Tata Group: కీలక నిర్ణయం.. టాటా గ్రూప్‌లో ఈ రెండు కంపెనీలు విలీనం
దేశంలోని ప్రముఖ ఆటోమొబైల్ కంపెనీ టాటా మోటార్స్ ఇటీవల తన ప్యాసింజర్ కార్ల వ్యాపారం, వాణిజ్య వాహనాల వ్యాపారం నుండి విడిపోతున్నట్లు ప్రకటించింది. ఇప్పుడు ఈ టాటా గ్రూప్ కంపెనీ తన ఫైనాన్స్ యూనిట్ టాటా మోటార్స్ ఫైనాన్స్‌ను టాటా క్యాపిటల్‌తో విలీనం చేయాలని నిర్ణయించుకుంది. షేర్ స్వాప్ ద్వారా ఈ డీల్ పూర్తవుతుంది. ఆదాయపరంగా దేశంలోనే అతిపెద్ద ఆటోమొబైల్ కంపెనీ అయిన టాటా మోటార్స్, షేర్ స్వాప్ డీల్ కింద..

దేశంలోని ప్రముఖ ఆటోమొబైల్ కంపెనీ టాటా మోటార్స్ ఇటీవల తన ప్యాసింజర్ కార్ల వ్యాపారం, వాణిజ్య వాహనాల వ్యాపారం నుండి విడిపోతున్నట్లు ప్రకటించింది. ఇప్పుడు ఈ టాటా గ్రూప్ కంపెనీ తన ఫైనాన్స్ యూనిట్ టాటా మోటార్స్ ఫైనాన్స్‌ను టాటా క్యాపిటల్‌తో విలీనం చేయాలని నిర్ణయించుకుంది. షేర్ స్వాప్ ద్వారా ఈ డీల్ పూర్తవుతుంది. ఆదాయపరంగా దేశంలోనే అతిపెద్ద ఆటోమొబైల్ కంపెనీ అయిన టాటా మోటార్స్, షేర్ స్వాప్ డీల్ కింద టాటా మోటార్స్ ఫైనాన్స్‌ను ఎన్‌బిఎఫ్‌సి టాటా క్యాపిటల్‌తో విలీనం చేయనున్నట్లు మంగళవారం ప్రకటించింది. ఈ విలీనం వల్ల కంపెనీలు, వారి కస్టమర్లు ఇద్దరూ ప్రయోజనం పొందుతారు. ప్రణాళిక ప్రకారం.. టాటా మోటార్స్ ఫైనాన్స్ వాటాదారులు ప్రతి 100 ఈక్విటీ షేర్లకు టాటా క్యాపిటల్ 37 ఈక్విటీ షేర్లను స్వీకరిస్తారని కంపెనీ ఎక్స్ఛేంజ్ ఫైలింగ్‌లో తెలిపింది.
కొత్త కంపెనీలో టాటా మోటార్స్‌కు 4.7 శాతం వాటా:
టాటా మోటార్స్, టాటా క్యాపిటల్, టాటా మోటార్స్ ఫైనాన్స్ బోర్డులు నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్ (NCLT) స్కీమ్ ఆఫ్ అరేంజ్‌మెంట్ కింద ఈ విలీనాన్ని ఆమోదించాయి. టాటా మోటార్స్ విలీన ప్రక్రియ పూర్తి కావడానికి దాదాపు ఏడాది సమయం పడుతుందని ఓ ప్రకటన విడుదల చేసింది. ఒప్పందం పూర్తయిన తర్వాత కొత్త కంపెనీ టాటా మోటార్స్‌కు 4.7 శాతం వాటా ఉంటుంది. ఈ విలీనం వల్ల టాటా మోటార్స్ ఫైనాన్స్ కస్టమర్లు లేదా రుణదాతలపై ఎలాంటి ప్రతికూల ప్రభావం ఉండదని కంపెనీ తెలిపింది.
టాటా క్యాపిటల్ అనేక రకాల రుణాలను ఇస్తుంది:
టాటా క్యాపిటల్ వాహన రుణాలతో పాటు గృహ, విద్యా రుణాలను కూడా అందిస్తుంది. మంగళవారం ఎన్‌ఎస్‌ఈలో టాటా మోటార్స్ షేరు 4.79 శాతం క్షీణించి రూ.904.95 వద్ద ముగిసింది. టాటా క్యాపిటల్ 2024 ఆర్థిక సంవత్సరంలో రూ. 3150 కోట్ల నికర లాభం ఆర్జించింది. ఇదే కాలంలో టాటా మోటార్స్ ఫైనాన్స్ నికర లాభం రూ.52 కోట్లు. అయితే ఈ ఒప్పందం రెగ్యులేటరీ ఆమోదం కోసం వేచి ఉంది.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి




