Tata Neu App: పేమెంట్స్ నుంచి పర్చేజ్ దాకా.. సినిమాలూ.. ట్రావెలింగ్ అన్నీ ఒకే చోట.. టాటా సూపర్ యాప్

|

Apr 07, 2022 | 6:47 PM

Tata Neu App: టాటా గ్రూప్ తన మోస్ట్ ఎవైటెడ్ సూపర్ యాప్ న్యూ (Neu)ని ఈ రోజు లాంచ్ చేసింది. ఈ యాప్‌ను గూగుల్ ప్లే స్టోర్ నుంచి డౌన్‌లోడ్ చేసుకోవచ్చని కంపెనీ తెలిపింది.

Tata Neu App: పేమెంట్స్ నుంచి పర్చేజ్ దాకా.. సినిమాలూ.. ట్రావెలింగ్ అన్నీ ఒకే చోట.. టాటా సూపర్ యాప్
Tata Neu
Follow us on

Tata Neu App: టాటా గ్రూప్ తన మోస్ట్ ఎవైటెడ్ సూపర్ యాప్ న్యూ (Neu)ని ఈ రోజు లాంచ్ చేసింది. ఈ యాప్‌ను గూగుల్ ప్లే స్టోర్ నుంచి డౌన్‌లోడ్ చేసుకోవచ్చని కంపెనీ తెలిపింది. టాటా గ్రూప్ యొక్క ప్రధాన లక్ష్యం కంపెనీ మొత్తం డిజిటల్ వింగ్‌ను పెంచడం. ఇప్పటికే మార్కెట్‌లో ఉన్న Amazon, Flipkart, Reliance Groupకు చెందిన Jio Mart వంటి కంపెనీలకు ఇది గట్టి పోటీ ఇవ్వనుంది. టాటా కొత్త యాప్ విమానయాన సంస్థలు, హోటళ్లు, మందులు, కిరాణా సామాగ్రిని ఒకే ప్లాట్‌ఫారమ్‌పై పొందేలా డిజైన్ చేసినట్లు కంపెనీ చెబుతోంది. Tata Neu యాప్ నుంచి కారును కూడా బుక్ చేసుకోవచ్చు. టాటా ప్రణాళిక గల్ఫ్ ప్రాంతంలోని వ్యాపార సమూహాలతో సరిపోతుంది.

ఈ సూపర్ యాప్స్ ఏమిటి?

బ్లాక్‌బెర్రీ వ్యవస్థాపకుడు మైక్ లజారిడిస్ 2010లో సూపర్ యాప్ అనే పదాన్ని మెుదటగా ఉపయోగించారు. దీని తర్వాత కూడా, వచ్చిన సూపర్ యాప్‌లు ఏవీ అమెరికా, యూరప్ లేదా UK నుంచి వచ్చినవి కావు. సూపర్ యాప్ అంటే అవసరమైన అన్ని వస్తువులు, సేవలు అందుబాటులో ఉండే ప్లాట్‌ఫారమ్ అని అర్థం. చైనాలో WeChat అటువంటి యాప్ గా ప్రస్తుతం ఉంది. ఇది మెసేజింగ్ యాప్‌గా ప్రారంభమై.. ఇప్పుడు చెల్లింపులు, షాపింగ్, ఫుడ్ ఆర్డర్, క్యాబ్ సేవలు కూడా అందుబాటులోకి తెచ్చి సూపర్ యాప్‌గా మారింది. మీరు సూపర్ యాప్‌ను మాల్‌గా కూడా ఊహించుకోవచ్చు, ఇక్కడ రిటైల్ స్థలంలో మీరు అన్ని బ్రాండ్‌లు, వ్యాపారాలు, దుకాణాలను కనుగొంటారు.

సూపర్ యాప్‌లను ఎవరు తయారు చేస్తారు?

సాధారణంగా వివిధ రకాల సేవలు, ఉత్పత్తులను అందించే కంపెనీలు సూపర్ యాప్‌లను తయారు చేస్తాయి. ఆఫర్‌లను సూపర్ యాప్ ద్వారా ఒక ప్లాట్‌ఫారమ్‌పైకి తీసుకురావడానికి ప్రయత్నిస్తారు. Super App భావన మొదట చైనా, ఆగ్నేయాసియాలో ఉద్భవించింది. WeChat, GoJek, Grab తమ ఆదాయాన్ని పెంచుకోవడానికి అదనపు సేవలను అందించడం ప్రారంభించాయి. సోషల్ మీడియా మరియు కమ్యూనికేషన్ అవసరాల ఆధారంగా తమ ప్లాట్‌ఫారమ్‌లలో కస్టమర్ ట్రాఫిక్‌ను పెంచడానికి ఈ కంపెనీలు ఈ చర్యలు తీసుకున్నాయి.అయితే, పశ్చిమాసియా ప్రాంతంలో భిన్నమైన విధానం ఉద్భవించింది. మాజిద్ అల్ ఫుట్టైమ్ గ్రూప్, ఎమ్మార్, చల్హబ్ గ్రూప్ వంటి సాంప్రదాయ వ్యాపార సమూహాలు షాపింగ్ మాల్స్, కిరాణా మరియు వినోద వ్యాపారాలను కలిగి ఉన్నాయి. డిజిటల్ ఆస్తులను సృష్టించి వాటిని సూపర్ యాప్‌లుగా మార్చాడు. ఇప్పుడు దానిలో ఒకటి కంటే ఎక్కువ ఉత్పత్తులు అందుబాటులో ఉన్నాయి.

భారతీయ కంపెనీలు సూపర్ యాప్‌లను ఎందుకు తయారు చేయాలనుకుంటున్నాయి? పెద్ద జనాభా డెస్క్‌టాప్ కాకుండా స్మార్ట్‌ఫోన్ నుంచి మరిన్ని సేవలు, ఫీచర్లను కోరుకున్నప్పుడు ఒక దేశం లేదా ప్రాంతం సూపర్ యాప్ కోసం సిద్ధంగా ఉన్నట్లు పరిగణించబడుతుంది. స్థానిక అవసరాలను తీర్చడానికి యాప్‌ల వ్యవస్థ లేకపోవడం కూడా దీనికి ప్రధాన కారణం. అత్యధిక జనాభా ఇంటర్నెట్‌ను ఉపయోగిస్తున్న మార్కెట్‌గా భారత్‌ మారుతోంది. నేడు 90% మంది మొబైల్ ద్వారా ఇంటర్నెట్‌ను సర్ఫింగ్ చేస్తున్నారు. దీని కారణంగా చాలా కంపెనీలు సూపర్ యాప్‌లను తయారు చేస్తున్నాయి. ఇది కాకుండా, సూపర్ యాప్స్ ఆదాయాన్ని పెంచడంతో పాటు వినియోగదారు డేటా నుంచి వినియోగదారు ప్రవర్తన గురించి మరింత సమాచారాన్ని సేకరించేందుకు దోహదపడుతున్నాయి.

ఇవీ చదవండి..

Bangalore Crime: కుమారుడిపై కన్నతండ్రి కర్కశత్వం.. డబ్బులు పోగొట్టుకున్నాడని పెట్రోల్ పోసి నిప్పు.. ఆఖరుకు

Dairy Farming: పశుపోషణకి పెద్దపీట వేస్తున్న కేంద్రం.. ఈ పథకం కింద రైతులకి ప్రత్యేక సబ్సిడీ..!