
భారతదేశంలో టాటా కార్లు అంటే మధ్య తరగతి ప్రజలు అధికంగా ఇష్టపడుతూ ఉంటారు. బడ్జెట్ ధరల్లో కార్లను అందించడంలో టాటా కంపెనీలు మరే కంపెనీ సాటి రాదు. అయితే తాజాగా టాటా మోటార్స్ ప్రముఖ మోడళ్లపై గణనీయమైన తగ్గింపులను అందిస్తున్నట్లు ప్రకటించింది. టాటా టియాగో, ఆల్ట్రోజ్, నెక్సాన్, హాయర్, సఫారీ వంటి ప్రముఖ మోడళ్లపై గణనీయమైన తగ్గింపులను అందిస్తన్నారు. అయితే ఎంపిక చేసిన ఎంవై 2024 యూనిట్లపై రూ. 55,000 వరకు ప్రయోజనాలు పొందవచ్చు. ఈ ఆఫర్లలో ముందు నగదు తగ్గింపులతో పాటు ఎక్స్చేంజ్, స్క్రాపేజ్ బోనస్‌లతో మరిన్ని అందుబాటులో ఉన్నాయి. ఈ నేపథ్యంలో ప్రస్తుతం టాటా కార్లపై ఉన్న తగ్గింపుల గురించి ఓ సారి తెలుసుకుందాం.
టాటా టియాగోకు సంబంధించిన పెట్రోల్ వేరియంట్లు రూ.60,000 వరకు మొత్తం తగ్గింపుతో అందుబాటులో ఉన్నాయి, ఇందులో రూ. 35,000 నగదు ప్రయోజనాలు, రూ. 20,000 ఎక్స్చేంజ్ బోనస్, రూ. 5,000 కార్పొరేట్ తగ్గింపు ఉన్నాయి. అలాగే సీఎన్‌జీ వేరియంట్లు రూ.50,000 వరకు తగ్గింపుతో వస్తాయి. ఇందులో రూ. 25,000 ముందస్తు నగదు తగ్గింపు, రూ. 20,000 ఎక్స్చేంజ్ బోనస్, రూ. 50,000 కార్పొరేట్ తగ్గింపు ఉన్నాయి.
టియాగో మాదిరిగానే టిగోర్‌పై కూడా రూ. 55,000 వరకు తగ్గింపులు అందుబాటులో ఉన్నాయి. టాటా టిగోర్ 1.2- లీటర్ పెట్రోల్ ఇంజన్, ఐచ్ఛిక సీఎన్‌జీ కిట్‌తో వస్తుంది. పెట్రోల్ వెర్షన్ రూ. 30,000 నగదు తగ్గింపు, రూ.20,000 ఎక్స్చేంజ్ బోనస్, రూ. 5,000 కార్పొరేట్ తగ్గింపుతో సహా రూ. 55,000 వరకు ప్రయోజనాలను పొందవచ్చు. సీఎన్‌జీ వేరియంట్లపై రూ. 50,000 వరకు తగ్గింపు ఉంటుంది. రూ.25 వేల నగదు తగ్గింపు, రూ.20 వేల ఎక్స్చేంజ్ బోన్, రూ.5 వేల కార్పొరేట్ తగ్గింపుతో వస్తుంది.
టాటా ఆల్ట్రోజ్ కారుపై రూ. 50,000 వరకు ఆదా చేసుకోవచ్చు. టాటా ఆల్టోజ్‌కు సంబంధించిన పెట్రోల్, డీజిల్ వేరియంట్లను రూ. 50,000 వరకు తగ్గింపుతో కొనుగోలు చేయవచ్చు. ఇందులో రూ. 25,000 నగదు తగ్గింపు, రూ. 20,000 ఎక్స్చేంజ్ బోనస్, రూ.5000 కార్పొరేట్ తగ్గింపు ఉన్నాయి. సీఎన్‌జీ వేరియంట్లు రూ. 40,000 విలువైన ప్రయోజనాలను అందిస్తాయి. అయిేత ఇటీవల ప్రారంభించిన టాటా ఆల్ట్రోజ్ రేసర్‌పై ఎలాంటి తగ్గింపు లేదు.
ఎంవై 2024 టాటా నెక్సాన్, పెట్రోల్, డీజిల్ వెర్షన్లపై రూ.25 వేల తగ్గింపులు అందుబాటులో ఉన్నాయి. ఈ రెండు కార్లు కూడా రూ. 5,000 కార్పొరేట్ తగ్గింపుతో పాటు రూ. 20,000 వరకు స్క్రాపేజ్/ఎక్స్ఛేంజ్ బోనస్ అందుబాటులో ఉన్నాయి. ఈ ప్రసిద్ధ ఎస్‌యూవీ ధరలు రూ. 8 లక్షల నుంచి రూ. 15.80 లక్షల వరకు ఉన్నాయి.
ఈ కారుపై రూ.30,000 వరకు ప్రయోజనాలు పొందవచ్చు. టాటా హారియర్‌కు సంబంధించి అన్ని వేరియంట్లు ఈ నెలలో రూ.30,000 వరకు ఎక్స్ఛేంజ్ బోనస్‌తో వస్తాయి. హారియర్ ధరలు రూ. 15.49 లక్షల నుంచి రూ. 26.44 లక్షల వరకు ఉన్నాయి. టాటా సఫారి, హారియర్‌కు సంబంధించి మూడు వెర్షన్లు కూడా రూ. 30,000 వరకు తగ్గింపుతో వస్తుంది.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి