Holi Offers: ఎలక్ట్రానిక్స్‌పై వావ్ అనేలా ఆఫర్స్.. ఏకంగా 60శాతం డిస్కౌంట్స్.. లిస్ట్‌లో అన్ని గృహోపకరణాలు..

హోలీ పండగ సందర్భంగా ప్రముఖ విజయ్ సేల్స్ సంస్థ ఎలక్ట్రానిక్ గాడ్జెట్స్ పై బంపర్ ఆపర్లు ప్రకటించింది. వివిధ రకాల వస్తువులను దాదాపు 60 శాతం డిస్కౌంట్ తో వినియోగదారులకు అందజేస్తుంది. ఎలక్ట్రానిక్స్ వస్తువులను కొనుగోలు చేయాలనుకునే వారికి ఇదే మంచి అవకాశం. స్పీకర్‌లు, ఏసీలు, కెమెరాలు, స్టైలింగ్ టూల్స్, కిచెన్ ఉపకరణాలు తదితర వాటిని ప్రత్యేక తగ్గింపు ధరకు కొనుగోలు చేయవచ్చు.

Holi Offers: ఎలక్ట్రానిక్స్‌పై వావ్ అనేలా ఆఫర్స్.. ఏకంగా 60శాతం డిస్కౌంట్స్.. లిస్ట్‌లో అన్ని గృహోపకరణాలు..
Vijay Sales
Follow us
Madhu

|

Updated on: Mar 26, 2024 | 11:20 AM

ఎలక్ట్రానిక్ వస్తువులు కొనుగోలు చేయాలనుకుంటున్నారా? అనువైన ధరలో ఎక్కడ దొరుకుతాయాయని వెతుకుతున్నారా? తగ్గింపు ధరకు కావాలనుకుంటున్నారా? అయితే మీ కోసమే ఈ బంపర్ ఆఫర్. హోలీ పండగ సందర్భంగా విజయ్ సేల్స్ వివిధ రకాల ఎలక్ట్రానిక్ వస్తువులపై ప్రత్యేక డిస్కౌంట్ అందజేస్తుంది. దాదాపు 60 శాతం తగ్గింపు ధరలో విక్రయిస్తుంది. ఎండలు మండుతున్న సమయంలో చల్లని కబురు తీసుకువచ్చింది. హోలీ పండగను బంధు, మిత్రులతో కలిసి ఆనందంగా జరుపుకోవడానికి, వేసవిలో చల్లదనాన్ని ఆస్వాదించడానికి అన్ని రకాల వస్తువులను అందుబాటులో ఉంచింది.

బంపర్ ఆఫర్..

హోలీ పండగ సందర్భంగా ప్రముఖ విజయ్ సేల్స్ సంస్థ ఎలక్ట్రానిక్ గాడ్జెట్స్ పై బంపర్ ఆపర్లు ప్రకటించింది. వివిధ రకాల వస్తువులను దాదాపు 60 శాతం డిస్కౌంట్ తో వినియోగదారులకు అందజేస్తుంది. ఎలక్ట్రానిక్స్ వస్తువులను కొనుగోలు చేయాలనుకునే వారికి ఇదే మంచి అవకాశం. స్పీకర్‌లు, ఏసీలు, కెమెరాలు, స్టైలింగ్ టూల్స్, కిచెన్ ఉపకరణాలు తదితర వాటిని ప్రత్యేక తగ్గింపు ధరకు కొనుగోలు చేయవచ్చు. సామాన్య , మధ్య తరగతి ప్రజలకు అందుబాటులో ఉండేలా, ప్రత్యేక తగ్గింపు ధరలను ప్రకటించింది.

రూ.449 నుంచి ప్రారంభం..

విజయ్ సేల్స్ ప్రత్యేక తగ్గింపులో భాగంగా పోర్టబుల్ బ్లూటూత్ స్పీకర్లు రూ.449 నుంచి అందుబాటులో ఉన్నాయి. అలాగే 60 డబ్ల్యూ పోర్ట్‌రోనిక్స్ డాష్ 12 బూమ్‌బాక్స్ రూ. 6,999కు లభిస్తుంది. దీని అసలు ధర రూ. 12,999. అలాగే 19,999 విలువైన మార్షల్ ఎంబెర్టన్ II రూ. 14,999కు, రూ.46,990 విలువైన సోనీ కంపెనీ థంపింగ్ పార్టీ స్పీకర్లు రూ. 32,900 తగ్గింపు ధరకు అందుబాటులో ఉన్నాయి.

ఇవి కూడా చదవండి

మహిళలకు ప్రత్యేకం..

మహిళలకు ఉపయోగపడే వివిధ రకాల వస్తువులు కూడా తగ్గింపు ధరలో లభిస్తున్నాయి. చక్కని హెయిర్ స్టైల్ చేసుకునేందుకు వినియోగించే వేగా 3 ఇన్ 1 స్టైలర్ ను కేవలం రూ.1350కు విక్రయిస్తున్నారు. దీని అసలు ధర 1,999. హెయిర్ డ్రైయర్లు, స్ట్రెయిట్‌నర్ల ధర రూ. 449 నుంచి ప్రారంభమవుతుంది.

వేసవిలో చల్లదానం..

వేసవి కాలం ప్రారంభమైంది. మెల్లిగా ఎండలు పెరుగుతున్నాయి. ఈ సమయంలో అందరూ కొనుగోలు చేసే ఎయిర్ కండీషనర్లు (ఏసీలు) రూ. 25,190కు లభిస్తున్నాయి. వంట గదిలో మనకు కావాల్సిన రిఫ్రిజిరేటర్లు రూ. 7,990, మైక్రోవేవ్‌లు రూ.6,690, ఎయిర్ ఫ్రైయర్లు రూ.5,944 నుంచి అందుబాటులో ఉన్నాయి. బ్లెండర్లు, జ్యూసర్లపై ప్రత్యేక డిస్కౌంట్‌ కూడా ఉంది. ఇన్‌స్టాక్స్ ఇన్‌స్టంట్ కెమెరాలు రూ. 5,999, యాక్షన్ కెమెరాలు రూ. 27,490, డీఎస్‌ఎల్‌ఆర్‌లు రూ. 41,990 నుంచి ప్రారంభమవుతున్నాయి.

తగ్గింపు ధరలో వాక్యూమ్ క్లీనర్లు..

ఇంటిని శుభ్రం చేయడానికి ఉపయోగపడే వాక్యూమ్ క్లీనర్లు, అలాగే వాషింగ్ మెషీన్లు అత్యంత తక్కువ ధరకు అందిస్తున్నారు. వాక్యూమ్ క్లీనర్లు రూ.1,999 నుంచి, వాషింగ్ మెషీన్లు రూ.7,990 నుంచి ప్రారంభమవుతున్నాయి.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..