Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Business Ideas: ఉద్యోగం చేసి విసిగిపోయారా.. లక్షలు సంపాదించే ఈ బిజినెస్ ఐడియా మీ కోసం

మీరు వ్యాపారం కోసం చూస్తున్నట్లయితే.. ఈ వార్త మీ కోసం మాత్రమే. ప్రతి నెలా మీరు హాయిగా లక్షలు సంపాదించగల వ్యాపారాన్ని అందించే ఫుడ్ ప్రొడక్ట్ ఇక్కడ..

Business Ideas: ఉద్యోగం చేసి విసిగిపోయారా.. లక్షలు సంపాదించే ఈ బిజినెస్ ఐడియా మీ కోసం
Business Ideas
Follow us
Sanjay Kasula

|

Updated on: Mar 21, 2023 | 7:43 AM

మీరు కూడా 9-5 ఉద్యోగం చేసి అలసిపోతే లేదా మీరు ఉద్యోగం చేయకూడదనుకుంటున్నారా..? మీరు వ్యాపారం కోసం చూస్తున్నట్లయితే.. ఈ వార్త మీ కోసం మాత్రమే. ప్రతి నెలా మీరు హాయిగా లక్షలు సంపాదించగల వ్యాపారాన్ని అందించే ఫుడ్ ప్రొడక్ట్ ఇక్కడ మీకు మేము పరిచయం చేస్తాం. దీంతో మీరు చిన్న వ్యాపారంతో లక్షలు సంపాధించవచ్చు. అదే ముర్మురా మేకింగ్ బిజినెస్.  ముర్మురా గురించి మనకు అందరికి చాలా తెలిసినదే. అయితే ఇది తయారీ ఎలానో తెలుసుకుందాం..  ముర్మురా లేదా లై అంటారు. పశ్చిమ బెంగాల్, బీహార్, జార్ఖండ్‌లలో ముర్మురాకు ఝల్ ముర్హిగా ప్రాధాన్యత ఇవ్వబడుతుంది. అదేవిధంగా, ఇది వివిధ వంటకాలతో వివిధ ప్రదేశాలలో తయారు చేయబడుతుంది. ముంబైలో దీనిని భేల్‌పూరిగానూ, బెంగళూరులో చుర్మురిగానూ తింటారు.

గుడిలో ప్రసాదంగా కూడా ముర్మురా అన్నాన్ని ఉపయోగిస్తారు. ముర్మురా అంటే దేశంలోని ప్రతి మూలలో లై వినియోగిస్తారు. ధనికుడైనా పేదవారైనా అందరూ దీన్ని ఎంతో ఉత్సాహంగా తింటారు. అంతేకాదు దీన్ని స్ట్రీట్ ఫుడ్‌గా కూడా ఉపయోగిస్తారు. వడ్ల నుంచి చేసే మ‌ర‌మ‌రాల‌ను కూడా మ‌నం ఆహారంగా తీసుకుంటూ ఉంటాం. వీటితో ర‌క‌ర‌కాల ఆహార ప‌దార్థాల‌ను త‌యారు చేసుకుని తింటూ ఉంటాం. ఈ మ‌ర‌మ‌ర‌లాతో ఎక్కువ‌గా ఉగ్గాణీని, మిక్చ‌ర్ వంటి వాటిని త‌యారు చేస్తారు.

ఖాదీ అండ్ విలేజ్ ఇండస్ట్రీస్ కమిషన్ (కెవిఐసి) గ్రామ పరిశ్రమల ఉపాధి పథకం కింద ముర్మురా తయారీ యూనిట్‌ను ఏర్పాటు చేయడానికి లోన్ సౌకర్యం కల్పిస్తోంది. ఇందుకు మీరు ప్రాజెక్ట్ రిపోర్ట్‌ను రెడీ చేస్తోంది. ఈ ప్రాజెక్ట్ రిపోర్ట్ ప్రకారం, ఈ వ్యాపారం ప్రారంభించడానికి మొత్తం ఖర్చు రూ. 3.55 లక్షలు. ఈ వ్యాపారాన్ని ప్రారంభించడానికి మీ వద్ద డబ్బు లేకుంటే, ప్రధాన మంత్రి ముద్ర లోన్ యోజన కింద రుణం తీసుకోవచ్చు. ఈ ప్రాజెక్ట్ వ్యయం ఆధారంగా మీరు లోన్ కోసం దరఖాస్తు చేసుకోవచ్చు.

FSSAI నుంచి ఆహార లైసెన్స్ అవసరం..

పఫ్డ్ రైస్ తయారీకి ఉపయోగించే ప్రధాన ముడి పదార్థం వరి లేదా బియ్యం. మీరు మీ సమీప వరి మార్కెట్ నుంచి హోల్‌సేల్ ధరకు కూడా కొనుగోలు చేయవచ్చు. పఫ్డ్ రైస్ లేదా ముర్మురా తయారు చేయడం ఆహార పదార్థాల క్రిందకు వస్తుంది. అందువల్ల, ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (FSSAI) నుంచి ఫుడ్ లైసెన్స్ పొందవలసి ఉంటుంది.

మీరు ఎంత సంపాదిస్తారు?

పఫ్డ్ రైస్ లేదా లై చేయడానికి కిలోకు 10 నుండి 20 రూపాయలు ఖర్చు అవుతుంది. చిల్లర దుకాణదారులు రూ.40-45కు విక్రయిస్తున్నారు. ఈ వ్యాపారం ద్వారా మీరు ఇంట్లో కూర్చొని లక్షల రూపాయలు సంపాదించవచ్చు.

మరిన్ని బిజినెస్ న్యూస్ కోసం