Air India: టాటాలు దిద్దిన కాపురం.. ఎయిరిండియాను గాడిలో పెట్టెందుకు పక్కా ప్లాన్స్ రెడీ.. భారీ ప్రణాళికల వివరాలు

|

Feb 19, 2022 | 7:57 AM

Air India: ఎట్టకేలకు టాటాల చెంతకు చేరిన ఎయిర్ ఇండియాను తిరిగి గాడిలో పెంట్టేందుకు చర్యలు ప్రారంభమయ్యాయి. దీనికోసం టాటా ఛైర్మన్ చంద్రశేఖరన్ భారీ దిద్దుబాటు చర్యలకు ప్రణాళిక సిద్ధం చేశారు. ఎయిర్ ఇండియాను బ్యాక్ టు ట్రాక్ తీసుకొచ్చేందుకు...

Air India: టాటాలు దిద్దిన కాపురం..  ఎయిరిండియాను గాడిలో పెట్టెందుకు పక్కా ప్లాన్స్ రెడీ.. భారీ ప్రణాళికల వివరాలు
Air India
Follow us on

Air India: ఎట్టకేలకు టాటాల చెంతకు చేరిన ఎయిర్ ఇండియాను తిరిగి గాడిలో పెంట్టేందుకు చర్యలు ప్రారంభమయ్యాయి. దీనికోసం టాటా ఛైర్మన్ చంద్రశేఖరన్ భారీ దిద్దుబాటు చర్యలకు ప్రణాళిక సిద్ధం చేశారు. ఎయిర్ ఇండియాను బ్యాక్ టు ట్రాక్ తీసుకొచ్చే.. ప్రణాళికలో భాగంగా ఆర్థికంగా బలపరిచేందుకు, సరికొత్త విమానాలు కలిగిన విమానయాన కంపెనీగా మార్చనున్నట్లు ఛైర్మన్ తెలిపారు. ప్రపంచవ్యాప్తంగా సంస్థలో పనిచేస్తున్న ఎయిర్ ఇండియా ఉద్యోగులతో ఆయన వర్చువల్ సమావేశంలో మాట్లాడారు. మళ్లీ ఎయిర్ ఇండియా బెస్ట్ సర్వీస్ ప్రొవైడర్ గా మార్చనున్నట్లు తెలిపారు. దీనికోసం సంస్థాగతంగా భారీ మార్పులు జరగనున్నట్లు వెల్లడించారు. దీని వల్ల ఉద్యోగులు కూడా మార్పులకు గురికావలసి ఉంటుందని ఆయన వెల్లడించారు. దేశవిదేశాల్లో తమ సేవలను మరింత విస్తరించడంతో పాటు మెరుగైన సేవలు అందించనున్నట్లు టాటా సంస్థ వెల్లడించింది. భారత్ ను ప్రపంచంలోని అన్ని ప్రదేశాలతో కనెక్ట్ చేసేందుకు తాము ప్రయత్నం చేస్తున్నట్లు టాటాలు తెలిపారు.

తాజ్ హోటల్స్, తనిష్క్, టాటా సాల్ట్, జాగ్వార్ ల్యాండ్ రోవర్ సహా వివిధ బ్రాండ్ల ద్వారా ఇప్పటికే 60 కోట్ల మంది భారతీయుల జీవితాల చేరువైన సంస్థ..130 కోట్ల మంది భారతీయుల ఆకాంక్షలకు ప్రాతినిధ్యం వహించే అవకాశంతో ఎయిర్ ఇండియా సహాయపడుతుందని టాటా గ్రూప్ ఛైర్మన్ చంద్రశేఖరన్ అన్నారు.

కొత్త మ్యానేజ్ మెంట్ కింద ఎయిర్ ఇండియా సారించే నాలుగు ప్రధాన అంశాలపై దృష్టి సారించినట్లు తెలిపారు. ఇవి అత్యుత్తమ కస్టమర్ సేవను అందజేస్తున్నాయని.. అందువల్ల ప్రపంచంలోనే అత్యంత సాంకేతికంగా అభివృద్ధి చెందిన ఎయిర్‌లైన్‌గా అవతరించిందని ఎయిర్ ఇండియా వెల్లడించారు. హాస్పిటాలిటీ, విమానాల ఆధునికీకరణ, అత్యుత్తమ సర్వీస్ అందించనున్నట్లు వెల్లడించారు. ఎయిర్ ఇండియా సంస్థల కింద మెుత్తం 15 వేల మంది ఉద్యోగులు ఉండగా.. వారిలో 8 వేల మంది పర్మనెంట్ ఉద్యోగులు ఉన్నట్లు వెల్లడించింది. ఎన్నో ఏళ్లుగా టాటా సంస్థలు నమ్మకానికి, నాణ్యతకు, నిలకడకు మారుపేరుగా నిలిచిందని ఛైర్మన్ వెల్లడించారు. ఎయిర్ ఇండియాకు సంబంధించిన మహారాజ హాస్పిటాలిటీని మళ్లీ తమ సేవల్లో తిరిగి తీసుకువస్తామని చంద్రశేఖరన్ వివరించారు. ఆగస్టు 31, 2021 నాటికి ఎయిర్ ఇండియాకు రూ. 61,562 కోట్ల అప్పు ఉంది.

ఇవీ చదవండి..

Multibagger Penny Stock: రూ. లక్ష పెట్టుబడి పెడితే.. రూ. 8.5 లక్షలు రిటర్న్ ఇచ్చిన షేర్.. కేవలం 3 నెలల్లో..

Phone Pe: బంపర్ ఆఫర్ ప్రకటించిన ఫోన్ పే.. అలా చేసిన వారికి రూ. 5 లక్షలు ప్రైజ్ మనీ..