Best Wheelchairs: తక్కువ ధరకే లైట్ వెయిట్ వీల్‌చైర్లు.. సౌకర్యాన్ని కోరుకునే వారి కోసం..

|

Jul 04, 2024 | 3:14 PM

తామంతట తాము లేచి నిలబడలేని వ్యక్తులకు కదలడానికి ఇవే ఆధారంగా ఉంటాయి. వీటిని ఇండోర్, అవుట్ డోర్లలో కూడా వినియోగించుకోవచ్చు. మీ ప్రియమైన వారికి సులభంగా సౌకర్యాన్ని జోడించవచ్చు. వాస్తవానికి మార్కెట్లో చాలా రకాలైన వీల్ చైర్లు అందుబాటులో ఉంటాయి. అయితే బరువు తక్కువగా ఉండే వీల్ చైర్ల వల్ల అదనపు ప్రయోజనాలు ఉంటాయి.

Best Wheelchairs: తక్కువ ధరకే లైట్ వెయిట్ వీల్‌చైర్లు.. సౌకర్యాన్ని కోరుకునే వారి కోసం..
Lightweight Wheelchair
Follow us on

వృద్ధులకు, నడవలేని వారికి, ఏదైనా వైకల్యం వచ్చిన వారికి, లేదా ఏదైనాన ఆపరేషన్ తర్వాత కోలుకుంటున్న వారికి వీల్ చైర్లు చాల ఉపయుక్తంగా ఉంటాయి. తామంతట తాము లేచి నిలబడలేని వ్యక్తులకు కదలడానికి ఇవే ఆధారంగా ఉంటాయి. వీటిని ఇండోర్, అవుట్ డోర్లలో కూడా వినియోగించుకోవచ్చు. మీ ప్రియమైన వారికి సులభంగా సౌకర్యాన్ని జోడించవచ్చు. వాస్తవానికి మార్కెట్లో చాలా రకాలైన వీల్ చైర్లు అందుబాటులో ఉంటాయి. అయితే బరువు తక్కువగా ఉండే వీల్ చైర్ల వల్ల అదనపు ప్రయోజనాలు ఉంటాయి. మార్కెట్లో తక్కువ ధరకు అందుబాటులో ఉన్న బెస్ట్ వీల్ చైర్లు అది కూడా తక్కువ బరువు ఉండే వాటి గురించి తెలుసుకుందాం..

తేలికైన వీల్ చైర్ల వల్ల ప్రయోజనాలు ఇవి..

సులభంగా కదలొచ్చు: పెద్ద చక్రాలు కలిగిన తేలికైన వీల్‌చైర్‌లు ఆపరేట్ చేయడానికి సులభంగా ఉంటాయి. మీరు త్వరగా కదలడానికి అవకాశం ఉంటుంది. కదలడానికి మీ చేతులను ఎక్కువగా ఒత్తిడి చేయవలసిన అవసరం లేదు.

కాంపాక్ట్ సైజ్: పోర్టబుల్ వీల్‌చైర్లు కాంపాక్ట్ సైజ్ ఉంటాయి. వీటిని ఇంట్లో స్టోర్ చేయడం కూడా సులభంగా ఉంటుంది. వీల్‌చైర్‌ను మీ మంచం కింద లేదా మీ ఇంట్లోని అతి చిన్న స్థలంలో మీకు మళ్లీ అవసరమైనంత వరకు మడిచి ఉంచవచ్చు.

ఎక్కువ బరువు మోస్తాయి: తేలికైన చక్రాల కుర్చీలు ఎక్కువ బరువును మోసే అవకాశం ఉంటుంది. మీ బరువు 250 పౌండ్లు లేదా అంతకంటే తక్కువ ఉంటే తేలికైన వీల్ చైర్‌ను పరిగణించండి. ఈ వీల్‌చైర్లు వారి బలమైన, దీర్ఘకాలం ఉండే ఫ్రేమ్‌ల కారణంగా వినియోగదారు బరువును సమానంగా పంపిణీ చేస్తాయి.
ఎక్కడైనా తేలికగా: మీరు ఇంటి బయట, ఇంటి లోపల తేలికపాటి వీల్‌చైర్‌ని ఉపయోగించవచ్చు. ఫలితంగా మీరు బయటికి వెళ్లడానికి ఇబ్బంది పడాల్సిన అవసరం ఉండదు.

బెస్ట్ వీల్ చైర్లు..

కేహెచ్ఎల్ వీల్ చైర్ ఫోల్డబుల్ లైట్ వెయిట్..

మీకు వైద్యులు శారీరక శ్రమ తగ్గించాలని, విశ్రాంతి తీసుకోవాలని సూచన చేస్తే తేలికపాటి వీల్‌చైర్‌ను కొనుగోలు చేయడం అవసరం. మీ కాళ్లపై లేదా వీపుపై ఎక్కువ ఒత్తిడి లేకుండా స్వేచ్ఛగా తిరగడానికి ఇవి ప్రయోజనకరంగా ఉంటుంది. ఈ కుర్చీలో స్థిర, వెడల్పు, ప్యాడెడ్ ఆర్మ్ ప్యాడ్‌లతో పాటు స్వింగ్-ఇన్, స్వింగ్-అవుట్ తొలగించగల ఫుట్‌రెస్ట్‌లు ఉన్నాయి. ఇంకా, ఈ తేలికపాటి వీల్ చైర్ బరువు 2 కిలోల 50 గ్రాములు.
దీని ధర అమెజాన్ ప్లాట్ ఫారంలో రూ. 7,898గా ఉంది.

కోస్మోకేర్ ఎలిగెంట్ డిజైర్ ప్రీమియం లైట్ వెయిట్ ఫోల్డింగ్ వీల్ చైర్..

మీరు కోస్మోకేర్ నుంచి ఈ తేలికపాటి వీల్‌చైర్‌ను ఏ రకమైన ఉపరితలంపైనైనా స్వేచ్ఛగా, హాయిగా తిరిగేందుకు ఉపకరిస్తుంది. ఈ వీల్‌చైర్ ఫీచర్లు, స్పెక్స్ గురించి మాట్లాడితే, మడతపెట్టినప్పుడు మరింత కాంపాక్ట్ చేయడానికి డ్రాప్ బ్యాక్ హ్యాండిల్‌తో కూడిన అల్యూమినియం ఫ్రేమ్, అల్యూమినియం స్పోక్ వీల్స్, ఫ్రంట్ క్యాస్టర్‌లు ఉంటాయి. ఈ తేలికైన వీల్ చైర్ 100 కిలోల బరువును మోయగలుగుతుంది. దీని ధర అమెజాన్ ప్లాట్ ఫారంలో రూ. 10,944గా ఉంది.

రైడర్ వీల్ చైర్ లైట్ వెయిట్..

రైడర్ అటెండెంట్ వీల్‌చైర్ ఒక వినూత్న డిజైన్‌ను కలిగి ఉంది. దీనిని మడతపెట్టడానికి, మళ్లీ వినియోగిచడానికి చాలా సులభంగా ఉంటుంది. ఈ వీల్‌చైర్ మీ సీటింగ్ పొజిషన్‌ను మార్చడానికి, లేదా పైకి లేపడానికి మిమ్మల్ని అనుమతిస్తుంది. ఇది మీ చేతులను కూడా కంఫర్ట్ గా ఉంచుతుంది. వీల్‌చైర్‌లో సీట్ బెల్ట్ ఉంటుంది, అది మిమ్మల్ని కుర్చీకి సురక్షితంగా ఉంచుతుంది. హ్యాండ్ బ్రేక్ లతో పాటు అటెండెంట్ బ్రేక్‌లు కూడా ఉంటాయి. దీని ధర అమెజాన్ ప్లాట్ పారంలో రూ. 9,500గా ఉంది.

డైల్ డీఆర్ కేర్ తేలికైన ఫోల్డబుల్ వీల్ చైర్..

ఈ తేలికైన వీల్‌చైర్‌ అసమాన, ఏటవాలు వంపుతిరిగిన భూభాగాలలో కూడా సులభంగా ఉపయోగించవచ్చచు. దీనికి హ్యాండ్ బ్రేక్‌లు ఉంటాయి. ఫ్లేర్డ్ హ్యాండిల్స్ కారణంగా ఫ్రేమ్‌తో ఢీకొనకుండా వెనుక భాగం మరింత ఫ్లాట్‌గా మడవచ్చు. దీని ధర అమెజాన్ లో రూ. 9,999గా ఉంది.

మొబిలిటీకార్ట్ అల్ట్రా లైట్ వెయిట్ ఫోల్డింగ్ ట్రాన్సిట్ వీల్ చైర్..

ఈ వీల్ చైర్ చాలా కాంపాక్ట్, తేలికైనది. ఫీచర్ల గురించి మాట్లాడితే , ఈ వీల్ చైర్ ఎపాక్సీ పౌడర్ కోటెడ్ ఫ్రేమ్‌తో వస్తుంది. వీల్ చైర్ అల్యూమినియం ఫ్రేమ్ నుంచి ఫ్లిప్-అప్ ఫుట్‌ప్లేట్, ఫ్లిప్-అప్ ఆర్మ్‌రెస్ట్‌లు, డ్రాప్-బ్యాక్ హ్యాండిల్, సీట్ బెల్ట్, సాలిడ్ మాగ్ వీల్స్, సాలిడ్ క్యాస్టర్‌లతో తయారైంది. వీల్ చైర్ 6 కిలోల బరువు మాత్రమే ఉంటుంది.100 కిలోల వరకు బరువును మోస్తుంది.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..