మీరు గృహోపకరణాలు కొనుగోలు చేయాలని ఆలోచిస్తున్నారా? అది కూడా స్మార్ట్ పరికరాలు, యాప్ ల సాయంతో పనిచేసేవి తీసుకోవాలని చూస్తున్నారా? అయితే ఈ కథనం మీకోసమే. ప్రస్తుతం అమెజాన్ లో గ్రేట్ సమ్మర్ సేల్ నడుస్తోంది. ఈ-కామర్స్ ప్లాట్‌ఫారమ్ ఈ నెల ఎనిమిదో తేదీ వరకూ ఈ సేల్ ఉంటుంది. దీనిలో అన్ని గృహోపకరణాలపై సూపర్ ఆఫర్లు ఉన్నాయి. చిన్న చిన్న ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్ల నుంచి పెద్ద పెద్ద వస్తువుల వరకూ అన్నింటిపైనా ఆఫర్లు ఉన్నాయి. ఈ నేపథ్యంలో సరసమైన ధరలకే అందుబాటులో ఉన్న కొన్ని స్మార్ట్ హోమ్ గాడ్జెట్‌లను ఇప్పుడు చూద్దాం..
అమెజాన్ ఎకో డాట్ ఫోర్త్ జనరేషన్ స్పీకర్స్.. ఇది 23 శాతం తగ్గింపుతో రూ. 3,449కే లభిస్తోంది. ఇది అలెక్సా-ఆధారంగా పనిచేసే స్మార్ట్ స్పీకర్. ఇది స్మార్ట్ డివైజ్ హబ్‌గా కూడా పనిచేస్తుంది. సాధారణ స్పీకర్‌గా కూడా పనిచేస్తుంది. మీకు రెగ్యులర్ అప్‌డేట్‌లు, వార్తలు, మరింత సమాచారాన్ని కూడా తెలియజేస్తుంది.
విప్రో 10ఏ వైఫ్ స్మార్ట్ ప్లగ్.. ఇది అమెజాన్ లో 55% తగ్గింపుతో రూ. 999కే లభిస్తుంది.
ఈ ప్లగ్ పరికరాలను స్మార్ట్ గాడ్జెట్‌లుగా మారుస్తుంది. విప్రో స్మార్ట్ హోమ్ యాప్ ద్వారా ఉపకరణాలను నియంత్రించడానికి దీన్ని ఉపయోగించవచ్చు. వినియోగదారులు ఉపకరణాలను ఆన్ లేదా ఆఫ్ చేయడానికి షెడ్యూల్‌లను సెట్ చేయవచ్చు.
విప్రో 9వాట్స్ బీ22డీ వైఫై ఎల్ఈడీ స్మార్ట్ బల్బ్.. దీనిపై 76% తగ్గింపుతో కేవలం రూ. 499కే లభిస్తుంది. వైఫై కలిగిన ఈ స్మార్ట్ బల్బ్ అలారం క్లాక్ ఫీచర్‌తో వస్తుంది. దీనిలో 16 మిలియన్ కలర్ షేడ్స్, టోన్‌లను అందిస్తుంది. స్మార్ట్ బల్బ్ గూగుల్ అసిస్టెంట్, అలెక్సాకు మద్దతుతో వస్తుంది. మ్యూజిక్ సింక్ ఫీచర్ ఉంటుంది.
ఫిలిప్స్ విజ్ స్మార్ట్ బల్బ్.. ఇది 75% తగ్గింపుతో రూ. 499కి లభిస్తుంది. ఇది ఆండ్రాయిడ్, ఐఓఎస్ పరికరాలను సపోర్టు చేస్తుంది. అలాగే కొన్ని బల్బులు యాపిక్ హోమ్ కిట్, సిరి వంటి యాప్ లకు కనెక్ట్ అవుతుంది.
విప్రో నెక్ట్స్ 20వాట్ల స్మార్ట్ ఎల్ఈడీ బ్యాటెన్.. ఇది 66% తగ్గింపుతో రూ. 847 కి లభిస్తుంది. ఇది వైఫఐ కనెక్టివిటీతో పనిచేస్తుంది. విప్రో స్మార్ట్ నెక్ట్స్ స్మార్ట్ యాప్ తో ఎక్కడినుంచైనా దీనిని ఆపరేట్ చేయొచ్చు.
ఓక్టర్ స్మార్ట్ ఐఆర్ రిమోట్.. దీనిపై అమెజాన్ లో 48% తగ్గింపు ఉంది. కేవలం రూ. 1,299కే లభిస్తోంది. లభిస్తుంది. ఇది స్మార్ట్ యూనివర్సల్ రిమోట్. ఓక్టర్ స్మార్ట్ హోమ్ యాప్‌ని ఉపయోగించి గృహోపకరణాలను నియంత్రించవచ్చు. ఇది టీవీ, ఏసీ, సెట్-టాప్ బాక్స్, స్పీకర్లు మొదలైన ఉపకరణాలను నియంత్రించడానికి ఉపయోగించవచ్చు.
మమాసీ సెన్సార్ ట్రాష్ బాక్స్.. ఇది ఒక స్మార్ట్ డస్ట్ బిన్. ఇది 42% తగ్గింపుతో రూ. 1,219 కే లభిస్తుంది. సెన్సార్ ఎనేబుల్ చేయబడిన డస్ట్‌బిన్ ఆటోమేటిక్ ఓపెనింగ్ మరియు క్లోజింగ్ ఫీచర్‌లతో వస్తుంది. మాన్యువల్ మోడ్‌తో కూడా వస్తుంది.
టాటా పవర్ ఈజెడ్ హోమ్ వైఫై స్మార్ట్ స్విచ్.. 46% తగ్గింపుతో ఇది రూ. 2,279 వద్ద లభిస్తుంది
దీని ద్వారా మూడు సాధారణ స్విచ్‌లను స్మార్ట్ స్విచ్‌లుగా మార్చవచ్చు.
క్యూబో స్మార్ట్ వైఫై వైర్ లెస్ వీడియో డోర్ బెల్.. ఇది 44% డిస్కౌంట్ తో రూ. 5,589కి లభిస్తుంది. వైఫై ద్వారా పనిచేసే డోర్ బెల్ ఇది. 1080 ఫుల్ హెచ్ డీ రిజల్యూషన్, 2-వే కమ్యూనికేషన్‌కు మద్దతు ఇస్తుంది. అలెక్సా, గూగుల్ అసిస్టెంట్ ఆధారంగా పనిచేస్తుంది.
మోషన్ సెన్సార్ లైట్ ఫర్ హోమ్.. దీనిపై 50% తగ్గింపు లభిస్తోంది. అంటే కేవలం రూ. 249 దీనిని కొనుగోలు చేయొచ్చు. ఇది ఎల్ఈడీ నైట్ లైట్ తో వస్తోంది.
ప్రోటియమ్ వైర్‌లెస్ వైఫై సైరన్ టెంపరేచర్ హ్యూమిడిటీ అలారం సెన్సార్.. దీనిపై 65% తగ్గింపు ఉంది. అంటే రూ. 1,765కే లభిస్తుంది. ఈ సెన్సార్ పరిసరాలలో ఉష్ణోగ్రత, తేమను ట్రాక్ చేయడానికి ఉపయోగపడుతుంది. అలాగే ఏసీ, ఫ్యాన్, ఆన్ అండ్ ఆఫ్ చేయడానికి పనికొస్తుంది. గూగుల్ అసిస్టెంట్, అలెక్సాలను వినియోగించుకొని కమాండ్ లు ఇవ్వొచ్చు.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..