Semiconductor: దేశంలో చిప్ కొరత.. ఆటోమొబైల్స్ పరిశ్రమకు రూ.1000 కోట్ల నష్టం..!

|

Dec 23, 2021 | 6:52 PM

దేశంలో సెమీకండక్టర్ల సంక్షోభం ఇప్పట్లో తీరేలా కనిపించడం లేదు. చిప్‌ల కొరతను ఆటో తయారీదారులే కాకుండా దేశీయ ఆటో కాంపోనెంట్‌ తయారీదారులు కూడా ఎదుర్కొంటున్నారు...

Semiconductor: దేశంలో చిప్ కొరత.. ఆటోమొబైల్స్ పరిశ్రమకు రూ.1000 కోట్ల నష్టం..!
Semiconductor
Follow us on

దేశంలో సెమీకండక్టర్ల సంక్షోభం ఇప్పట్లో తీరేలా కనిపించడం లేదు. చిప్‌ల కొరతను ఆటో తయారీదారులే కాకుండా దేశీయ ఆటో కాంపోనెంట్‌ తయారీదారులు కూడా ఎదుర్కొంటున్నారు. చిప్ కొరతతో ఆటోమొబైల్ రంగంలోని కంపెనీలు వెయ్యి కోట్ల రూపాయల నష్టం చవిచూడవచ్చని ఒక అంచనా. వాస్తవానికి, ఆటో కాంపోనెంట్ కంపెనీలు రెట్టింపు నష్టాన్ని చవిచూశాయి. చిప్ కొరత ఇప్పటికే నష్టల్లో ఉన్న కంపెనీలకు ఇప్పుడు ముడి పదార్థాల పెరుగుదల ఇబ్బందుల్లోకి నెట్టెశాయి. దీంతో ఆయా కంపెనీలు ధరలు పెంచేశాయి.

ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మొదటి అర్ధభాగంలో పరిశ్రమల టర్నోవర్‌ను ప్రభావితం చేసే రెండు అంశాలు ఆటో కాంపోనెంట్ సంస్థలపై ఒత్తిడి తెస్తున్నాయి. భవిష్యత్తులో డిమాండ్ బలంగా ఉంటుందని భావిస్తున్నప్పటికీ. సెమీకండక్టర్ పరిశ్రమలో ఆటోమొబైల్స్ వాటా 7-10 శాతం మాత్రమే. కార్లలో ఉపయోగించే చిప్‌ల సంఖ్యను పరిగణనలోకి తీసుకుంటే ఇది 20 శాతానికి పెరగవచ్చు. 2021-22 ఆర్థిక సంవత్సరం ముగిసే నాటికి చిప్ కొరత కారణంగా రూ.1,000 కోట్ల ఆదాయ నష్టం వాటిల్లుతుందని ఆటోమోటివ్ మ్యానుఫ్యాక్చరర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా అంచనా వేసింది. గత వారం ప్యాసింజర్ వాహన తయారీదారులు ఐదు లక్షల యూనిట్ల ఉత్పత్తిని తగ్గించాలని ICRA ఒక నివేదిక విడుదల చేసింది. దీని వల్ల పరిశ్రమకు 1500 నుంచి 2000 కోట్ల నష్టం వాటిల్లవచ్చు.

అయితే, ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ప్రథమార్థంలో ఆటో కాంపోనెంట్ పరిశ్రమ ఏడాది ప్రాతిపదికన 65 శాతం వృద్ధితో 26.6 బిలియన్ డాలర్లకు చేరుకుంది. వాహనాలకు డిమాండ్ పుంజుకున్నప్పటికీ, సెమీకండక్టర్ల కొరత, ఇన్‌పుట్ ధర పెరుగుదల, లాజిస్టిక్స్ ఖర్చు, కంటైనర్ల లేకపోవడంతో వాహనా రంగం నష్టాలను చవిచూస్తోంది.

Read Also.. Hero motocorp: వాహనాల ధరలు పెంచనున్న హీరో మోటోకార్ప్.. ఎప్పటి నుంచి అంటే..