Budget Friendly EVs: అతి తక్కువ ధరలో లభించే ఎలక్ట్రిక్‌ స్కూటర్లు ఇవే.. రూ. 50వేల నుంచి ధర ప్రారంభం..

|

Mar 29, 2024 | 7:53 AM

పెరుగుతున్న పెట్రోలు ధరల భారం, పర్యావరణ రక్షణపై అవగాహన, కేంద్రం అందిస్తున్న ప్రోత్సాహంతో ప్రజలకు ఎలక్ట్రిక్ వాహనాలపై ఆసక్తి పెరిగింది. పెట్రోలుతో నడిచే ద్విచక్ర వాహనాలతో పోల్చితే ఎలక్ట్రిక్ స్కూటర్లు ఎక్కువ ధర ఉంటాయని ప్రజలు భావిస్తారు. వాటిని కొనుగోలు చేయాలన్న ఆసక్తి ఉన్నా ధరకు భయపడి వెనుకంజ వేస్తారు. అయితే రూ.50 వేల నుంచి ఎలక్ట్రిక్ వాహనాలు మార్కెట్ లో అందుబాటులో ఉన్నాయి.

Budget Friendly EVs: అతి తక్కువ ధరలో లభించే ఎలక్ట్రిక్‌ స్కూటర్లు ఇవే.. రూ. 50వేల నుంచి ధర ప్రారంభం..
Kinetic E Luna
Follow us on

దేశంలో ఎలక్ట్రిక్ వాహనాల వినియోగం రోజురోజుకూ పెరుగుతున్నందున వివిధ రకాల మోడళ్ల స్కూటర్లు మార్కెట్ లోకి విడుదల అవుతున్నాయి. కొత్త ఫీచర్లు, ఉత్తమ మైలేజీతో ఆకట్టుకుంటున్నాయి. పెరుగుతున్న పెట్రోలు ధరల భారం, పర్యావరణ రక్షణపై అవగాహన, కేంద్రం అందిస్తున్న ప్రోత్సాహంతో ప్రజలకు ఎలక్ట్రిక్ వాహనాలపై ఆసక్తి పెరిగింది. పెట్రోలుతో నడిచే ద్విచక్ర వాహనాలతో పోల్చితే ఎలక్ట్రిక్ స్కూటర్లు ఎక్కువ ధర ఉంటాయని ప్రజలు భావిస్తారు. వాటిని కొనుగోలు చేయాలన్న ఆసక్తి ఉన్నా ధరకు భయపడి వెనుకంజ వేస్తారు. అయితే రూ.50 వేల నుంచి ఎలక్ట్రిక్ వాహనాలు మార్కెట్ లో అందుబాటులో ఉన్నాయి. వాటి వివరాలు, ప్రత్యేకతలు తెలుసుకుందాం.

కోమాకి ఎక్స్ జీటీ ఎక్స్ వన్..

ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ రూ.50,855 ధరకు మార్కెట్ లో అందుబాటులో ఉంది. ఈ వాహనం చాలా తేలికంగా ఉండడంతో సులభంగా నడపవచ్చు. నగరంలో ప్రయాణానికి చాలా అనుకూలంగా ఉంటుంది. ధర తక్కువగా ఉండడం వల్ల సామాన్యులు కూడా కొనుగోలు చేయవచ్చు.

కైనెటిక్ ఈ-లూనా..

ఈ స్కూటర్ ను ఒక్కసారి చార్జ్ చేస్తే సుమారు 110 కిలోమీటర్లు ప్రయాణం చేయవచ్చు. మంచి స్టైలిష్ లుక్ లో ఆకట్టుకుంటుంది. రెట్రో డిజైన్, ఆధునిక ఎలక్ట్రిక్ ప్రోపల్షన్ దీని ప్రత్యేకతలు. దీని ధర రూ.69,990 (ఎక్స్ షోరూమ్).

ఇవి కూడా చదవండి

హీరో ఎలక్ట్రిక్ ఆప్టిమా..

పై రెండు స్కూటర్లతో పోల్చితే దీని ధర కొంచెం ఎక్కువ. ఒక్కసారి రీచార్జి చేస్తే సుమారు 135 కిలోమీటర్లు ప్రయాణం చేయవచ్చు. రీజెనరేటివ్ బ్రేకింగ్, రిమోట్ డయాగ్నస్టిక్స్, అధునాతన సాంకేతిక వ్యవస్థ దీని ప్రత్యేకతలు. సుదూర ప్రయాణానికి అనుకూలంగా ఉంటుంది. ఈ స్కూటర్ ధర రూ. 1.06 లక్షలు.

ప్రత్యేకతలు..

ఈ మూడు స్కూటర్లలో దేనికదే ప్రత్యేకతను కలిగి ఉన్నాయి. కోమాకి ఎక్స్ జీటీ ఎక్స్ వన్ స్కూటర్ మంచి ఎంట్రీ-లెవల్ ఎంపిక. సామాన్యులందరికీ అందుబాటు ధరలో ఉంటుంది. కైనెటిక్ ఈ-లూనా అద్భుత స్టైల్ తో ఆకట్టుకుంటుంది. స్టైల్, నోస్టాల్జియాకు ప్రాధాన్యం ఇచ్చే వారిని ఆకర్షిస్తుంది, ఇక ఎలక్ట్రిక్ ఆప్టిమాలో అధునాతన ఫీచర్లు ఉన్నాయి. టెక్నాలజీని ఇష్టపడే వారికి ఇది సరైన ఎంపిక. దేశంలోని ఎలక్ట్రిక్ స్కూటర్ల మార్కెట్ లో ఈ మూడు స్కూటర్లు తమ ప్రత్యేకతను నిలుపుకొంటాయని నిపుణులు భావిస్తున్నారు. అలాగే ఎలక్ట్రిక్ వాహనాల వినియోగం పెరిగేందుకు కూడా దోహద పడతాయి.

అవసరానికి అనుగుణంగా..

ప్రజలు తమ అవసరాలకు అనుగుణంగా ఉపయోగపడే వాహనాలను ఎంచుకోవాలి. మార్కెట్ లో ఎన్ని మోడళ్లు అదుబాటులో ఉన్నా తమ సౌకర్యానికి ప్రాధాన్యం ఇవ్వాలి. ధర, ఫీచర్లు, మైలేజీ, స్టైల్ ఇవన్నీ పరిగణనలోకి తీసుకుని ఎంచుకోవాలి. ఎలక్ట్రిక్ వాహనాల వినియోగాన్ని పెంచే క్రమంలో భాగంగా కోనుగోలుదారులకు కేంద్ర ప్రభుత్వం సబ్సిడీలు కూడా ఇస్తుంది.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..