దేశ అభివృద్ధిలో పన్ను చెల్లింపు అనేది కీలక పాత్ర పోషిస్తుంది. ముఖ్యంగా ఆదాయ పన్ను చెల్లింపు అనేది దేశ అభివృద్ధికి చాలా ముఖ్యం. సాధారణంగా మనం కొన్న వస్తువులపై వ్యాట్, స్టేట్ జీఎస్టీ, సెంట్రల్ జీఎస్టీ వంటి పన్నులు చెల్లించినా.. మనం సంపాదించే ఆదాయంపై పన్ను కూడా చెల్లించాల్సి ఉంటుంది. ఇటీవల కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ తన బడ్జెట్ ప్రసంగంలో రూ.7 లక్షల లోపు ఆదాయం పొందే వారికి పన్ను మినాహాయింపునిచ్చారు. అంతకు మించి సంపాదించే వారు కచ్చితంగా వివిధ శ్లాబుల్లో పన్ను చెల్లించాల్సి ఉంటుంది. అలాగే యూకే అయినా, అమెరికా అయినా, బ్రిటన్ అయినా ఏ దేశాల్లో అయినా అక్కడి పరిస్థితి బట్టి పౌరులు పన్ను చెల్లించాల్సి ఉంటుంది. కానీ ప్రపంచంలో కొన్ని పన్నురహిత దేశాలు ఉన్నాయని తెలుసా? మీరు వింటున్నది నిజమే.. కొన్ని దేశాలు ఇతర ఆదాయంపైన దృష్టి పెట్టి పౌరుల నుంచి మాత్రం పన్నులు విధంచవు. అవేంటో ఓ సారి చూద్దాం.
బహామస్ దేశ పౌరులు తమ ఆదాయంపై పన్ను చెల్లించాల్సిన అవసరం లేదు. ఈ ద్వీపం ముఖ్యంగా టూరిస్టులపై ఆధారపడి ఉంటుంది. పనామా లాంటి అద్భుత బీచ్ లతో పాటు క్యాసినో వంటి ఆటలు ఇక్కడ పర్యాటకులను ఎంతగానో ఆకర్షిస్తాయి. అలాగే చమురు నిల్వలు సమృద్ధిగా ఉండే దేశాలు అంటే యూనైటెడ్ అరబ్ ఎమిరేట్స్, బ్రూనై, కువైట్, ఒమన్, ఖతార్ వంటి దేశాల పౌరులు కూడా ఆదాయ పన్ను చెల్లించాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఆయా దేశాలు చమురు అమ్మకాల ద్వారా ఆదాయం గడిస్తాయి. అలాగే మాల్దీవులు, మొనాకో, నౌరు, సోమాలియా వంటి దేశాలు కూడా వివిధ కారణాల వల్ల పౌరుల నుంచి పన్ను వసూలు చేయవు. అయితే సోమాలియాలో మాత్రం రాజకీయ అస్థిరత కారణంగా పన్నులు వసూలు చేయరు. ఆయా దేశాల పరిస్థితులేంటో పక్కన పెడితే పన్ను చెల్లింపు విషయంలో మాత్రం ఆయా దేశాలు ఇతర దేశాల కంటే భిన్నంగా ఉన్నాయి.
మరిన్ని బిజినెస్ న్యూస్ కోసం