నిధుల కొరత కారణంగా చాలా మంది వ్యక్తులు సొంతింటిని కొనుగోలు చేసుకోవాలనే లక్ష్యానికి దూరంగా ఉంటాయి. చాలా బ్యాంకులు గృహ రుణంపై తక్కువ వడ్డీతో లోన్లను అందిస్తూ ఉంటాయి. ముఖ్యంగా ఉద్యోగులకు గృహ రుణం చెల్లింపు అనేది అనువుగా ఉండడంతో గృహ రుణాలను తీసుకుంటూ ఉంటారు. అయితే గృహ రుణంపై వడ్డీ తక్కువగా ఉన్న కొన్ని బ్యాంకులు ప్రాసెసింగ్ ఫీజుతో బాదేస్తూ ఉంటాయి. కాబట్టి నవంబర్-డిసెంబర్ 2024కి సంబంధించి పోటీ వడ్డీ రేట్లతో ప్రముఖ బ్యాంకులు గృహ రుణాలను అందిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఏయే బ్యాంకుల్లో ఎంత వడ్డీతో రుణాలను పొందవచ్చో? ఓసారి తెలుసుకుందాం.
బ్యాంకు నుంచి గృహ రుణం తీసుకునే సమయంలో కేవలం వడ్డీ రేటు మాత్రమే చూస్తే నష్టపోవాల్సి ఉంటుంది. వడ్డీ రేటుతో పాటు అదనపు ఖర్చులను అర్థం చేసుకోవడం కూడా కీలకం. ప్రాసెసింగ్ ఫీజులు, ప్రీపేమెంట్ ఛార్జీలు, స్థిరమైన లేదా ఫ్లోటింగ్ వడ్డీ రేట్ల ప్రభావం కారణంగా మీ మొత్తం ఈఎంఐ మొత్తం ప్రభావితమవుతుంది.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి