New Rules: ఆగస్టు 1 నుండి ఈ నియమాలలో మార్పులు.. నేరుగా మీ జేబుపై ప్రభావం

|

Jul 30, 2024 | 12:14 PM

ఆగస్ట్ నెలలో డబ్బుకు సంబంధించిన కొన్ని నియమాలలో మార్పులు ఉండబోతున్నాయి. డబ్బుకు సంబంధించిన నియమాలు ప్రతినెలా మారుతూ ఉంటాయి. హెచ్‌డీఎఫ్‌సీ క్రెడిట్ కార్డ్ నియమాలలో మార్పుల నుండి ఎల్‌పీజీ గ్యాస్ సిలిండర్ ధరల వరకు ఆగస్టు 1 నుండి మార్పులు జరుగనున్నాయి. ఈ మార్పులు మీ ఖర్చులపై ప్రభావం చూపుతాయి..

New Rules: ఆగస్టు 1 నుండి ఈ నియమాలలో మార్పులు.. నేరుగా మీ జేబుపై ప్రభావం
August
Follow us on

ఆగస్ట్ నెలలో డబ్బుకు సంబంధించిన కొన్ని నియమాలలో మార్పులు ఉండబోతున్నాయి. డబ్బుకు సంబంధించిన నియమాలు ప్రతినెలా మారుతూ ఉంటాయి. హెచ్‌డీఎఫ్‌సీ క్రెడిట్ కార్డ్ నియమాలలో మార్పుల నుండి ఎల్‌పీజీ గ్యాస్ సిలిండర్ ధరల వరకు ఆగస్టు 1 నుండి మార్పులు జరుగనున్నాయి. ఈ మార్పులు మీ ఖర్చులపై ప్రభావం చూపుతాయి. ఇది మాత్రమే కాదు, ఆగస్టు 1 నుండి ఐటీఆర్ ఫైల్ చేసినందుకు జరిమానా కూడా ఉంటుంది. ఎందుకంటే ఐటీఆర్ ఫైల్ చేయడానికి జూలై 31 చివరి తేదీ. దీని తర్వాత దాఖలు చేస్తే రూ. 5,000 జరిమానా విధిస్తారు.

ఎల్‌పీజీ గ్యాస్ సిలిండర్ ధరలో మార్పు ఉండవచ్చు:

ఎల్‌పీజీ గ్యాస్ సిలిండర్ల ధరలు ప్రతి నెల మొదటి తేదీన నిర్ణయించబడతాయి. ఇది ప్రతి ఒక్కరి ఖర్చులను ప్రభావితం చేస్తుంది. జూలైలో ప్రభుత్వం 19 కిలోల వాణిజ్య సిలిండర్ ధరను తగ్గించింది. అలాగే ఆగస్టులో ఎల్‌పిజి గ్యాస్ సిలిండర్ ధరలు మరింత తగ్గే అవకాశం ఉంది.

ఇవి కూడా చదవండి

హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ క్రెడిట్ కార్డ్ నియమాలు:

హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ ఆగస్టు 1 నుండి అనేక మార్పులు చేసింది. ఇది దాని క్రెడిట్ కార్డ్ హోల్డర్లపై ప్రత్యక్ష ప్రభావాన్ని చూపుతుంది. ఆగస్టు నుండి, పేటీఎం, క్రెడిట్‌, MobiKwik, Cheq వంటి థర్డ్-పార్టీ చెల్లింపు యాప్‌ల ద్వారా చేసే అన్ని అద్దె లావాదేవీలకు లావాదేవీ మొత్తంపై 1% ఛార్జ్ చేస్తారు. ప్రతి లావాదేవీకి రూ. 3000 మాత్రమే పరిమితం చేయబడింది. అయితే, ఒక్కో లావాదేవీకి రూ.15,000 కంటే తక్కువ ఇంధన లావాదేవీలపై ఎలాంటి అదనపు ఛార్జీలు ఉండవు.

అదనంగా బకాయి మొత్తాన్ని బట్టి ఆలస్య చెల్లింపు రుసుము విధానం రూ. 100 నుండి రూ. 1,300కి సవరించారు. హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్ తన టాటా న్యూ ఇన్ఫినిటీ, టాటా న్యూ ప్లస్ క్రెడిట్ కార్డ్‌లలో కూడా ఆగస్టు 1 నుండి మార్పులను అమలు చేస్తుంది. టాటా న్యూ ఇన్ఫినిటీ హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్ క్రెడిట్ కార్డ్ వినియోగదారులు టాటా న్యూ యుపిఐ ఐడిని ఉపయోగించి అర్హత ఉన్న యుపిఐ లావాదేవీలపై 1.5% న్యూకాయిన్‌లను పొందుతారు.

గూగుల్‌ మ్యాప్‌ నిబంధనలలో మార్పు:

గూగుల్ మ్యాప్స్ భారతదేశంలో తన నిబంధనలను మార్చింది. ఇది ఆగస్టు 1 నుండి అమలులోకి వస్తుంది. కంపెనీ భారతదేశంలో తన సేవలకు ఛార్జీలను 70 శాతం వరకు తగ్గించింది. అయితే ఇది సాధారణ వినియోగదారులపై ప్రభావం చూపదు. ఎందుకంటే టెక్ దిగ్గజం వారికి ఎటువంటి అదనపు ఛార్జీలు విధించలేదు.

పెరగనున్న చెప్పుల ధరలు:

ఆగస్టు నుంచి చెప్పులు, షూస్ వంటి ఫుట్‌వేర్ ఉత్పత్తుల రేట్లు పెరగబోతున్నాయి. ఆగస్టు 1 నుంచి అమలులోకి రానున్న కొత్త నాణ్యత ప్రమాణాలు పాదరక్షల్ని మరింత ఖరీదైనవిగా మార్చబోతున్నట్లు తెలుస్తోంది. బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్ (BIS) విడుదల ప్రకారం, మార్కెట్ విక్రయించే బూట్లు, చెప్పులు కొత్త నాణ్యత ప్రమాణాలకు అనుగుణంగా తయారీ కావాలి. పాదరక్ష తయారీదారులు IS 6721, IS 10702 మార్గదర్శకాలను అనుసరించాలని కోరుతూ, కొత్తగా తీసుకువచ్చిన క్వాలిటీ కంట్రోల్ ఆర్డర్ (QCO) ఆగస్టు 1, 2024 నుండి అమలు చేయబడుతుంది.

ఇది కూడా చదవండి: Condom: కండోమ్స్‌ అతని జీవితాన్నే మార్చేసింది.. దురదృష్టాన్ని నెట్టేసి అదృష్టాన్ని తట్టి లేపింది!

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి