TATA Motors: ఆ మోడల్ కార్లపై భారీ డిస్కౌంట్లు.. ప్రకటించిన కార్ల దిగ్గజం టాటా మోటార్స్..

TATA Motors: ఫిబ్రవరి నెలలో దేశీయ కార్ల దిగ్గజం టాటా మోటార్స్ తన కార్లపై కొత్త ఆఫర్లను, డిస్కౌంట్లను ప్రకటించింది. కొత్తగా ప్రకటించిన ఆఫర్లతో వినియోగదారులు లాభపడనున్నారు. వివిధ సెలెక్టెడ్ మోడళ్ల కార్లపై గరిష్ఠంగా..

TATA Motors: ఆ మోడల్ కార్లపై భారీ డిస్కౌంట్లు.. ప్రకటించిన కార్ల దిగ్గజం టాటా మోటార్స్..
Tata Motors

Updated on: Feb 16, 2022 | 3:51 PM

TATA Motors: ఫిబ్రవరి నెలలో దేశీయ కార్ల దిగ్గజం టాటా మోటార్స్ తన కార్లపై కొత్త ఆఫర్లను, డిస్కౌంట్లను ప్రకటించింది. కొత్తగా ప్రకటించిన ఆఫర్లతో వినియోగదారులు లాభపడనున్నారు. వివిధ సెలెక్టెడ్ మోడళ్ల కార్లపై గరిష్ఠంగా రూ. 40 వేల వరకు తగ్గింపులను పొందే సౌలభ్యాన్ని టాటా మోటార్స్ తెచ్చింది. టాటా టియాగో, టిగర్, నెక్సన్, హారియర్ తో పాటు సఫారీ మోడళ్లపై ఈ తగ్గింపు లభించనుంది. ఈ తగ్గింపును వినియోగదారులు ఎక్ఛేంజ్ బోనస్, క్యాష్ ఎక్ఛేంజ్ బోనస్, కార్పొరేట్ ప్రయోజనాల రూపంలో పొందుతారు.

కొత్త టాటా టియాగో (Tata Tiago), టిగోర్(Tigor) ప్రస్తుతం రూ.10 వేల నగదు తగ్గింపు పొందవచ్చు. దీనికి తోడు మరో రూ. 10 వేలు ఎక్స్ఛేంజ్ బోనస్‌తో అందుబాటులో ఉన్నాయి. అయితే.. ఈ ఆఫర్‌లు కొత్తగా ప్రవేశపెట్టిన టియాగో, టిగోర్ లోని CNG ట్రిమ్‌లపై వర్తించవని స్పష్టం చేసింది. ఇది కాకుండా, స్వదేశీ కార్‌మేకర్ అదనంగా గ్రామీణ తగ్గింపుగా రూ. 2,500, కార్పొరేట్ ప్రయోజనంగా రూ.3,000, ఆరోగ్య సంరక్షణ కార్యకర్తలకు రూ.3,000 అదనపు తగ్గింపు అందిస్తోంది.

ఇవీ చదవండి.. 

Ajit Doval: అజిత్ దోవల్ ఇంటి వద్ద కలకలం.. ఇంట్లో చొరబడేందుకు ఆగంతకుడి యత్నం

Central Government: వాహనదారులకు షాకింగ్ న్యూస్.. ఇకపై వారికీ హెల్మెట్ తప్పనిసరి.. పాటించకపోతే జైలే..