Business Idea: ఈ ఫ్రాంచైజీతో భారీగా ఆదాయం.. ఇప్పుడు లేటెస్ట్ ట్రెండ్

|

Sep 03, 2024 | 3:07 PM

ప్రస్తుతం మార్కెట్లో రకరకాల ఫ్రాంచైజీలు అందుబాటులో ఉన్నాయి. ఇప్పుడు ఈ ఫ్రాంచైజీల వ్యాపారం మూడు పువ్వులు, ఆరు కాయలు అన్న విధంగా సాగుతున్నాయి. పట్టణాలకే పరిమితం కాకుండా చిన్న చిన్న పట్టణాల్లో కూడా ఫ్రాంచైజీ మార్కెట్‌ బాగా విస్తరిస్తోంది. ఇలాంటి ఓ బెస్ట్‌ ఫ్రాంచైజీనే టీ ఫ్రాంచైజీ. ఇప్పుడు హైవేలపై, చిన్న చిన్న పట్టణాల్లో కూడా ఎక్కడ...

Business Idea: ఈ ఫ్రాంచైజీతో భారీగా ఆదాయం.. ఇప్పుడు లేటెస్ట్ ట్రెండ్
Business Idea
Follow us on

యువత ఆలోచన మారుతోంది. ఉద్యోగం కంటే వ్యాపారం వైపు మొగ్గు చూపేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. అయితే మనలో చాలా మంది ఇప్పటికే వ్యాపారం అనగానే నష్టాలు వస్తాయన్న భయంతో ఉంటారు. కానీ సరైన ప్రణాళిక, మార్కెట్ అవసరాలకు అనుగుణంగా వ్యాపారాలు ప్రారంభిస్తే భారీగా లాభాలు ఆర్జించవచ్చని నిపుణులు చెబుతున్నారు. యువత ఆలోచనలకు అనుగుణంగా పుట్టుకొచ్చినవే ఫ్రాంచైజీలు.

ప్రస్తుతం మార్కెట్లో రకరకాల ఫ్రాంచైజీలు అందుబాటులో ఉన్నాయి. ఇప్పుడు ఈ ఫ్రాంచైజీల వ్యాపారం మూడు పువ్వులు, ఆరు కాయలు అన్న విధంగా సాగుతున్నాయి. పట్టణాలకే పరిమితం కాకుండా చిన్న చిన్న పట్టణాల్లో కూడా ఫ్రాంచైజీ మార్కెట్‌ బాగా విస్తరిస్తోంది. ఇలాంటి ఓ బెస్ట్‌ ఫ్రాంచైజీనే టీ ఫ్రాంచైజీ. ఇప్పుడు హైవేలపై, చిన్న చిన్న పట్టణాల్లో కూడా ఎక్కడ చూసినా టీ ఫ్రాంచైజీలు దర్శనమిస్తున్నాయి. మరి టీ ఫ్రాంచైజీలకు ఎంత పెట్టుబడి అవసరం ఉంటుంది.? లాభాలు ఎలా ఉంటాయో ఇప్పుడు తెలుసుకుందాం..

టీ బిజినెస్ స్టార్ట్ చేయాలనుకునే ముందు మంచి లొకేషన్‌ను గుర్తించాలి. కాలేజీలు, యువత ఎక్కువగా ఉండే చోట మీ టీ ఫ్రాంచైజీని సెలక్ట్ చేసుకోవాలి. అలాగే మీరున్న ప్రదేశంలో ఎలాంటి టీ ఫ్రాంచైజీలు ఉన్నాయి.? ఎలాంటి వాటికి ఎక్కువ స్కోప్‌ ఉండే అవకాశాలు ఉన్నాయి సెలక్ట్ చేసుకోవాలి. రెంట్ ఎక్కువైనా పర్లేదు కానీ మంచి ప్రైమ్‌ లొకేషన్‌లో ప్లాన్‌లో చేసుకోవాలి. దాదాపు అన్ని ఫ్రాంచైజీలు టీ తయారీకి అవసరమయ్యే అన్ని రకాల ప్రొడక్ట్స్‌ వారే అందిస్తారు. ఇక మీకు దగ్గర్లో ఏదైనా ఫ్రాంచైజీ ఉంటే అక్కడ ఏర్పాటు చేయకపోవడమే మంచిది.

ఇక టీ ఫ్రాంచైజీతో సమానంగా స్నాక్స్‌, కూల్‌ డ్రింక్స్‌ వంటి వాటిని ఏర్పాటు చేసుకోవచ్చు. వీటితో వ్యాపారంలో లాభాలు మరింత పెరిగే అవకాశం ఉంటుంది. కాలేజీలు, హాస్పిటల్స్‌, హోటల్స్‌కు సమీపంలో టీ ఫ్రాంచైజీలను ఏర్పాటు చేస్తే లాభాలు ఎక్కువగా వచ్చే అవకాశం ఉంటుంది. ఇక టీ ఫ్రాంచైజీలను ప్రస్తుతం రూ. 3 నుంచి రూ. 5 లక్షల వరకు పెట్టుబడి అవసరపడుతుంది. లాభాల విషయానికొస్తే ప్రైమ్‌ లొకేషన్స్‌లో ఏర్పాటు చేస్తే నెలకు కనీసం రూ. 50 వేల వరకు లాభాలు ఆర్జించవచ్చు. టీ వ్యాపారంలో పెట్టుబడి పెట్టాలనుకునే వారు మార్కెట్లో ఉన్న ఫ్రాంజైజీల వివరాలు తెలుసుకొని మీ పెట్టుబడికి అనుగుణంగా ఎంచుకోవచ్చు.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం క్లిక్ చేయండి..