Tamarind: టమాటా బాటలోనే చింతపండు.. అమాంతంగా పెరిగిన ధరతో సామాన్యులు బెంబేలు..

|

Jul 24, 2023 | 5:51 PM

దేశవ్యాప్తంగా పెరిగిన టమాటా ధరలతో వింత వింత సంఘటనలు చోటు చేసుకుంటున్నాయి. టమాటా చోరీలు, తోటలో పడి పంటను ఎత్తుకెళ్తున్న దొంగలు వంటి వార్తలు వైరల్‌ అవుతున్నాయి. ఇంకా కొన్ని చోట్ల టమాటాపై కొన్ని రకాల ఆఫర్లు కూడా ప్రకటిస్తున్నారు. మరికొన్ని చోట్ల టమాటా బండ్లకు పోలీసులతో సెక్యూరిటీ ఏర్పాటు చేస్తున్నారు.

Tamarind: టమాటా బాటలోనే చింతపండు.. అమాంతంగా పెరిగిన ధరతో సామాన్యులు బెంబేలు..
Tamarind
Follow us on

సామాన్యులకు టమాటా, పచ్చి మిర్చి తర్వాత ఇప్పుడు చింతపండు షాకిస్తోంది. మార్కెట్ లో చింతపండు ధరలు భారీగా పెరిగాయి. టమాటా ధర కొండెక్కి కూర్చోవటంతో సామాన్యులు ప్రత్యామ్నాయంగా చింతపండును ఎక్కువగా వినియోగిస్తున్నారు. దీంతో ఇప్పుడు చింతపండు ధర కూడా చెట్టెక్కేస్తుంది. కిలో 120 రూపాయలు ఉన్న చింతపండు ధర అమాంతంగా పెరిగిపోయింది. ఇప్పుడు ఒక్కసారిగా రూ.170కి పెరిగింది. టమోటో ధర రూ.150. దాటుతుండడంతో చింతపండు వాడేందుకు వినియోగదారులు సిద్ధంగా ఉండడమే ధర పెరగడానికి కారణం అంటున్నారు మార్కెట్‌ విశ్లేషకులు. నెలకు ఒక కేజీ చింతపండు ఉపయోగపడుతుందని మధ్యతరగతి మహిళలు లెక్కలు వేస్తున్నారు. పేద, మధ్యతరగతి ప్రజలు టమాటా కొనేందుకు ఇష్టపడక చింతపండును వినియోగిస్తున్నారు.

గత నెలతో పోలిస్తే చింతపండు కిలోకు రూ.40-50 పెరిగింది. దీంతో ప్రస్తుతం వినియోగదారులు కిలో చింతపండుకు బదులు అర కేజీకి కొనుగోలు చేస్తున్నారు. చింతపండు ధరల పెరుగుదలకు టమోటా పెరుగుదలకు సంబంధం లేదు. చింతపండు సీజన్ అయిపోయింది. కానీ, దాని ధర పెరిగింది. ప్రతి సంవత్సరం చింతపండు దిగుబడి వస్తే కిలో 100 రూపాయలు వరకు పెరుగుతోంది. ఇప్పుడు కొత్త చింతపండు వచ్చే వరకు కాస్త పెంపు తప్పదని వ్యాపారులు చెబుతున్నారు.

ఇదిలా ఉంటే, దేశవ్యాప్తంగా పెరిగిన టమాటా ధరలతో వింత వింత సంఘటనలు చోటు చేసుకుంటున్నాయి. టమాటా చోరీలు, తోటలో పడి పంటను ఎత్తుకెళ్తున్న దొంగలు వంటి వార్తలు వైరల్‌ అవుతున్నాయి. ఇంకా కొన్ని చోట్ల టమాటాపై కొన్ని రకాల ఆఫర్లు కూడా ప్రకటిస్తున్నారు. మరికొన్ని చోట్ల టమాటా బండ్లకు పోలీసులతో సెక్యూరిటీ ఏర్పాటు చేస్తున్నారు. ఇలా టమాటాపై సోషల్ మీడియాలో మీమ్స్‌ కూడా విపరీతంగా హల్‌చల్‌ చేస్తున్నాయి.

ఇవి కూడా చదవండి

 

మరిన్ని లైఫ్ స్టైల్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..