Multibagger Returns: ఇన్వెస్టర్లకు లాభాల పంట పండించిన టాటా షేర్.. 2 ఏళ్లలో మంచి రిటర్న్స్..

Multibagger Returns: స్టాక్ మార్కెట్ ఇన్వెస్టర్లకు అనేక సార్లు కలలో కూడా ఊహించని లాభాలను తెచ్చిపెడుతుంటాయి. కానీ అందుకు కావలసిందల్లా కొద్దిగా ఓపిక, సరైన పెట్టుబడి పెట్టేందుకు కొంత తెలివి.

Multibagger Returns: ఇన్వెస్టర్లకు లాభాల పంట పండించిన టాటా షేర్.. 2 ఏళ్లలో మంచి రిటర్న్స్..
Tata Share

Updated on: Mar 31, 2022 | 7:06 AM

Multibagger Returns: స్టాక్ మార్కెట్ ఇన్వెస్టర్లకు అనేక సార్లు కలలో కూడా ఊహించని లాభాలను తెచ్చిపెడుతుంటాయి. కానీ అందుకు కావలసిందల్లా కొద్దిగా ఓపిక, సరైన పెట్టుబడి పెట్టేందుకు కొంత తెలివి. ఈ రెండిటినీ సరిగా బ్యాలెన్స్ చేసుకోగలిగిన వారు మంచి ఆదాయాన్ని పొందుతుంటారు. అయితే.. స్టాక్ మార్కెట్‌(Stock Market) ప్రపంచంలో కొన్ని స్టాక్స్ మాత్రం ఇన్వెస్టర్లకు స్పెషల్‌గా నిలుస్తుంటాయి. ఊహించని రీతిలో లాభాలను అందిస్తూ ఇన్వెస్టర్లను ఆకట్టుకుంటాయి. కొత్తగా టాటా కంపెనీకి(Tata company) చెందిన మరో షేరు నమ్మిన ఇన్వెస్టర్ల తలరాతను పూర్తిగా మార్చేసింది. వారు అసలు కలలో కూడా ఊహించలేని రిటర్న్స్ అందించి టాటాలపై నమ్మకాన్ని మరోసారి నిలబెట్టింది. కానీ.. ఇదంతా బాగానే ఉన్నా తేడా వస్తే వీటిలో రిస్క్ కూడా అంతే స్థాయిలో ఉంటుంది. ఒక్కోసారి పెట్టిన పెట్టుబడి పూర్తిగా ఆవిరయ్యే ప్రమాదం కూడా ఉంటుంది.

తక్కువ కాలంలోనే ఇన్వెస్టర్లకు మల్టీ బ్యాగర్ రిటర్న్స్ అందించిన టాటా షేర్ ఏమిటా అని ఆలోచిస్తున్నారు కదా.. అదే టాటా ఎలెక్సి లిమిటెడ్(Tata Elxsi stock). ఈ కంపెనీ ఎలక్ట్రానిక్స్, మెషిన్ డిజైనింగ్, సాఫ్ట్ వేర్ డెవలప్ మెంట్ అండ్ ఇమ్లిమెంటేషన్ తో పాటు మరిన్ని సేవలను ప్రపంచవ్యాప్తంగా అనేక కంపెనీలకు అందిస్తూ ఉంటుంది. ఈ కంపెనీ షేరు ధర BSEలో 7.55 శాతం పెరిగి రూ.9,078 వద్ద తాజా గరిష్ఠాన్ని తాకింది. రెండు రోజుల్లో లార్జ్ క్యాప్ స్టాక్ 17.18 శాతం లాభపడింది. కేవలం ఒక్కరోజే ఈ షేర్ అమాంతం రూ.571 పైగా లాభపడింది. అయితే, కరోనా వచ్చిన ఏడాది మార్చి నెలలో ఈ కంపెనీ షేర్ ధర చూస్తే మీరు షాక్ అవుతారు. 2020 మార్చి 27న దీని ధర రూ.639.10లుగా ఉంది. ఈ 2 ఏళ్ల కాలంలో కంపెనీ షేర్ విలువ 14 రేట్లకు పైగా పెరగడంతో ఇన్వెస్టర్లకు కాసుల వర్షం కురుస్తోంది. అంటే.. 2020 మార్చిలో లక్ష రూపాయలు ఇందులో పెట్టుబడి పెడితే దాని విలువ ఇప్పుడు రూ.14 లక్షలుగా ఉంటుంది. ఈ ఏడాది ప్రారంభం నుంచి ఈ షేరు విలువ 52.19 శాతం లాభపడగా, ఏడాదిలో 237.07 శాతం పెరిగింది. ప్రస్తుతం BSEలో కంపెనీ మార్కెట్ క్యాప్ రూ.55,812 కోట్లుగా ఉంది.

ఇవీ చదవండి..

Anand Mahindra: ఒలింపిక్స్ కి వెళితే అతనికి మెడల్ పక్కా.. టాలెంట్ పై ఆనంద్ మహీంద్రా ట్వీట్..

Multibagger Returns: నమ్మకంతో నిలిచిన ఇన్వెస్టర్లకు.. హైదరాబాదీ కంపెనీతో లాభాల సిరులు.. వివరాలివే!