Business Idea : ఇంట్లోనే ఉండి హౌస్‌వైవ్స్ ఈజీగా చేయగలిగే బిజినెస్‌లు ఇవే..నెలకు రూ. 50 వేల దాకా సంపాదన

| Edited By: Ravi Kiran

Mar 26, 2023 | 10:03 AM

గృహిణి అనగానే ఇంటి బాధ్యతలు, పిల్లలను చూసుకోవడం...ఈ భావన నేటికి అలాగే పాతుకుపోయింది. వారిలో ఎంత నైపుణ్యం ఉంటే ఇల్లు, కుటుంబం, పిల్లలు నిర్వహించగలరు.

Business Idea : ఇంట్లోనే ఉండి హౌస్‌వైవ్స్ ఈజీగా చేయగలిగే బిజినెస్‌లు ఇవే..నెలకు రూ. 50 వేల దాకా సంపాదన
Business Ideas
Follow us on

గృహిణి అనగానే ఇంటి బాధ్యతలు, పిల్లలను చూసుకోవడం…ఈ భావన నేటికి అలాగే పాతుకుపోయింది. వారిలో ఎంత నైపుణ్యం ఉంటే ఇల్లు, కుటుంబం, పిల్లల బాధ్యతను నిర్వహించగలరు. కుటుంబ బాధ్యతలను మోయడం అంత సులభం కాదు. నేటికాలం మహిళలు పురుషులతో సమానం పనిచేస్తున్నారు. ఇంటి బాధ్యతలతో పాటు ఉద్యోగాలు చేస్తున్న మహిళలు ఎంతో మంది ఉన్నారు.

ఈ మధ్య కాలంలో స్టార్టప్‌ల జోరు పెరిగింది. వ్యాపారంలో ఆసక్తి ఉన్న గృహిణులు వీటిని సద్వినియోగం చేసుకోవచ్చు. బ్యాంకుల నుంచి రుణాలు తీసుకుని పెద్ద పెద్ద వ్యాపారాలు ప్రారంభించే బదులు ఇంట్లో నుంచే చిన్నగా వ్యాపారం ప్రారంభించవచ్చు. చిన్నగా మొదలుపెట్టిన వ్యాపారంలో వచ్చే లాభాలను పరిగణలోకి తీసుకుని వ్యాపారాన్ని మరింతగా విస్తరించుకోవచ్చు. చిన్న మూలధనంతో ఏ వ్యాపారం లాభదాయకంగా ఉంటుందో అర్థం చేసుకోవడం ముఖ్యం. అటువంటి కొన్ని వ్యాపార ఆలోచనలను గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం.

ఇ-టైలింగ్:

ఇవి కూడా చదవండి

ఆన్‌లైన్‌లో ఉత్పత్తులను విక్రయించడానికి ఎలక్ట్రానిక్ రిటైలింగ్ లేదా ఇ-టైలింగ్ ఒక గొప్ప మార్గం. ఎవరైనా తమ ఉత్పత్తులను ఫ్లిప్‌కార్ట్ లేదా అమెజాన్ వంటి ఇ-కామర్స్ సైట్‌లలో జాబితా చేయవచ్చు. వారు కేటలాగ్, డెలివరీ, చెల్లింపు వంటి వాటిని నిర్వహిస్తారు. వారితో ప్యానలింగ్ చేసిన తర్వాత, మీరు దుస్తులు, గృహాలంకరణ వస్తువులు లేదా మీకు కావలసిన వాటిని అమ్మవచ్చు. అయితే దీని కోసం టోకు వ్యాపారిని వెతకాలి. ఇ-కామర్స్ సైట్లలో ఉత్పత్తులను విక్రయించవచ్చు.

టిఫిన్ సెంటర్:

వేలాది మంది కార్మికులు లేదా గ్రామాల నుండి నగరాలకు పని కోసం వచ్చేవారు ఆరోగ్యకరమైన ఆహారాన్ని కోరుకుంటారు. ఎవరైనా తమ డిమాండ్‌కు తగ్గట్టుగా తక్కువ ధరకు టిఫిన్‌ను అందించగలిగితే పెద్ద మొత్తంలో డబ్బు సంపాదించే అవకాశం ఉంది. వ్యాపారం పెరిగితే, ఆర్డర్ ప్రకారం సమయానికి ఆహారం అందించేందుకు వంటవాళ్లను నియమించుకోవచ్చు. డెలివరీ గురించి ఆందోళన ఉంటే Zomato, Swiggy, Grab, Uber Eats వంటి ఫుడ్ డెలివరీ యాప్‌లను తీసుకోవచ్చు.

డే కేర్ సెంటర్లు:

గృహిణులకు ఉత్తమ వ్యాపారాలలో డే కేర్ సెంటర్లు ఒకటి. ఎక్కువ పెట్టుబడి అవసరం లేదు. చిన్న పిల్లలు ఉన్నా సమస్య లేదు. బదులుగా ఒక ప్లేమేట్ పొందుతారు. ఈ వ్యాపారాన్ని ప్రారంభించడానికి ఒక చిన్న స్థలం మాత్రమే అవసరం. ఇది ఇంటి లోపల ఉంటే మంచిది. పిల్లలకు ఆరోగ్యకరమైన ఆహారాన్ని వండే మనిషిని పెట్టుకుంటే చాలు. అప్పుడే డే కేర్ సెంటర్ సజావుగా సాగుతుంది.

ఇంట్లోనే బ్యూటీ పార్లర్:

అందం మీద అందరికీ ఆసక్తి ఉంటుంది. మీరు కూడా బ్యూటీషియన్ రాణించవచ్చు. ఇందులో మంచి ఆదాయం ఉంటుంది. దీన్ని ఇంట్లో నుంచే ప్రారంభించవచ్చు. ఒకవేళ మీరు బ్యూటీషియన్ కోర్సు చేసినట్లయితే బయటషాప్ ఒపెన్ చేయవచ్చు. ఇందుకోసం బ్యాంకు నుంచి రుణం తీసుకోవచ్చు. ముఖ్యంగా వ్యాపార రుణాలపై వడ్డీ రేట్లు సాధారణం కంటే తక్కువగా ఉన్నాయి. మీరు మార్కెటింగ్ కోసం కొంత డబ్బు ఖర్చు చేయాలి. అయితే గృహిణులకు బ్యూటీపార్లర్ మంచి వ్యాపార ఆలోచన అనడంలో సందేహం లేదు.

బోటిక్ ,టైలరింగ్:

మీకు మంచి ఫ్యాషన్ సెన్స్ ఉంటే బోటిక్ వ్యాపారం అనువైనది. మీరు ప్యాటర్న్ కటింగ్ లేదా టైలరింగ్‌లో నిష్ణాతులు కాకపోతే, స్కెచ్‌లు, ఇలస్ట్రేషన్‌లను రూపొందించగల టైలర్‌ను నియమించుకోండి. చిన్న బోటిక్‌లను సెటప్ చేయడానికి కొంచెం స్థలం మాత్రమే అవసరం. దీన్ని ఇంట్లో కూడా ప్రారంభించవచ్చు.

 

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి