Andhra Pradesh: ఐకానిక్ భవనాన్ని కూల్చేస్తున్నారు.. ఫైవ్ స్టార్ హోటల్‌ను చూసేందుకు ఇదే లాస్ట్ ఛాన్స్!
ఏపీలో విశాఖ అతిపెద్ద నగరమే కాకుండా టూరిస్ట్ డెస్టినేషన్ కూడా.. ప్రకృతి సహజ సిద్ధ పర్యాటక ప్రదేశాలు చూసేందుకు ఏటా లక్షల మంది సందర్శకులు వస్తూ ఉంటారు.
అది ఆంధ్రప్రదేశ్‌లోనే అతిపెద్ద నగరం.. సువిశాల సాగర తీరం ఉన్న ఆ ప్రాంతంలో ఓ గొప్ప భవనం.. సాగర తీరంలో ఉండే ఫైవ్ స్టార్ హోటల్స్‌లో అదే మొట్టమొదటిది. ఆ తర్వాత దాని యాజమాన్యం చేతులు మారినా ఆ భవన సముదాయం మాత్రం ఎంతోమందికి మధుర జ్ఞాపకాలనిచ్చింది. ఇప్పటికీ చెక్కుచెదరనిగా మహానగరంలో ఆతిథ్యానికి నేను సైతం అంటూ ఆహ్వానిస్తోంది. అయితే అంతటి ప్రాముఖ్యత, పర్యాటకులు సందర్శకుల మనసు దోచిన, ఎంతోమంది ఎమోషన్స్ తో కూడిన ఆ భవనం కాలగర్భంలో కలిసిపోనుంది. అదే విశాఖ బీచ్ రోడ్‌లో తాజ్ హోటల్‌గా పేరుగాంచిన గేట్ వే హోటల్.
ఇదిగో ఇదే ఆ భవనం.. విశాఖ సాగర తీరానికి ఒక మణిహారం. ఆతిథ్య రంగంలో ఓ అద్భుత డెస్టినేషన్. విశాఖ బీచ్‌ఫ్రంట్‌లో ఉన్న ఈ ఐకానిక్ భవనానికి 1988లో “సీ పెర్ల్” అని నామకరణం చేశారు. ఆ తర్వాత 1992లో ఓరియంటల్ హోటల్స్ కంపెనీ లిమిటెడ్ యాజమాన్యంలో తాజ్ రెసిడెన్సీకి మార్చేసింది. తాజ్ హోటల్ గా ఈ భవనం అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకుంది. పర్యాటకులు, అంతర్జాతీయ స్థాయి డెలిగేట్స్ తోపాటు.. ఇంటర్నేషనల్ క్రికెట్ కూడా ఈ హోటల్ తన ఆతిథ్యాన్ని ఇచ్చింది.
ఏపీలో విశాఖ అతిపెద్ద నగరమే కాకుండా టూరిస్ట్ డెస్టినేషన్ కూడా.. ప్రకృతి సహజ సిద్ధ పర్యాటక ప్రదేశాలు చూసేందుకు ఏటా లక్షల మంది సందర్శకులు వస్తూ ఉంటారు. దేశ నలుమూలల నుంచి వస్తోన్న పర్యాటకుల సంఖ్య నానాటికీ పెరుగుతోంది. అనేక జాతీయ అంతర్జాతీయ స్థాయి సదస్సులకు కూడా విశాఖ వేదికగా మారుతోంది. దీంతో విశాఖ నగరంలో ఫైవ్ స్టార్ హోటళ్లకు డిమాండ్ పెరుగుతోంది.
సింగపూర్ మెరైన్ బే సాండ్స్ తరహాలో…
ఈ నేపథ్యంలో విశాఖ నగరంలోని ఐకానిక్ తాజ్ గేట్ వే హోటల్‌ను కూల్చివేసి దాని స్థానంలో మరో ప్రపంచ ప్రసిద్ధ ఫైవ్ స్టార్ హోటల్ నిర్మించేందుకు రంగం సిద్ధమైంది. 2018లో ఓరియెంటల్ హోటల్స్ లిమిటెడ్ నుంచి తాజ్ గేట్వే హోటల్ ను రూ. 120 కోట్లకు వరుణ్ గ్రూప్ సొంతం చేసుకుంది. ఇక్కడ సింగపూర్ లోని మెరైన్ బే శాండ్స్ తరహాలో నిర్మాణాలు చేపట్టబోతున్నారు.
