భారతదేశంలో పెట్టుబడిదారులకు ఫిక్స్‌డ్ డిపాజిట్లు స్థిర ఆదాయాన్ని అందించే నమ్మకమైన పెట్టుబడి ఎంపికగా నిలిచాయి. రాబడి తక్కువైనా పెట్టుబడితో పాటు రాబడికి కూడా హామీ ఉంటుందనే ఉద్దేశంతో ఎఫ్‌డీల్లో పెట్టుబడికి చాలా మంది పెట్టుబడిదారులు ఆసక్తి చూపుతూ ఉంటారు. ఈ నేపథ్యంలో అన్ని బ్యాంకులు ఖాతాదారులను ఆకట్టుకునేందుకు ఎఫ్‌డీల్లో పెట్టుబడిపై ఆకర్షణీయ వడ్డీ రేట్లను అందిస్తూ ఉంటారు. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్‌బీఐ) తర్వాత హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ రూ. 2 కోట్ల కంటే తక్కువ ఫిక్స్‌డ్ డిపాజిట్లపై వడ్డీ రేట్లను సవరించింది. కొత్త రేట్లు జూన్ 10, 2024 నుంచి అమలులోకి వచ్చాయి. సాధారణ పౌరులకు హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ ఏడు రోజుల నుంచి పది సంవత్సరాల వరకు ఉన్న కాలవ్యవధిపై 3 శాతం నుంచి 7.25 శాతం మధ్య వడ్డీ రేట్లను అందిస్తుంది. అత్యధిక వడ్డీ రేటు 18 నెలల నుండి 21 నెలల కంటే తక్కువ కాల వ్యవధిపై 7.25 శాతంగా ఉంది. ఈ నేపథ్యంలో హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ తాజా వడ్డ రేట్ల గురించి మరిన్ని వివరాలను తెలుసుకుందాం.
హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ 27 నెలల నుంచి 36 నెలల కాలవ్యవధిలో రికరింగ్ డిపాజిట్ వడ్డీ రేట్లను సవరించింది. ఇది సాధారణ పౌరులకు 7.15 శాతం ఉంటే సీనియర్ సిటిజన్లకు 7.65 శాతం వడ్డీ రేటును అందిస్తుంది. 39 నెలలు, 48 నెలలు, 60 నెలల కాలవ్యవధి కోసం, బ్యాంక్ సాధారణ పౌరులకు 7.20 శాతం వడ్డీను అందిస్తుంటే సీనియర్ సిటిజన్లకు 7.70% అందిస్తుంది.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి