Tata Motors: కస్టమర్లకు టాటా మోటార్స్ షాక్.. ఆ వాహనాల ధరలు పెరిగాయి

|

Jul 09, 2022 | 2:38 PM

Tata Motors: ముడి సరకుల ధరలు పెరగడంతో మిగిలిన ఆటో మొబైల్ కంపెనీలు కూడా గత రెండు మాసాలుగా తమ వాహనాల ధరలను పెంచాయి. ఇప్పుడు టాటా మోటార్స్ కూడా అదే బాటలో వాహనాల ధరలు పెంచుతూ నిర్ణయం తీసుకుంది. 

Tata Motors: కస్టమర్లకు టాటా మోటార్స్ షాక్.. ఆ వాహనాల ధరలు పెరిగాయి
Tata Motors
Follow us on

Automobile News:  దేశీయ ఆటో మొబైల్ దిగ్గజ సంస్థ టాటా మోటార్స్(Tata Motors) షాకింగ్ నిర్ణయం తీసుకుంది. కస్టమర్లపై మరింత భారాన్ని మోపుతూ.. ప్యాసింజర్ వాహన శ్రేణి ధరలను మళ్లీ పెంచినట్లు ప్రకటించింది. దీంతో టాటా మోటార్స్‌కు చెందిన కార్ల ధరలు పెరగనున్నాయి.  పెరుగుతున్న ఉత్పత్తి ఖర్చుల భారాన్ని పాక్షికంగా తగ్గించుకునేందుకు వీలుగా ప్యాసింజర్ వాహనాల ధరలను పెంచినట్లు తెలిపింది. పెంచిన ధరలు తక్షణమే అమల్లోకి వచ్చినట్లు శనివారం ఓ ప్రకటన విడుదల చేసింది. వేరియంట్, మోడల్ ఆధారంగా మునుపటి ధరలో సగటున 0.55 శాతం పెంచినట్లు ప్రకటించింది.

పెరిగిన ఇన్‌పుట్ ఖర్చుల భారాన్ని తగ్గించుకునేందుకు కంపెనీ విస్తృతమైన చర్యలు తీసుకుంటున్నట్లు ఆ సంస్థ తెలిపింది. ప్యాసింజర్ వాహన శ్రేణి ధరలను పెంచడంతో ఈ భారాన్ని కాస్తైనా తగ్గించుకోవచ్చని భావిస్తున్నట్లు తెలిపింది. దేశీయ విపణిలో ఆ కంపెనీ పంచ్, నెక్సాన్, హారియర్, సఫారితో సహా పలు రకాల మోడళ్లను విక్రయిస్తోంది. తాజా నిర్ణయంతో ఈ కార్ల ధరలు పెరగనున్నాయి.

టాటా మోటార్స్ ఇప్పటికే తమ వాణిజ్య వాహనాల (కమర్షియల్ వెహికల్స్) శ్రేణి ధరలను జులై నెల నుండి 1.5 – 2.5 శాతం వరకు పెంచింది.

ఇవి కూడా చదవండి

ముడి సరకుల ధరలు పెరగడంతో మిగిలిన ఆటో మొబైల్ కంపెనీలు కూడా గత రెండు మాసాలుగా తమ వాహనాల ధరలను పెంచాయి. ఇప్పుడు టాటా మోటార్స్ కూడా అదే బాటలో వాహనాల ధరలు పెంచుతూ నిర్ణయం తీసుకుంది.

మరిన్ని బిజినెస్ వార్తలు చదవండి