EV Car: ఆ టాటా కారు ఈవీ వెర్షన్ రిలీజ్.. టాప్ రేపుతున్న నయా ఫీచర్లు

భారతదేశంలోని కారు లవర్స్ ఇటీవల ఈవీ కార్ల కొనుగోలుకు ఆసక్తి చూపుతున్నారు. మైలేజ్ సంబంధిత సమస్యలను పరిష్కరిస్తూ అన్ని కంపెనీలు లాంగ్ రేంజ్ ఈవీలను లాంచ్ చేయడంతో కొనుగోలుకు ముందుకు వస్తున్నారు. తాజాగా ప్రముఖ కంపెనీ టాటా తన సియెర్రాను ఈవీ వెర్షన్‌ను లాంచ్ చేస్తున్నట్లు ప్రకటించింది.

EV Car: ఆ టాటా కారు ఈవీ వెర్షన్ రిలీజ్.. టాప్ రేపుతున్న నయా ఫీచర్లు
Tata Sierra Ev

Updated on: Jun 16, 2025 | 7:57 PM

టాటా మోటార్స్ సియెర్రా ఎస్‌యూవీను ఐసీఈ, ఈవీ వేరియంట్లలో రీ లాంచ్ చేయడానికి సన్నాహాలు చేస్తోంది. ట్రై-స్క్రీన్ సెటప్, అధునాతన ఫీచర్లు, లెవెల్ 2 ఏడీఏఎస్ వంటి అత్యాధునిక భద్రతా సాంకేతికతలతో ఈ కారును లాంచ్ చేయనున్నారు. హారియర్ ఈవీతో మార్కెట్‌ను షేక్ చేస్తున్న టాటా మోటార్స్ ఈ సంవత్సరం సియెర్రాతో మరో ఊపు తీసుకోవాలని ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. ఈ మోడల్‌ను ముందుగా 2025 భారత్ మొబిలిటీ గ్లోబల్ ఎక్స్‌పోలో ప్రదర్శించారు. ఇప్పటికే ఈ ఎస్‌యూవీకు సంబంధించిన స్పై షాట్లు ఇప్పటికే ఆన్‌లైన్‌లో కనిపిస్తున్నాయి. దాదాపు ఇరవై సంవత్సరాల తర్వాత టాటా సియెర్రా తిరిగి మార్కెట్లోకి వచ్చి ఈ రంగంలో మరోసారి ఆధిపత్యం చెలాయిస్తుందని నిపుణులు అంచనా వేస్తున్నారు. త్వరలోనే సియెర్రా ఎస్‌యూవీ ఐసీఈ, ఈవీ వేరియంట్లు రెండూ కొనుగోలుకు అందుబాటులో ఉండున్నాయి.  టాటా సియెర్రా డ్రైవింగ్ అనుభవాన్ని మెరుగుపరచడానికి ట్రై-స్క్రీన్ సెటప్‌తో ఆకట్టుకోనుంది.

ఇటీవల వెల్లడైన నివేదికల ప్రకారం ప్రతి యూనిట్ 12.3 అంగుళాలు స్క్రీన్‌తో వస్తుంది. ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్‌కు సంబంధించిన సెంటర్ యూనిట్, డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ ఒక స్క్రీన్‌పై ఉంటాయి. కొన్ని నెలల క్రితం భారతదేశంలో ప్రారంభించిన మహీంద్రా ఎక్స్ఈవీ 9ఈ ప్రేరణతో ఈ కారులో కొన్ని మార్పులు చేశారని పుకార్లు షికారు చేస్తున్నాయి. పనోరమిక్ సన్‌రూఫ్, హర్మాన్ సౌండ్ సిస్టమ్, డ్యూయల్-టోన్ డ్యాష్‌బోర్డ్, స్టైలిష్ ఫోర్-స్పోక్ మల్టీఫంక్షనల్ స్టీరింగ్ వీల్, వైర్‌లెస్ ఛార్జింగ్, ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్, డాష్‌బోర్డ్‌పై సాఫ్ట్-టచ్ మెటీరియల్స్, ఆటోమేటిక్‌ అడ్జస్ట్‌బుల్ వెంటిలేటెడ్ ఫ్రంట్ సీట్లు ఉంటాయి.

టాటా సియెర్రా ఇటీవల విడుదల చేసిన హారియర్ ఈవీలో వచ్చినట్లుగానే అనేక ప్రసిద్ధ భద్రతా ఫీచర్స్‌తో వస్తుంది. సరౌండ్-వ్యూ కెమెరా, 2 ఏడీఏఎస్, హెచ్‌డీ రియర్‌వ్యూ మిర్రర్, ప్రామాణికంగా ఏడు ఎయిర్‌బ్యాగ్‌లు, ఇతర ప్రయోజనాలతో వస్తాయి. ఐసీఈ వెర్షన్ 2.0 లీటర్ల డీజిల్ ఇంజన్, 1.5 లీటర్ల టర్బోచార్జ్డ్ జీడీఐ పెట్రోల్ ఇంజన్‌ను కలిగి ఉండే అవకాశం ఉంది. ఈ ఇంజన్ ఎంపికలతో మాన్యువల్, ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌లు రెండూ అందుబాటులో ఉండే అవకాశం ఉంది. ఎలక్ట్రిక్ వెర్షన్ హారియర్ ఈవీ మాదిరి బ్యాటరీ ప్యాక్, డ్యూయల్-మోటార్ ఏడబ్ల్యూడీ సిస్టమ్‌ను ఉపయోగించే అవకాశం ఉంది.

ఇవి కూడా చదవండి

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి