AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Personal Loan: అతి తక్కువ వడ్డీకి వ్యక్తిగత రుణాలు అందించే బ్యాంకులివే.. ఆ ఒక్కటే అర్హత..

ఎవరి వద్ద అప్పు కోసం వెతకకుండా సులభంగా ఒక్క క్లిక్ తో ఆన్ లైన్లో, ఒక్క అప్లికేషన్ తో ఆఫ్ లైన్లో సులభంగా లోన్లు పొందొచ్చు. అయితే పర్సనల్ లోన్ కావాలనుకునే వ్యక్తులకు తప్పనిసరిగా కావాల్సింది ఒకటి ఉంది. అదే సిబిల్ స్కోర్. ఇది ఎంత ఎక్కువ ఉంటే అంత తక్కువ వడ్డీ రేటుకు లోన్ మంజూరవుతుంది. అలాగే ఒక్కో బ్యాంకులో ఒక్కో వడ్డీ రేటు ఉంటుంది. ఆయా బ్యాంకుల్లో ఈ క్రెడిట్ స్కోర్ ఆధారంగానే లోన్లు వస్తాయి.

Personal Loan: అతి తక్కువ వడ్డీకి వ్యక్తిగత రుణాలు అందించే బ్యాంకులివే.. ఆ ఒక్కటే అర్హత..
Personal Loan
Madhu
|

Updated on: Mar 26, 2024 | 10:47 AM

Share

పర్సనల్ లోన్లు అసురక్షిత విభాగంలోకి వస్తాయి. ఎందుకంటే వీటికి గ్యారంటీలు ఉండవు. ఏ వస్తువులు, ఆస్తులు తనఖా లేకుండా వీటిని మంజూరు చేస్తారు. ఇవి అత్యవసర పరిస్థితుల్లో ఇవి బాగా ఉపకరిస్తాయి. ఎవరి వద్ద అప్పు కోసం వెతకకుండా సులభంగా ఒక్క క్లిక్ తో ఆన్ లైన్లో, ఒక్క అప్లికేషన్ తో ఆఫ్ లైన్లో సులభంగా లోన్లు పొందొచ్చు. అయితే పర్సనల్ లోన్ కావాలనుకునే వ్యక్తులకు తప్పనిసరిగా కావాల్సింది ఒకటి ఉంది. అదే సిబిల్ స్కోర్. ఇది ఎంత ఎక్కువ ఉంటే అంత తక్కువ వడ్డీ రేటుకు లోన్ మంజూరవుతుంది. అలాగే ఒక్కో బ్యాంకులో ఒక్కో వడ్డీ రేటు ఉంటుంది. ఆయా బ్యాంకుల్లో ఈ క్రెడిట్ స్కోర్ ఆధారంగానే లోన్లు వస్తాయి. ఈ నేపథ్యంలో తక్కువ వడ్డీ రేటుకు లోన్లు మంజూరు చేసే బెస్ట్ బ్యాంకులను మీకు పరిచయం చేస్తున్నాం.

ఐసీఐసీఐ బ్యాంక్.. దేశంలోని రెండో అతిపెద్ద ప్రైవేట్ రుణదాత అయిన ఐసీఐసీఐ బ్యాంక్, వ్యక్తిగత రుణాలను సంవత్సరానికి 10.65 శాతం నుంచి 16 శాతం వరకు వడ్డీ రేట్లు అందిస్తుంది. అదనంగా, బ్యాంక్ వర్తించే పన్నులతో పాటు 2.50 శాతం వరకు ప్రాసెసింగ్ ఛార్జీలను విధిస్తుంది.

హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్.. అతిపెద్ద ప్రైవేట్ బ్యాంక్ అయిని హెచ్‌డీఎఫ్‌సీ వ్యక్తిగత రుణాలను సంవత్సరానికి 10.5 శాతం నుంచి 24 శాతం వరకు వడ్డీ రేట్లు విధిస్తుంది. ఈ రుణాలకు ప్రాసెసింగ్ ఛార్జీలు రూ.4,999గా నిర్ణయించారు.

ఇవి కూడా చదవండి

స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా.. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ) కార్పొరేట్ దరఖాస్తుదారులకు వ్యక్తిగత రుణాలను సంవత్సరానికి 12.30 శాతం నుంచి 14.30 శాతం వడ్డీ రేటుతో అందిస్తుంది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు, స్థానిక సంస్థలు, విద్యా సంస్థలు (సీఎల్ఎస్ఈలు), అలాగే ప్రభుత్వ శాఖల ఉద్యోగులకు, వడ్డీ రేట్లు సంవత్సరానికి 11.30 శాతం నుంచి 13.80 శాతం వరకు ఉంటాయి. రక్షణ సిబ్బందికి సంవత్సరానికి 11.15 శాతం నుంచి 12.65 శాతం వరకు రాయితీ రేట్లు పొందుతారు.

బ్యాంక్ ఆఫ్ బరోడా.. ఈ బ్యాంకుతో సంబంధం ఉన్న ప్రైవేట్ రంగ ఉద్యోగులకు వ్యక్తిగత రుణాలను సంవత్సరానికి 13.15 శాతం నుంచి 16.75 శాతం వడ్డీ రేటుతో అందిస్తుంది. మరోవైపు ప్రభుత్వ ఉద్యోగులకు ఏడాదికి 12.40 శాతం నుంచి 16.75 శాతం వరకు రాయితీ రేట్లు అందజేస్తోంది. బ్యాంకుతో సంబంధం లేని ప్రైవేట్ రంగ ఉద్యోగులు సంవత్సరానికి 15.15 శాతం నుంచి 18.75 శాతం మధ్య రేట్లలో రుణాలను పొందవచ్చు.

పంజాబ్ నేషనల్ బ్యాంక్.. ఈ బ్యాంక్ రుణగ్రహీత క్రెడిట్ స్కోర్ ఆధారంగా సంవత్సరానికి 13.75 శాతం నుండి 17.25 శాతం వరకు వడ్డీ రేట్లను వసూలు చేస్తుంది. ప్రభుత్వ ఉద్యోగులకు సంవత్సరానికి 12.75 శాతం నుంచి 15.25 శాతం వరకు రాయితీ రేట్లు అందుతాయి.

కోటక్ మహీంద్రా బ్యాంక్.. కోటక్ మహీంద్రా బ్యాంక్ వ్యక్తిగత రుణాలపై వార్షిక కనీస వడ్డీ రేటును 10.99 శాతంగా నిర్ణయించింది. అయితే, ప్రాసెసింగ్ ఛార్జీలు పన్నులతో పాటు రుణం మొత్తంలో 3 శాతం వరకు ఉండవచ్చు.

యాక్సిస్ బ్యాంక్.. ఈ బ్యాంక్ వ్యక్తిగత రుణాలను సంవత్సరానికి 10.65 శాతం నుంచి 22 శాతం వరకు వడ్డీ రేట్లు అందిస్తుంది.

ఇండస్ఇండ్ బ్యాంక్.. ఈ బ్యాంక్ వ్యక్తిగత రుణాలను సంవత్సరానికి 10.49 శాతం వడ్డీ రేటుతో అందిస్తుంది. ఈ లోన్‌ల ప్రాసెసింగ్ చార్జీలు లోన్ మొత్తంలో 3 శాతం వరకు ఉండవచ్చు. రుణం మొత్తం రూ. 30,000 నుంచి రూ. 50 లక్షల వరకు ఉంటుంది.

కరూర్ వైశ్యా బ్యాంక్.. ఈ బ్యాంక్ సెక్యూర్డ్ లోన్‌లకు సంవత్సరానికి 11 శాతం, అన్‌సెక్యూర్డ్ పర్సనల్ లోన్‌లకు సంవత్సరానికి 13 శాతం వడ్డీ రేటును అందిస్తుంది.

ఎస్ బ్యాంక్.. ఈ బ్యాంక్ వ్యక్తిగత రుణాలను సంవత్సరానికి 10.49 శాతం వడ్డీ రేటుతో అందిస్తుంది. రుణ పదవీకాలం 72 నెలల వరకు పొడిగించవచ్చు. రుణగ్రహీతలు కొంత భాగాన్ని తిరిగి చెల్లించే అవకాశం ఉంటుంది. ఎస్ బ్యాంక్ నుంచి రూ. 50 లక్షల వరకు రుణాలు పొందవచ్చు.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..