపాదన ఉంటే దాని నుంచి కొంత శాతం పన్ను రూపంలో ప్రభుత్వానికి చెల్లించాల్సి ఉంటుంది. దీనిలో అనేక రకాల స్లాబ్స్ ఉంటాయి. ఇటీవలే ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ కేంద్ర బడ్జెట్ 2024ను ఆవిష్కరించారు. దానిలో కొత్త, పాత విధానాలంటూ కొన్ని కొత్త స్లాబ్ లను ప్రకటించారు. దీనిపై ఇప్పుడు విస్తృతమైన చర్చ నడుస్తోంది. అయితే అసలు ప్రజల ఆదాయంపై పన్ను విధించని కొన్ని దేశాలు ప్రపంచంలో ఉన్నాయి. ఆయా దేశాల్లోని ప్రభుత్వాలు తమ పౌరులపై ఎటువంటి ఆదాయపు పన్ను విధించవు. అయినప్పటికీ వారి ఆర్థిక వ్యవస్థలు బలంగా అభివృద్ధి చెందుతున్నాయి. అలాంటి కొన్ని దేశాల గురించి మీకు పరిచయం చేస్తున్నాం.

యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ)..

యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ)లో వ్యక్తిగత పన్నులు ఉండవు. అందుకు బదులుగా వ్యాట్, వివిధ సుంకాల వంటి పరోక్ష పన్నులను విధిస్తుంది. ఆయిల్, టూరిజం వంటి బలమైన రంగాలు ఆ దేశానికి మంచి ఇంధనంగా మారుతోంది. వీటి సాయంతో యూఏఈ ఒక బలీయమైన ఆర్థిక వ్యవస్థగా రూపాంతరం చెందింది.

బహ్రెయిన్..

దుబాయ్ మాదిరిగానే, బహ్రెయిన్ ప్రభుత్వం తన పౌరులపై ఆదాయపు పన్ను విధించదు. బదులుగా, అది తన ఖర్చులకు నిధులు సమకూర్చడానికి పరోక్ష పన్నులపై ఆధారపడుతుంది. ఈ వ్యవస్థ చిన్న వ్యాపారాలు, స్టార్టప్‌లలో వేగవంతమైన వృద్ధిని పెంపొందిస్తోంది.

కువైట్..

పన్ను రహిత దేశమైన కువైట్, తన నివాసితులపై ఆదాయపు పన్ను విధించదు. దీని ఆర్థిక వ్యవస్థ ప్రధానంగా చమురు రాబడిపై ఆధారపడి ఉండటంతో, ప్రభుత్వం తన ప్రజల నుంచి పన్నులు వసూలు చేయవలసిన అవసరాన్ని విస్మరించింది.

సౌదీ అరేబియా..

సౌదీ అరేబియా తన పౌరులపై ఆదాయపు పన్ను లేదా ప్రత్యక్ష పన్నులు విధించదు. దేశం ఆర్థిక వ్యవస్థ దాని పరోక్ష పన్ను వ్యవస్థ మద్దతుతో బలమైన వేగాన్ని నిర్వహిస్తుంది.

బహమాస్..

బహామాస్ ఆర్థిక వ్యవస్థ పర్యాటకం పై ఆధారపడి ఉంది. అయితే ఈ దేశం దాని నివాసితుల నుంచి ఆదాయపు పన్ను వసూలు చేయదు. ప్రతి సంవత్సరం, ప్రపంచవ్యాప్తంగా ఉన్న పర్యాటకులకు ఈ దేశం ఉత్తమ సందర్శనీయ ప్రాంతంగా మారింది. ఇది ఆ దేశానికి ఆర్థిక స్థిరత్వాన్ని అందిస్తోంది.

బ్రూనై..

గణనీయమైన చమురు నిల్వలు కలిగిన దేశంగా ఉన్న బ్రూనై పేరుగడించింది. ఇక్కడి ప్రభుత్వం తన పౌరులపై పన్నులు విధించాల్సిన అవసరం లేదని చెబుతుంది.

కేమాన్ దీవులు..

ఉత్తర అమెరికాలో ఉన్న కేమాన్ దీవులు దాని ఆర్థిక వ్యవస్థను ప్రధానంగా పర్యాటకం ద్వారా నిలబెట్టుకుంటుంది. బెస్ట్ హాలిడే డెస్టినేషన్ గా సందర్శకులను ఆకర్షిస్తుంది. ఇక్కడి ప్రభుత్వం తన నివాసితులపై ఆదాయపు పన్ను విధించడం లేదు.

ఒమన్..

బహ్రెయిన్, కువైట్ మాదిరిగానే ఒమన్ కూడా తన పౌరులపై పన్నులు విధించదు. చమురు, గ్యాస్ అమ్మకాల ద్వారా ఈ దేశం బలమైన ఆర్థిక వ్యవస్థను రూపొందించుకుంది.

ఖతార్..

గల్ఫ్ పొరుగు దేశాల మాదిరిగానే ఖతార్ కూడా చమురు పరిశ్రమ నుంచి వచ్చే ఆదాయాలపై ఎక్కువగా ఆధారపడుతుంది. ఫలితంగా, దాని జనాభాపై ఆదాయపు పన్ను విధించదు.

మొనాకో..

ఐరోపాలో ఉన్న మొనాకో చిన్న దేశం అయినప్పటికీ ఆర్థికంగా బలమైన దేశం. ఇది ప్రధానంగా పర్యాటకం నుంచి ఆదాయాన్ని పొందుతుంది. ఈ దేశ ప్రభుత్వం కూడా తన నివాసితులపై పన్ను విధించదు.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..