Tata Sierra EV Range: టాటా నుంచి అదిరిపోయే ఎలక్ట్రిక్ కారు.. ఒకసారి ఛార్జ్ చేస్తే 590 కి.మీ వెళ్లొచ్చు..!

| Edited By: Ravi Kiran

Apr 02, 2022 | 6:23 AM

Tata Sierra EV Range: ఎలక్ట్రిక్ కార్ల తయారీలో దూకుడుగా ఉన్న టాటా మోటార్స్.. తాజాగా మరో అడుగు ముందుకేసింది. 2020 ఆటో ఎక్స్‌పోలో నెక్ట్స్ జనరేషన్ టాటా సియెర్రా ఎలక్ట్రిక్ కారును

Tata Sierra EV Range: టాటా నుంచి అదిరిపోయే ఎలక్ట్రిక్ కారు.. ఒకసారి ఛార్జ్ చేస్తే 590 కి.మీ వెళ్లొచ్చు..!
Tata
Follow us on

Tata Sierra EV Range: ఎలక్ట్రిక్ కార్ల తయారీలో దూకుడుగా ఉన్న టాటా మోటార్స్.. తాజాగా మరో అడుగు ముందుకేసింది. 2020 ఆటో ఎక్స్‌పోలో నెక్ట్స్ జనరేషన్ టాటా సియెర్రా ఎలక్ట్రిక్ కారును ఆవిష్కరిరంచిన కంపెనీ.. దానికి సంబంధించి ప్రీ బుకింగ్స్‌ను ప్రారంభించింది. దీనికి సంబంధించి టాటా కంపెనీ ఒక ప్రకటన విడుదల చేసింది. దీని ప్రకారం టాటా సియెర్రా ఎలక్ట్రిక్ కారు త్వరలోనే రోడ్లపైకి రానుంది. అయితే, ఈ కారును ఒక్కసారి ఛార్జ్ చేస్తే దాదాపు 590 కిలో మీటర్ల డ్రైవింగ్ రేంజ్ ఇస్తుందని కంపెనీ చెబుతోంది. దేశీయ వాహన తయారీ సంస్థ అయిన టాటా.. ఎలక్ట్రిక్ కార్ సెగ్మెంట్‌లో అద్భుతంగా రాణిస్తోంది. టాటా కంపెనీ నుంచి వచ్చిన నెక్సాన్ ఈవీ, టిగోర్ ఈవీలు మంచి ఆదరణ పొందుతున్నాయి. కాగా, టాటా సియెర్రా ఈవీకి సంబంధించి టాటా మోటార్స్ టీజర్‌ను విడుదల చేసింది. దీనిలో అద్భుత ఫీచర్లు ఉన్నట్లు టీజర్ ద్వారా తెలుస్తోంది. మరి టాటా సియెర్రా ఈవీ ఫీచర్స్ ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం..

69kWh బ్యాటరీ..
టాటా నుంచి వస్తున్న సియెర్రా ఈవీ కారులో 69kWh బ్యాటరీ ఇవ్వబడింది. దీనిని రెండు పార్ట్‌లుగా అమర్చారు. ఈ కారు రెండు వెర్షన్లలో అందుబాటులోకి వస్తుంది. అవి FWD (సింగిల్ ఎలక్ట్రిక్ మోటార్), AWD (డబుల్ ఎలక్ట్రిక్ మోటార్లు). కార్ లాంచ్ సమయంలో పవర్ అవుట్‌పుట్ సమాచారాన్ని కంపెనీ వెల్లడించనుంది.

టాటా సియెర్రా ఈవీ ఫీచర్స్..
టాటా సియెర్రా EV 4.1 మీటర్స్ పొడవును కలిగి ఉంది. హ్యుందాయ్ క్రెటాతో పోలిస్తే ఈ కారు కాంపాక్ట్‌గా ఉంటుంది. ఇందులో 12.12 అంగుళాల టచ్ స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్ ఉంది. ఇది IRA ప్లేస్ ప్రో కనెక్ట్ ఫీచర్లను కలిగి ఉంది. 7.7-అంగుళాల ప్లాస్మా స్క్రీన్‌ను ఉపయోగిస్తుంది. ఇది డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్. అలాగే, దీనికి భారీ పనోరమిక్ సన్‌రూఫ్ ఇవ్వబడింది.

ఇందులో 360 డిగ్రీ వ్యూ కెమెరా..
ఈ కారులో 360-డిగ్రీల వ్యూ కెమెరా ఉంది. దీని సహాయంతో వినియోగదారులు సులభంగా పార్కింగ్, రివర్స్ చేయడానికి ఆస్కారం ఉంటుంది. దీనికి 19 ఇంచెస్‌‌తో 4 అల్లోయ్ వీల్స్ ఉపయోగించారు. కొత్త సియెర్రా EV బ్రాండ్ సిగ్మా ప్లాట్‌ఫారమ్‌పై రూపొందించారు. ఈ కారులో హై స్పీడ్ వార్నింగ్ సెన్సార్ ఉంది. టర్న్ ఇండికేటర్, డోర్ ఓపెనింగ్ వార్నింగ్ ఇండికేషన్స్ కూడా ఉన్నాయి.

Also read:

Kolkata Knight Riders vs Punjab Kings: రస్సెల్ దెబ్బ.. పంజాబ్ అబ్బా.. కోల్‌కతా అదిరిపోయే విక్టరీ.. !

April Fool’s Day: ఏప్రిల్‌లో ‘‘ఫూల్స్ డే’’ని ఎందుకు జరుపుకుంటాం.. దీని వెనుక ఉన్న అసలు కథ ఇదే..!

Hair Care Tips: అందమైన కురులు కావాలంటే రివర్స్ హెయిర్ వాష్ ట్రై చేయండి.. పూర్తి వివరాలివే..