Budget 2024: నిర్మలాసీతారామన్‌ బడ్జెట్‌ ప్రసంగంలో కీలక అంశాలు ఇవే..

పార్లమెంట్‌ సమావేశాల సందర్భంగా కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలాసీతారామన్‌ బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు. ఇది చివరి బడ్జెట్‌ కావడంతో పెద్దగా ఊరటనిచ్చే అంశాలు ప్రకటించలేదు. సార్వత్రికి ఎన్నికలు జరుగనున్న నేపథ్యంలో కొత్త ప్రభుత్వం ఏర్పాటు అయిన తర్వాత పూర్తి స్థాయిలో బడ్జెట్‌ రానుంది. అయితే బడ్జెట్‌ ప్రవేశపెట్టిన నిర్మలాసీతారామన్‌ ప్రసంగంలో కీలక అంశాలు ఈ విధంగా ఉన్నాయి.

Budget 2024: నిర్మలాసీతారామన్‌ బడ్జెట్‌ ప్రసంగంలో కీలక అంశాలు ఇవే..
Budget

Updated on: Feb 01, 2024 | 1:40 PM

పార్లమెంట్‌ సమావేశాల సందర్భంగా కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలాసీతారామన్‌ బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు. ఇది చివరి బడ్జెట్‌ కావడంతో పెద్దగా ఊరటనిచ్చే అంశాలు ప్రకటించలేదు. సార్వత్రికి ఎన్నికలు జరుగనున్న నేపథ్యంలో కొత్త ప్రభుత్వం ఏర్పాటు అయిన తర్వాత పూర్తి స్థాయిలో బడ్జెట్‌ రానుంది. అయితే బడ్జెట్‌ ప్రవేశపెట్టిన నిర్మలాసీతారామన్‌ ప్రసంగంలో కీలక అంశాలు ఈ విధంగా ఉన్నాయి.

  • పరిశోధన, సృజనాత్మకకు లక్ష కోట్ల నిధి ఏర్పాటు చేస్తాం..
  • మూడు రైల్వే కారిడార్లను అభివృద్ధి చేస్తాం
  • 40వేల నార్మల్‌ బోగీలను వందేభారత్‌ ప్రమాణాలకు పెంచుతాం
  • యువతకు ముద్ర యోజన ద్వారా రూ.25 లక్షల కోట్ల రుణాలిచ్చాం..
  • 30 కోట్ల మంది మహిళలకు ముద్ర రుణాలు అందించాం
  •  లక్ష కోట్లతో ప్రైవేట్‌ సెక్టార్‌కి కార్పస్‌ ఫండ్‌
  • టూరిస్ట్‌ హబ్‌గా లక్షద్వీప్‌
  • 517 ప్రాంతాలకు కొత్త విమాన సర్వీసులు
  • 3 మేజర్‌ రైల్వే కారిడార్లు నిర్మాణం చేస్తున్నాం
  • వచ్చే 5 ఏళ్లు అభివృద్ధికి స్వర్ణయుగం
  • 2047 నాటికి అభివృద్ధి చెందిన దేశంగా భారత్‌
  • ఈ 10 ఏళ్లలో పేదరికం నుంచి 25 కోట్ల మందికి విముక్తి
  • దేశంలో మరిన్ని మెడికల్‌ కాలేజీల కోసం కమిటీ ఏర్పాటు
  • రూఫ్‌టాప్‌ సోలార్‌ పాలసీతో కోటి ఇళ్లకు 300 యూనిట్ల ఉచిత విద్యుత్‌
  • 80 కోట్ల మందికి ఫ్రీరేషన్‌తో ఆహార సమస్య తీర్చాం
  • మధ్యతరగతి కోసం ఇళ్ల నిర్మాణానికి ప్రాధాన్యం
  • వచ్చే 5 ఏళ్లలో 2 కోట్ల ఇళ్లనిర్మాణం లక్ష్యం
  • ప్రజల సగటు ఆదాయం 50 శాతం పెరిగింది
  • GDP అంటే గవర్నెన్స్‌, డెవలప్‌మెంట్‌, పర్‌ఫార్మెన్స్‌
  • మహిళలకు 30 కోట్ల ముద్రా రుణాలు ఇచ్చాం
  • 10 ఏళ్లలో 7 ఐఐటీలు, 16 ట్రిపుల్‌ ఐటీలు, 7 ఐఐఎంలు
  • 15 ఎయిమ్స్‌లు, 390 యూనివర్సిటీలు ఏర్పాటు చేశాం
  • స్టార్టప్‌ ఇండియా, స్టార్టప్‌ క్రెడిట్‌ గ్యారంటీతో యువతకు ఉద్యోగాలు
  • 10 ఏళ్లలో ఉన్నత విద్య చదివే అమ్మాయిలు 28 శాతం పెరిగారు
  • 11.8 కోట్ల మంది అన్నదాతలకు ఆర్థిక సాయం
  • 4 కోట్ల మంది రైతులకు బీమా సౌకర్యం
  • జన్‌ధన్‌ ఖాతాలతో పేదలకు రూ.34 లక్షల కోట్లు అందించాం
  • స్వయం సహాయక బృందాల్లో కోటి మంది మహిళలు లక్షాధికారులు అయ్యారు
  • లక్‌ పతీ దీదీ టార్గెట్‌ను రెండు కోట్ల నుంచి మూడు కోట్లకు పెంపు
  • 5 సమీకృత ఆక్వా పార్కులు ఏర్పాటు చేస్తాం
  • నానో యూరియా తర్వాత పంటలకు నానో DAP కింద ఎరువులు అందిస్తాం
  • అంగన్‌వాడీ కార్మికులు, హెల్పర్లకు ఆయుష్మాన్‌ భారత్‌ కవరేజ్‌