Telugu News Business These are the latest gold loan interest rates in top banks, check details in telugu
Gold Loan: బంగారంపై సులభంగా రుణాలు.. అతి తక్కువ వడ్డీ రేటు అందించే బ్యాంకులివే..
మిగిలిన రుణాలతో పోల్చితే బంగారం రుణాలు చాలా త్వరగా మంజూరవుతాయి. మన అవసరాలకు ఎంతో ఉపయోగపడతాయి. బంగారం విలువలో దాదాపు 75 శాతం వరకూ రుణం పొందే అవకాశం ఉంటుంది. ఈ ప్రక్రియ చాలా త్వరగా పూర్తవుతుంది. ప్రస్తుతం 10 గ్రాముల బంగారం ధర రికార్డు స్థాయిలో రూ.75 వేలకు చేరింది. ధర పెరగడంతో బంగారం రుణాల పరిమాణం పెరిగింది.
భారతీయ సంప్రదాయంలో బంగారానికి ఎంతో ప్రాముఖ్యత ఉంది. పండగలు, శుభకార్యాలు తదితర సమయాలలో బంగారు ఆభరణాలను ధరించడం ఆనవాయితీ. ముఖ్యంగా మహిళలు బంగారంపై ఎంతో ఇష్టం పెంచుకుంటారు. వారు చేసిన పొదుపులో చాలా మొత్తం దీనిపైనే వెచ్చిస్తారు. అలాగే బంగారు ఆభరణాలు మనల్ని అత్యవసర సమయంలో ఆదుకుంటాయి. వాటిపై బ్యాంకులు రుణాలు మంజూరు చేస్తాయి. అతి తక్కువ వడ్డీకి బంగారంపై రుణాలను అందజేస్తున్న బ్యాంకులు వివరాలు తెలుసుకుందాం.
బంగారంపై రుణాలు..
మిగిలిన రుణాలతో పోల్చితే బంగారం రుణాలు చాలా త్వరగా మంజూరవుతాయి. మన అవసరాలకు ఎంతో ఉపయోగపడతాయి. బంగారం విలువలో దాదాపు 75 శాతం వరకూ రుణం పొందే అవకాశం ఉంటుంది. ఈ ప్రక్రియ చాలా త్వరగా పూర్తవుతుంది. ప్రస్తుతం 10 గ్రాముల బంగారం ధర రికార్డు స్థాయిలో రూ.75 వేలకు చేరింది. ధర పెరగడంతో బంగారం రుణాల పరిమాణం పెరిగింది. ఎక్కువ బంగారం కలిగి ఉన్న వినియోగదారులు తమ ఆభరణాలను మానిటైజ్ చేస్తారని తెలిసింది. ఏదైనా అత్యవసర పరిస్థితులను ఎదుర్కోవడానికి తమ బంగారాన్ని తాకట్టు పెట్టాలనుకునే వారికి గోల్డ్ లోన్లు చాలా ఉపయోగంగా ఉంటాయి.
బంగారు రుణాలపై వడ్డీరేట్లు..
బంగారు రుణాలపై వడ్డీరేటు ఆయా బ్యాంకులపై ఆధారపడి ఉంటుంది. ఒక సంవత్సరం కాల వ్యవధిపై రూ.5 లక్షల రుణాన్ని 8.8 శాతం నుంచి 9.15 శాతం మధ్య వడ్డీతో మంజూరు చేస్తున్నాయి.
బ్యాంక్ ఆఫ్ ఇండియా ఒక సంవత్సరం కాలపరిమితితో రూ. 5 లక్షల బంగారు రుణంపై 8.8 శాతం వడ్డీ విధిస్తుంది. అన్ని బ్యాంకులకన్నా అతి తక్కువ రేటు ఇదే. రుణానికి సంబంధించిన ఈఎమ్ఐ (ఈక్వేటెడ్ నెలవారీ వాయిదా) రూ. 43,360గా ఉంటుంది.
ఇండియన్ బ్యాంక్ కూడా ఏడాది కాలపరిమితితో రూ. 5 లక్షల బంగారు రుణంపై 8.95 శాతం వడ్డీ విధిస్తుంది. నెలవారీ వాయిదా రూ. 43,390 చెల్లించాలి.
కెనరా, హెచ్‌డీఎఫ్‌సీ, ఐసీఐసీఐ బ్యాంకులు కూడా బంగారంపై రుణాలు అందిస్తున్నాయి. ఇవి కూడా ఏడాది కాలపరిమితితో రూ. 5 లక్షలకు 9 శాతం వడ్డీని వసూలు చేస్తున్నాయి. ఈ బ్యాంకులలో నెల వాయిదా రూ. 43,400గా ఉంటుంది.
బ్యాంక్ ఆఫ్ బరోడాలో రూ. 5 లక్షల గోల్డ్ లోన్‌పై 9.15 శాతం వడ్డీ వసూలు చేస్తారు. ప్రతినెలా రూ.43,430 ఈఎంఐ చెల్లించాలి.
యూనియన్ బ్యాంక్, పంజాబ్ నేషనల్ బ్యాంక్ లలో ఏడాది కాల పరిమితితో రూ.5 లక్షల రుణానికి 9.25 శాతం వడ్డీ విధిస్తారు. రుణం తీసుకున్నవారు ప్రతినెలా ఈఎమ్ ఐ గా రూ.43,450 కట్టాలి.
ప్రభుత్వ రంగ దిగ్గజం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ) రెండేళ్ల కాలపరిమితితో రూ. 5 లక్షల గోల్డ్ లోన్‌పై 9.6 శాతం వడ్డీ రేటును విధిస్తుంది. ప్రతి నెలా రూ.43,615 ఈఎమ్ఐ చెల్లించాలి.
యాక్సిస్ బ్యాంక్ ఏడాది కాలపరిమితితో రూ. 5 లక్షల గోల్డ్ లోన్‌పై 17 శాతం వడ్డీ రేటును విధిస్తుంది. ఈఎమ్ఐ రూ.44,965 గా ఉంటుంది.