World Richest Person: ప్రపంచంలో అత్యంత సంపన్నుడిగా ఎలాన్​ మస్క్..​ మరోసారి రికార్డు

|

Feb 19, 2021 | 11:55 PM

Elon Musk: ప్రపంచ కుబేరుడు ఎలాన్ మాస్క్.. ప్రపంచంలో అత్యంత సంపన్నుడిగా ​మరోసారి అగ్రస్థానాన్ని దక్కించుకున్నాడు.

World Richest Person: ప్రపంచంలో అత్యంత సంపన్నుడిగా ఎలాన్​ మస్క్..​ మరోసారి రికార్డు
Follow us on

Elon Musk: ప్రపంచ కుబేరుడు ఎలాన్ మాస్క్.. ప్రపంచంలో అత్యంత సంపన్నుడిగా ​మరోసారి అగ్రస్థానాన్ని దక్కించుకున్నాడు. అమెజాన్​ అధినేత జెఫ్​ బెజోస్​ను అధిగమించి ఆయన ఈ స్థానాన్ని కైవసం చేసుకున్నాడు.

ప్రముఖ విద్యుత్తు కార్ల తయారీ సంస్థ టెస్లా అధినేత, స్పేస్​ ఎక్స్​ సీఈఓ ఎలాన్​ మస్క్ మరోసారి ప్రపంచంలోనే అత్యంత సంపన్నుడిగా నిలిచాడు. ఈ-కామర్స్ దిగ్గజం అమెజాన్ అధినేత జెఫ్​ బెజోస్​ను అధిగమించి మస్క్​ ఈ స్థానాన్ని సంపాదించాడు.

టెస్లా షేర్ల విలువ పెరగడంతో మస్క్​ ఈ స్థానాన్ని సొంతం చేసుకున్నారు. బ్లూమ్​బర్గ్ తాజా నివేదిక ప్రకారం ఎలాన్​ మస్క్ సంపద 199.9 బిలియన్​ డాలర్లు. జెఫ్​బెజోస్​ సంపద 194 బిలియన్​ డాలర్లు.