కేంద్ర ప్రభుత్వం త్వరలో ప్రవేశపెట్టనున్న బడ్జెట్ కోసం దేశ ప్రజలందరూ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ముఖ్యంగా ఆదాయపు పన్ను విధానంలో మినహాయింపు పరిమితి ఎంత వరకూ ఉంటుందన్న ప్రశ్న అందరిలో తలెత్తుతోంది. దీనిపై వేతన జీవులందరూ చర్చించుకుంటున్నారు. మధ్య తరగతి, వేతన దారులు తమకు అనుకూలంగా బడ్జెట్ ఉంటుందని ఆశలు పెట్టుకున్నారు.
ఇటీవల జరిగిన ఎన్నికలలో ఎన్ డీఏ కూటమి విజయం సాధించింది. ప్రధానమంత్రిగా నరేంద్ర మోదీ మూడోసారి బాధ్యతలు స్వీకరించారు. ఆయన ప్రభుత్వం జూలైలో కొత్త బడ్జెట్ ను ప్రవేశపెట్టనుంది. ఈసారి కొత్త పన్ను విధానంలో మినహాయింపు పరిమితిని రూ.5 లక్షలకు పెంచవచ్చనే అంచనాలు ఉన్నాయి. సంక్షేమ పథకాలు, ఇతర కేటాయింపులలో పెద్దగా మార్పులు ఉండబోవని భావిస్తున్నారు. అత్యధిక పన్ను స్లాబ్‌కు సంబంధించిన థ్రెషోల్డ్‌ను రూ. 20 లక్షలకు పెంచాలనే అభ్యర్థనలు ఉన్నప్పటికీ, పాత పన్ను విధానంలో ఉన్న రేట్లను ప్రభుత్వం అంగీకరించకపోవచ్చు.
మధ్యతరగతి ప్రజలకు పన్ను మినహాయింపులు ఇవ్వడంతో పాటు దేశ జీడీపీ వృద్ధిని పెంచాలని ప్రభుత్వం చూస్తోంది. ఇందుకోసం కొన్ని వ్యక్తిగత ఆదాయపు పన్ను రేట్లను తగ్గించడానికి చర్యలు తీసుకుంటున్నారని విశ్వసనీయ సమాచారం.
కొత్త పన్ను విధానంలో రూ.3 లక్షల వరకూ జీరో ట్యాక్స్ ఉంది. ఆ పరిమితిని ఈ సారి బడ్జెట్ లో రూ.5 లక్షలకు పెంచనున్నటు అంచనా. ఇది కొత్త పన్ను విధానంలో రిటర్న్‌లను దాఖలు చేసే వారికి మాత్రమే వర్తిస్తుంది. తక్కువ సంపాదన ఉన్న వారికి మినహాయింపులు ఇస్తే వారికి ఆదాయం పెరుగుతుందని, తద్వారా కొనుగోలు శక్తి కూడా మెరుగవుతుంది. ఆ కొనుగోళ్ల తో వ్యాపార, పరిశ్రామిక వర్గాలకూ మేలు జరుగుతుందని భావిస్తున్నారు. అయితే బడ్జెట్ ప్రవేశపెట్టే సమయానికి దీనిపై నిర్ణయం తీసుకుంటారని భావిస్తున్నారు.
కేంద్ర ప్రభుత్వం పన్ను పరిమితిని రూ.5 లక్షలకు పెంచుతూ నిర్ణయం తీసుకుంటే దేశంలో చాలామంది వేతన జీవులకు ఊరట లభిస్తుంది. రూ. 7.6 లక్షల నుంచి రూ. 50 లక్షల మధ్య ఆదాయం ఉన్నవారికి రూ. 10,400 ( 4 శాతం ఆరోగ్యం & విద్య సెస్‌తో సహా) తగ్గింపు లభిస్తుంది. రూ. 50 లక్షలకు పైబడి రూ. ఒక కోటి వరకూ ఆదాయం ఉన్నవారికి రూ.11,440 (సెస్ , 10 శాతం సర్‌ఛార్జ్‌తో సహా) ప్రయోజనం కలుగుతుంది. అలాగే రూ. ఒక రూ.కోటికి పైబడి రూ.2 కోట్లు వరకూ సంపాదించే వారికి రూ. 11,960 (సెస్, 15 శాతం సర్‌ఛార్జ్‌తో సహా) తక్కువగా ఉంటుంది. రూ.2 కోట్ల కంటే ఎక్కువ ఆదాయం ఉన్నవారికి రూ. 13 వేల (సెస్, 25 శాతం సర్‌ఛార్జ్‌తో సహా) తగ్గింపు లభిస్తుంది.
కేంద్ర ప్రభుత్వం ప్రకటించనున్న పన్ను విధానంపై మార్కెట్ నిపుణులు ఆర్థిక వేత్తలు పలు రకరాల అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. ఆ ప్రకారం..
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..