మూడు టవర్లుగా విభజించి.. చేయబోతున్న నిర్మాణాల్లో మొదటి టవర్లో 374 గదులతో ఫైవ్ స్టార్ హోటల్, రెండో టవర్లో సర్వీస్ అపార్ట్మెంట్స్, ఇక మూడో టవర్లో ఆఫీసు స్పేస్ తో పాటు లగ్జరీ రిటైల్ నిర్మాణాలు జరగబోతున్నాయి. భవనాలపైనే హెలిపాడ్, స్విమ్మింగ్ పూల్ కూడా ప్రత్యేక ఆకర్షణలు. హోటల్లోనే 374 గల నుంచి కూడా విశాఖ సాగర తీర అందలను ఆస్వాదించే విధంగా నిర్మించబోతున్నారు. బీచ్ ఫ్రంట్ గానే అన్ని గదులు ఉండేలా నిర్మాణం జరగబోతోంది.
రూ. 500 కోట్లతో తొలి స్కై స్క్రాపర్..
ఈ ప్రాంతంలో భారీ ఎత్తుతో నిర్మించబోయే ఈ భవనాల సముదాయం బీచ్ రోడ్‌లో తొలి స్క్రై స్క్రాపర్ కానుండటం విశేషం. ఈ భారీ ప్రాజెక్టు కోసం ఇందుకోసం వరుణ్ గ్రూప్ రూ. 500 కోట్లకు పైగా వెచ్చించనుంది. ఇప్పటికే బీచ్ రోడ్ లో ఉన్న వరుణ్ గ్రూప్ కు చెందిన నోవాటెల్ హోటల్ కు పక్కనే ఈ నిర్మాణం కూడా ఉంది.
విశాఖ పరిసర ప్రాంతాల్లో పలు ప్రముఖ హోటళ్లు, రిసార్టులు అందుబాటులోకి రానున్నాయి. ఇప్పటికే ఉన్న కొన్ని సంస్థలు తమ బిజినెస్ గ్రూప్స్ ను విస్తరిస్తున్నారు. ఒబేరాయ్ హోటల్స్, మేఫెయిర్ హోటల్, తాజ్ హోటల్‌లు త్వరలోనే విశాఖలో అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది.
వీడియో చూడండి…
‘గేట్వే హోటల్ అనేక శుభకార్యాలు, సదస్సులు, అంతర్జాతీయ ఈవెంట్‌లకు వేదిక అయింది. బంగాళాఖాతం ఎదురుగా ఉన్న సుందరమైన బీచ్ రోడ్‌లో ఉన్న ఈ ఆస్తి, హోటల్‌ను ఆదరించిన, మూడు దశాబ్దాలకు పైగా వారి జీవితంలో ఒక భాగంగా మార్చుకున్న అనేక కుటుంబాలకు అనేక జ్ఞాపకాలతో నిండి ఉంది. ఒక ముత్యం ఆభరణంగా మారబోతోంది. “ఎ బిగ్ థాంక్యూ గేట్‌వే!” అంటూ యాజమాన్యం ప్రకటన విడుదల చేసింది.
ఎంతోమంది జ్ఞాపకాలతో కూడిన భవనం..
ఇది ఎంతోమంది జ్ఞాపకాలతో కూడిన భవనం. ఎమోషన్స్ ఈ భవనంతో పెను వేసుకున్నాయి. మారుతున్న కాలానికి అనుగుణంగా వినియోగదారుల అభివృద్ధి కోసం నూతన నిర్మాణాలకు శ్రీకారం చుట్టారు. గేట్ వే హోటల్ కు బుకింగ్స్ నిలిపివేశారు. అన్ని రంగాల్లో విశాఖ అభివృద్ధి చెందుతున్న నేపథ్యంలో భవిష్యత్తు డిమాండ్కు తగ్గట్టుగా సింగపూర్ లోని మెరైన్ బేస్ హ్యాండ్స్ తరహాలో రూ. 500 కోట్లకు పైగా పెట్టుబడుతో మూడు భారీ టవర్లు నిర్మిస్తున్నామని వరుణ్ గ్రూప్ చైర్మన్ ప్రభు కిషోర్ తెలిపారు. అంతర్జాతీయ ప్రమాణాలతో అత్యాధునిక టెక్నాలజీతో పర్యావరణహితంగా ఫైవ్ స్టార్ హోటల్, సర్వీస్ అపార్ట్మెంట్, ఆఫీస్ స్పేస్ లగ్జరీ రిటైల్ నిర్మాణాలు చేపడుతున్నామని అన్నారు.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..