Cloud Kitchen: పెరుగుతున్న క్లౌడ్ కిచెన్ కల్చర్.. ఆ పని చేయకపోతే ఇక అంతే..!

|

Dec 15, 2024 | 2:45 PM

భారతదేశంలో హోటల్ పరిశ్రమ వేగంగా వృద్ధి చెందుతుంది. ముఖ్యంగా ఇటీవల కాలంలో ఆన్‌లైన్ ఫుడ్ డెలివరీ యాప్స్ రంగ ప్రవేశంతో అమ్మకాలు జోరుగా సాగుతున్నాయి. అయితే క్లౌడ్ కిచెన్ కాన్సెప్ట్ అధిక ప్రజాదరణ పొందుతుంది. తక్కువ పెట్టుబడితో ఎక్కువ రాబడినిచ్చే క్లౌడ్ కిచెన్ సెటప్ గురించి మరిన్ని వివరాలను తెలుసుకుందాం.

Cloud Kitchen: పెరుగుతున్న క్లౌడ్ కిచెన్ కల్చర్.. ఆ పని చేయకపోతే ఇక అంతే..!
Cloud Kitchen
Follow us on

భారతదేశంలో ఫుడ్ టెక్ పరిశ్రమ వేగంగా అభివృద్ధి చెందుతుంది. ముఖ్యంగా ఫుడ్, కిరాణా డెలివరీతో పాటు క్లౌడ్ కిచెన్ వ్యాపారం కూడా పుంజుకుంటుంది. దేశంలో క్లౌడ్ కిచెన్ వ్యాపారం ప్రపంచ రేటు కంటే 10 శాతం వేగంగా పెరగడానికి ఇదే కారణం.క్లౌడ్ కిచెన్ అంటే కేవలం హోటల్ లేదా రెస్టారెంట్లల్లా కాకుండా కూర్చొని తినే ఎంపికను అందించని వంటగది అని అర్థం. కాబట్టి క్లౌడ్ కిచెన్ సెటప్‌కు పెట్టుబడి చాలా తక్కువ. పైగా జొమాటో, స్విగ్గీ వంటి యాప్స్‌తో పాటు సొంత మార్కెటింగ్ స్కిల్స్‌తో ఈ వ్యాపారాన్ని చేయవచ్చు. 

ఇంటి నుంచి క్లౌడ్ కిచెన్‌ ప్రారంభించడం వల్ల చాలా ప్రయోజనాలు ఉన్నాయి. తక్కువ పెట్టుబడితో వ్యాపారాన్ని ప్రారంభించవచ్చు. ముఖ్యంగా మార్కెట్ స్థలంలో షాపు పెట్టాల్సిన అవసరం ఉండదు. ముఖ్యంగా ఇప్పటికే ఉన్న మీ వంటగదిని క్లౌడ్ కిచెన్‌గా అప్‌గ్రేడ్ చేయవచ్చు. తక్కువ ఓవర్ హెడ్ ఖర్చు అంటే స్టోర్ ఫ్రంట్ లేదా డైనింగ్ ఏరియా రూపంలో సాంప్రదాయ రెస్టారెంట్ వంటి ఓవర్‌హెడ్ ఖర్చులను భరించాల్సిన అవసరం ఉండదు. ముఖ్యంగా ఆన్‌లైన్ ప్లాట్‌ఫారమ్‌లకు ద్వారా వ్యాపారం చేయాలనుకునే వారికి ఇది చాలా బాగా ఉపయోగపడుతుంది. ప్రొఫెషనల్ క్లౌడ్ కిచెన్‌ను ఏర్పాటు చేయడాపిరి కనీసం రూ. 2 లక్షలు పెట్టుబడి పెట్టాలి. గట్టిగా అంటే రూ.12 లక్షల వరకు ఉంటుంది. అయితే, చిన్న స్థాయిలో ప్రారంభించడానికి, రూ. 1 లక్ష కంటే తక్కువ ఖర్చుతో సెటప్‌ను సిద్ధం చేయవచ్చు. మన ఇంట్లోనే దీన్ని ఏర్పాటు చేసుకోవచ్చు.

సాధారణంగా క్లౌడ్ కిచెన్‌లో మీకు 25 నుండి 30 శాతం మార్జిన్ ఉంటుంది. రోజుకు 250 రూపాయల వాల్యూతో 50 ఆర్డర్‌లను వస్తే మీ నెలవారీ ఆదాయం రూ. 3,75,000 అవుతుంది. ఇందులో 30% గ్రాస్ ప్రాఫిట్ మార్జిన్ ఉంటే లాభం రూ.1,12,500 అవుతుంది. 50 శాతం నిర్వహణ ఖర్చును తీసివేస్తే మీ నికర లాభం రూ. 56,250 అవుతుంది.

ఇవి కూడా చదవండి

అయితే క్లౌడ్ కిచెన్ ఏర్పాటు చేయాలంటే కచ్చితంగా ఫుడ్ సెఫ్టీ లైసెన్స్ ఉండాలి. ఇది లేకపోతే మీ క్లౌడ్ కిచెన్‌ను సీజ్ చేసే ప్రమాదం ఉంది. ఈ సర్టిఫికెట్ కోసం ఎఫ్ఎస్ఎస్ఏఐ అధికారిక వెబ్‌సైట్‌కు వెళ్లి అప్లయ్ చేసుకోవాల్సి ఉంటుంది. అప్లికేషన్‌లో మన మొత్తం సమాచారాన్ని పోర్టల్‌లో నమోదు చేయాలి. దీని తరువాత సంబంధిత అధికారులు తనిఖీ చేసి సర్టిఫికెట్ అందిస్తారు. 

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి