5G Technology: 5G సాంకేతికత అందించేందుకు సిద్ధమంటున్న భారత ఐటీ దిగ్గజం

|

Mar 24, 2022 | 7:06 AM

5G Technology: భారత ఐటీ దిగ్గజం మరో కీలక మైలురాయిని చేరుకోనుంది. అదేంటంటే దేశీయ సాంకేతికతను వినియోగించి 5జీ నెట్ వర్క్(5G Network) ను అభివృద్ధి చేసింది.

5G Technology: 5G సాంకేతికత అందించేందుకు సిద్ధమంటున్న భారత ఐటీ దిగ్గజం
5g Services In India
Follow us on

5G Technology: భారత ఐటీ దిగ్గజం మరో కీలక మైలురాయిని చేరుకోనుంది. అదేంటంటే దేశీయ సాంకేతికతను వినియోగించి 5జీ నెట్ వర్క్(5G Network) ను అభివృద్ధి చేసింది. ప్రపంచంలో ఏ టెలికాం ఆపరేటర్ కోసమైనా దానిని అందించేందుకు తాము సిద్ధంగా ఉన్నట్లు సంస్థ వెల్లడించింది. దేశీయంగా కూడా తాము దీనిపై పనిచేస్తున్నట్లు TCS కంపెనీ ప్రతినిధి ఒకరు తెలిపారు. ప్రపంచ వ్యాప్తంగా టెలికాం కంపెనీలు తమ నెట్ వర్క్ ను మ్యానేజ్ చేసుకునేందుకు, స్వాప్ ఎక్యూప్ మెంట్(Swap Equipment) తో పాటు టెక్నాలజీని అందించటం ప్రారంభించిందని కంపెనీ కమ్యూనికేషన్, మీడియో హెడ్ కమల్ భడాడా తెలిపారు. 5 జీ సాంకేతికతను టెలికాం కంపెనీలకు అందించేందుకు తాము ఇప్పటికే సిద్ధంగా ఉన్నట్లు ఆయన తెలిపారు. కంపెనీల వ్యక్తిగత అవసరాలకు అనుగుణంగా తాము ఈ సాంకేతికతను అందించనున్నట్లు కమల్ వెల్లడించారు.

దేశంలో 5జీ స్పెక్రమ్ వేలాన్ని జూన్ లో నిర్వహించాలని భారత ప్రభుత్వం నిర్ణయించింది. అందువల్ల అగస్టు 15 నాటికి 5జీ సాంకేతిత అప్పటికి దేశ ప్రజలకు అందుబాటులోకి రానున్నట్లు తెలుస్తోంది. పూర్తి స్థాయిలో దేశ వ్యాప్తంగా 5G ప్రారంభం కావడానికి ఇంకా కనీసం మూడు సంవత్సరాల కాలం పడుతుందని తాము అంచనా వేస్తున్నట్లు కమల్ భడాడా అన్నారు. ప్రస్తుతం భారత్ ఇంకా ప్రారంభదశల్లోనే ఉందని అభిప్రాయపడ్డారు.

ఇవీ చదవండి..

Multibagger Returns: ఏడాదిలో పెట్టుబడిని రెండింతలు చేసిన రియల్ ఎస్టేట్ మల్టీబ్యాగర్ స్టాక్..

ICICI Lombard: ఐసిఐసిఐ లాంబార్డ్ స్మార్ట్‌ఫోన్ ఇన్సూరెన్స్.. పాలసీ వ్యవధిలో గరిష్ఠంగా రెండు క్లెయిమ్‌ చేయవచ్చు..