Vande Bharat: వందే భారత్ స్లీపర్ రైళ్లను చూశారా..? అబ్బుపరిచే ఫీచర్లు.. మంత్ర ముగ్దులయ్యేలా సౌకర్యాలు

త్వరలో దేశంలో వందే భారత్ స్లీపర్ రైళ్లు పరుగులు పెట్టనున్నాయి. రైల్వే ప్రయాణికులకు లగ్జరీతో కూడిన ప్రయాణం అందుబాటులోకి రానుంది. తొలి వందే భారత్ స్లీపర్ రైలును తీసుకొచ్చేందుకు రైల్వేశాఖ ముహూర్తం ఫిక్స్ చేసింది. ఈ రైళ్లల్లో ఎలాంటి ఫీచర్లు ఉన్నాయనే వివరాలు చూద్దాం.

Vande Bharat: వందే భారత్ స్లీపర్ రైళ్లను చూశారా..? అబ్బుపరిచే ఫీచర్లు.. మంత్ర ముగ్దులయ్యేలా సౌకర్యాలు
Vande Bharat Sleeper

Updated on: Jan 01, 2026 | 10:08 PM

రైలు ప్రయాణికులు త్వరలో మరో కొత్త అనుభూతిని పొందనున్నారు. జనవరిలో వందే భారత్ స్లీపర్ రైలు పరుగులు తీయనుంది. ఈ నెలలో తొలి వందే భారత్ స్లీపర్ రైలును ప్రధాని మోదీ ప్రారంభించనున్నారు. పశ్చిమబెంగాల్‌లోని హౌవ్‌డా నుంచి అస్సాంలోని గువాహటి మధ్య తొలి రైలును ఈ నెలలోనే అందుబాటులోకి రానుంది. ఈ విషయాన్ని రైల్వేశాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ అధికారికంగా గురువారం మీడియా సమావేశంలో ప్రకటించారు. ఈ రైలు ఛార్జీల వివరాలను కూడా ప్రకటించనున్నారు. విడతల వారీగా దేశవ్యాప్తంగా ఈ వందే భారత్ స్లీపర్ రైళ్లను ప్రారంభించన్నారు. రానున్న కొద్ది నెలల్లో తెలుగు రాష్ట్రాల ప్రజలకు కూడా ఈ ట్రైన్ అందుబాటులోకి తెచ్చే ప్రయత్నాలు జరుగుతున్నాయి. అతి త్వరలోనే తెలుగు రాష్ట్రాల ప్రజలు దీనిని చూడవచ్చు.

మైమరిపించే ఫీచర్లు

-మోడ్రన్ వాష్ రూమ్స్
-ఆటోమేటిక్ సెన్సార్ డోర్ ఓపెన్ సిస్టమ్
-భద్రత కోసం కవచ్ వ్యవస్థ
-అన్నీ కోచుల్లో సీసీ కెమెరాలు
-ఎమర్జెన్సీ టాక్ బ్యాక్ సిస్టమ్
-లో నాయిస్ సిస్టమ్
-మెరుగైన కూషనింగ్ బెర్త్‌లు
-టెక్నాలజీతో కూడుకున్న ప్యాసింజర్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్
-ఇంటీరియర్స్
-పై బెర్త్‌కు వెళ్లేందుకు లాడర్

మొత్తం 16 కోచ్‌లు

ఈ స్లీపర్ రైళ్లల్లో మొత్తం 16 కోచ్‌లు అందుబాటులో ఉంటాయి. ఒకేసారి 823 మంది ప్రయాణించవచ్చు. 11 త్రీటైర్, నాలుగు సెకండ్ ఏసీ, ఒక ఫస్ట్ క్లాస్ ఏసీ కోచ్‌లు వీటిల్లో అందుబాటులో ఉంటాయి. ఈ రైళ్లు గరిష్టంగా గంటకు 180 కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తాయని రైల్వేశాఖ స్పష్టం చేసింది. రాత్రి వేళల్లో ప్రయాణించేవారికి ఎలాంటి డిస్టబెన్స్ ఉండదు. కుదుపులు కూడా ఉండవు. అత్యంత సౌకర్యవంతంగా వీటిల్లో ప్రయాణం చేయవచ్చు. రాత్రుల్లో ప్రయాణించేవారికి మంచి లగ్జరీ ప్రయాణాన్ని ఈ స్లీపర్ రైళ్లు అందించన్నాయి. రాత్రుల్లో ఎక్కువ దూరం ప్రయాణం చేసేవారి సమస్య ఈ రైళ్లతో తీరనుంది. రాత్రి ప్రయాణాల కోసమే ఈ స్లీపర్ రైళ్లను ఎక్కువగా ఉపయోగించనున్నారు.