Tata curvv ICE: కార్ల మార్కెట్‌లో టాటా దూకుడు.. కర్వ్ ఐసీఈ వెర్షన్ విడుదల.. ప్రత్యేకతలివే..

|

Sep 03, 2024 | 3:48 PM

టాటా మోటార్స్ ఇటీవల కర్వ్ ఎలక్ట్రిక్ వెర్షన్ ను ఆవిష్కరించింది. దానికి కొనసాగింపుగా ఐసీఈ వెర్షన్ ను సెప్టెంబర్ 2న విడుదల చేసింది. పెట్రోలు, డీజిల్ వెర్షన్లను పరిచయం చేస్తూ తన కర్వ్ లైనప్ ను విస్తరించింది. మూడు ఇంజిన్లతో, అత్యాధునిక ఫీచర్లతో ఈ కారు ఎంతో ఆకట్టుకుంటోంది. కంపాక్ట్ ఎస్ యవీ విభాగంలో తీసుకువచ్చిన ఈ కారు ధర రూ.10 లక్షల నుంచి ప్రారంభమవుతుంది.

Tata curvv ICE: కార్ల మార్కెట్‌లో టాటా దూకుడు.. కర్వ్ ఐసీఈ వెర్షన్ విడుదల.. ప్రత్యేకతలివే..
Tata Curvv Ice Version
Follow us on

కార్ల మార్కెట్ లో టాటా మోటార్స్ దూసుకుపోతుంది. సరికొత్త మోడళ్ల ను విడుదల చేస్తూ వినియోగదారులకు మరింత దగ్గర అవుతోంది. టాటా మోటార్స్ ఇటీవల కర్వ్ ఎలక్ట్రిక్ వెర్షన్ ను ఆవిష్కరించింది. దానికి కొనసాగింపుగా ఐసీఈ వెర్షన్ ను సెప్టెంబర్ 2న విడుదల చేసింది. పెట్రోలు, డీజిల్ వెర్షన్లను పరిచయం చేస్తూ తన కర్వ్ లైనప్ ను విస్తరించింది. మూడు ఇంజిన్లతో, అత్యాధునిక ఫీచర్లతో ఈ కారు ఎంతో ఆకట్టుకుంటోంది. కంపాక్ట్ ఎస్ యవీ విభాగంలో తీసుకువచ్చిన ఈ కారు ధర రూ.10 లక్షల నుంచి ప్రారంభమవుతుంది. అయితే టాప్ వేరియంట్ ధర రూ.17.69 లక్షల (ఎక్స్ షోరూమ్ ధర ) వరకూ ఉంటుంది. టాటా కర్వ్ ఐసీఈ ప్రత్యేకతలు, ఇతర వివరాలు తెలుసుకుందాం.

బుకింగ్‌లు ప్రారంభం..

టాటా కర్వ్ ఐసీఈ కారుకు అనేక ప్రత్యేకతలు ఉన్నాయి. స్మార్ట్, ప్యూర్, క్రియేటివ్, అకాప్లిష్డ్ అనే నాలుగు ట్రిమ్ స్థాయిల్లో అందుబాటులో ఉంది. అలాగే గోల్డ్ ఎసెన్స్, ప్రిస్టైన్ వైట్, డేటోనా గ్రే, ఫ్లేమ్ రెడ్, ప్యూర్ గ్రే, ఒపెరా బ్లూ తదితర ఆరు ఆకర్షణీయమైన రంగుల్లో లభిస్తుంది. టాటా కర్వ్ ఐసీఈ, ఎలక్ట్రిక్ వాహనాలు రెండు టాటా అట్లాస్ ఫ్లాట్ ఫాంపై ఆధారపడి పనిచేస్తాయి. కొత్త కర్వ్ ఐసీఈ కోసం బుక్కింగ్ లను ప్రారంభించారు. కారు డెలివరీలు సెప్టెంబర్ 12 నుంచి ప్రారంభమవుతాయి.

డిజైన్..

టాటా కర్వ్ ఈవీతో పోల్చితే ఐసీఈ మోడల్ కొంచెం భిన్నంగా ఉంటుంది. స్లోపింగ్, గుడ్‌బై యానిమేషన్‌తో రెండు చివర్లలో కనెక్ట్ చేసిన ఎల్ఈడీ డీఆర్ ఎల్ లు, వాలుగా ఉండే రూఫ్‌లైన్ వంటి ఆధునిక డిజైన్ ఏర్పాటు చేశారు. కర్వ్ ఇంజిన్ ను కూల్ చేసేందుకు ఫ్రంట్ గ్రిల్ ఏర్పాటు చేశారు. నిలువు హెడ్‌ల్యాంప్‌లు, ఫ్లష్ డోర్ హ్యాండిళ్లు, డ్యూయల్-టోన్ 18 అంగుళాల అల్లాయ్ వీల్స్, షార్క్ ఫిన్ యాంటెన్నా, అందమైన స్పాయిలర్ తదితర అదనపు ప్రత్యేకతలు ఉన్నాయి. టాటా కర్వ్ ఐసీఈ పొడవు 4,308 ఎంఎం, వెడల్పు 1,810 ఎంఎం, ఎత్తు 1,630 ఎంఎం, గ్రౌండ్ క్లియరెన్స్ 208 ఎంఎం ఉంటుంది.

ఇంటీరియర్..

టాటా కర్వ్ ఐసీఈ ఇంటీరియర్ డిజైన్ ఎంతో ఆకట్టుకుంటోంది. లోపల 12.3 అంగుళాల టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్ ఉన్నాయి. హారియర్, సఫారి నుంచి తీసుకున్న నాలుగు స్పోక్ ఇల్యూమినేటెడ్ స్టీరింగ్ వీల్‌తో సహా డ్యూయల్-స్క్రీన్ సెటప్‌ ఏర్పాటు చేశారు. దీని డ్యాష్‌బోర్డ్ డిజైన్ లేఅవుట్ నెక్సాన్ ఈవీని నుంచి తీసుకున్నారు.

ఇతర ప్రత్యేకతలు..

పనోరమిక్ సన్‌రూఫ్, వెంటిలేటెడ్ ఫ్రంట్ సీట్లు, ఎయిర్ కండిషనింగ్ కోసం టచ్ కంట్రోల్స్, 360 డిగ్రీ కెమెరా, ఫ్రంట్ పార్కింగ్ సెన్సార్లు, వెనుక ఏసీ వెంట్ లు, వైర్‌లెస్ ఫోన్ ఛార్జర్, సిక్స్ వే పవర్ అడ్జస్టబుల్ డ్రైవర్ సీటు అదనపు ప్రత్యేకతలు. ఇంటీరియర్ డ్యూయల్-టోన్ బుర్గుండి, బ్లాక్ థీమ్‌లో ఉంటుంది. మీరు ఎంపిక చేసుకున్న ట్రిమ్ ను బట్టి కొంచె వైవిధ్యాలు కూడా ఉంటాయి.

భద్రత పరంగా..

కారులో భద్రతా ప్రమాణాలకు అత్యంత ప్రాధాన్యం ఇచ్చారు. దీనిలో భాగంగా ఆరు ఎయిర్‌బ్యాగ్‌లు, బ్లైండ్ వ్యూ మానిటరింగ్‌తో కూడిన 360 డిగ్రీ కెమెరా, ఆటో-హోల్డ్‌తో కూడిన ఎలక్ట్రానిక్ పార్కింగ్ బ్రేక్, ఆల్-వీల్ డిస్క్ బ్రేక్‌లు, లెవల్ 2 అడాస్ తదితర వాటిని ఏర్పాటు చేశారు.

మూడు ఇంజిన్ ఎంపికలు..

టాటా కర్వ్ ఐసీఈ మూడు రకాల ఇంజిన్ల ఎంపికలో అందుబాటులో ఉంది. 1.2 లీటర్ టర్వోచార్జ్ పెట్రోల్ ఇంజిన్, 1.5 లీటర్ డీజిల్ ఇంజిన్, జీడీఐ టర్బోపెట్రోల్ 1.2 లీటర్ ఇంజిన్ ఆప్షన్లు ఉన్నాయి. ఈ మూడింటికీ 6-స్పీడ్ ఎంటీ లేదా 7-స్పీడ్ డ్యూయల్ క్లచ్ ఆటోమేటిక్ (డీసీటీ)తో జత చేశారు.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..