GST Payers: జీఎస్‌టీ చెల్లింపుదారులకు కేంద్ర ప్రభుత్వం గుడ్‌న్యూస్‌.. వడ్డీ, చార్జీల మాఫీ..!

|

Sep 22, 2021 | 9:34 PM

GST Payers: కేంద్ర సర్కార్‌ వస్తు సేవల పన్ను (GST) చెల్లింపుదారులకు గుడ్‌న్యూస్‌ అందించనుంది. జీఎస్టీ ఫైలింగ్‌ సమయంలో సోమవారం కొంత మంది ఇబ్బందులు..

GST Payers: జీఎస్‌టీ చెల్లింపుదారులకు కేంద్ర ప్రభుత్వం గుడ్‌న్యూస్‌.. వడ్డీ, చార్జీల మాఫీ..!
Follow us on

GST Payers: కేంద్ర సర్కార్‌ వస్తు సేవల పన్ను (GST) చెల్లింపుదారులకు గుడ్‌న్యూస్‌ అందించనుంది. జీఎస్టీ ఫైలింగ్‌ సమయంలో సోమవారం కొంత మంది ఇబ్బందులు ఎదుర్కొన్నట్లు జీఎస్టీ ప్యానెల్‌ దృష్టికి వచ్చింది. దీంతో కేంద్రం కీలక నిర్ణయం తీసుకోవాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఐటీ సమస్యల పరిష్కార కమిటీ వడ్డీ, ఆలస్య ఫీజును మాఫీ చేయాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది. కేంద్ర పరోక్ష పన్నుల బోర్డు (సీబీఐసీ) ఈ విషయాన్ని ట్విట్టర్ వేదికగా తెలియజేసింది. కొంత మంది పన్ను చెల్లింపుదారులు సెప్టెంబర్ 20న జీఎస్‌టీ దాఖలు సమయంలో ఇబ్బందులు ఎదుర్కొన్నారని తెలుస్తోందని పేర్కొంది. ఎలక్ట్రానిక్ క్యాష్ లెడ్జర్ అప్‌డేషన్‌కు సమస్యలు ఎదుర్కొన్నట్లు తమ దృష్టికి వచ్చిందని, ఆగస్ట్ నెలకు సంబంధించి జీఎస్‌టీ రిటర్న్, జీఎస్‌టీఆర్ 3బీ దాఖలు చేయడానికి సెప్టెంబర్ 20తో గడువు ముగిసిన విషయం తెలిసిందే. ఇబ్బందులు ఎదుర్కొన్న పన్ను చెల్లింపుదారులకు ఒక్క రోజు వడ్డీ, ఆలస్య చార్జీలను మాఫీ చేయనున్నారని వివరించింది.

 

ఇవీ కూడా చదవండి:

Bank Account: మీకు అవసరం లేని బ్యాంకు ఖాతాలు ఉన్నాయా..? ఇలా మూసివేయండి.. లేకపోతే ఇబ్బందే..!

SBI Pension Seva Portal: పెన్షనర్లకు ఎస్‌బీఐ శుభవార్త.. ఇక నుంచి ఆ సర్టిఫికెట్‌ను ఏ బ్రాంచ్‌లోనైనా సమర్పించవచ్చు