Multibagger Returns: నమ్మకంతో నిలిచిన ఇన్వెస్టర్లకు.. హైదరాబాదీ కంపెనీతో లాభాల సిరులు.. వివరాలివే!

|

Mar 30, 2022 | 9:46 AM

Multibagger Returns:  స్టాక్‌ మార్కెట్‌ పెట్టుబడులంటే చాలా మంది బయపడుతుంటారు. కానీ.. వాటిపై పట్టు సాధించిన వారికి మాత్రం డబ్బు భారీ స్థాయిలో వస్తుంటుంది. సరైన కంపెనీని ఎంచుకుని పెట్టుబడి పెట్టడంలోనే అసలు విషయం ఉంటుంది.

Multibagger Returns: నమ్మకంతో నిలిచిన ఇన్వెస్టర్లకు.. హైదరాబాదీ కంపెనీతో లాభాల సిరులు.. వివరాలివే!
Multibagger Stock
Follow us on

Multibagger Returns:  స్టాక్‌ మార్కెట్‌ పెట్టుబడులంటే చాలా మంది బయపడుతుంటారు. కానీ.. వాటిపై పట్టు సాధించిన వారికి మాత్రం డబ్బు భారీ స్థాయిలో వస్తుంటుంది. సరైన కంపెనీని ఎంచుకుని పెట్టుబడి పెట్టడంలోనే అసలు విషయం ఉంటుంది. ఇలాంటి కోవకు చెందినదే Tanla Platforms కంపెనీ. ఇది క్లౌడ్ కంప్యూటింగ్ వ్యాపారంలో రాణిస్తోంది. అందులోనూ ఇది ఒక హైదరాబాదీ కంపెనీ(Hyderabad Company) కావటం విశేషంగా చెప్పుకోవాలి. గడచిన ఎనిమిది సంవత్సరాల కాలంలో ఈ కంపెనీ తన ఇన్వెస్టర్లకు మంచి లాభాలను అందించింది. తాన్లా ప్లాట్‌ఫాం లిమిటెడ్‌ పెట్టుబడిదారులకు భారీ లాభాలను అందించింది. 2007 జనవరి 5న ఈ కంపెనీ NSEలో రూ.189.93కి లిస్ట్ అయింది. ఆరంభంలో ఒడిదొడుకులకు గురైన ఈ కంపెనీ తన జీవితకాల  కనిష్ఠమైన రూ.2.70ను తాకింది. అప్పట్లో చాలా మంది ఈ పతనాన్ని చూసి ఆందోళన చెందగా.. క్లౌడ్‌కంప్యూటింగ్‌కు భవిష్యత్తు ఉంటుందని భావించిన వారు మాత్రం తమ పెట్టుబడులను కొనసాగించారు.

కానీ.. ఆ తరువాతి కాలంలో కంపెనీ మంచి పనితీరుకు కనబరిచి ఇన్వెస్టర్లకు కాసుల పంట కురిపించింది. 2014 మార్చి 28న కంపెనీ షేర్‌ ధర కోవలం రూ.4.31గా ఉంది. గత ఎనిమిదేళ్లలో ఈ కంపెనీ స్టాక్ 30,556 శాతం మేర ఇన్వెస్టర్లకు లాభాల రూపంలో అందించింది. ప్రస్తుతం తాన్లా షేర్‌ ధర రూ. 1,440 గా ఉంది. ఈ కంపెనీలో లక్ష రూపాయలు ఇన్వెస్ట్‌ చేసిన వారికి.. ప్రస్తుతం షేర్ మార్కెట్ విలువ ప్రకారం రూ.3 కోట్లు లాభం వచ్చేవి. తాన్లా ప్లాట్‌ఫామ్స్ ప్రముఖ కమ్యూనికేషన్స్ ప్రొవైడర్. బిజినెస్ సంస్థలు తమ కస్టమర్లతో, స్టేక్‌హోల్డర్లతో సంప్రదింపులు జరుపుకునే సేవలను తాన్లా అందిస్తోంది. సీపాస్ స్పేస్‌లో ఉన్న మార్కెట్ లీడర్ కరిక్స్‌ను తాన్లా కొనుగోలు చేసింది. దాంతోపాటుగా మార్కెటింగ్ ఆటోమేషన్ కంపెనీ గమూగా‌నూ సొంతం చేసుకుంది. ఇటీవలే ట్రూకాలర్‌ సంస్థతోనూ తాన్లా కొత్తగా ఒక ఒప్పందాన్ని కుదుర్చుకుంది.

NOTE: ఇక్కడ అందిస్తున్న ఈ సమాచారం కేవలం పాఠకుల అవగాహన కోసం మాత్రమే. ఆర్ధిక నిపుణులు వెల్లడించిన అభిప్రాయాలు.. ఆయా కంపెనీల పనితీరుపై నిపుణులు అందించిన సమాచారం ఆధారంగా ఈ ఆర్టికల్ అందిస్తున్నాం. స్టాక్స్, ఫండ్స్, ఇన్సూరెన్స్ వంటి వాటిలో పెట్టుబడి పెట్టేముందు ఆర్ధిక నిపుణుల సలహా తీసుకోవాల్సిందిగా కోరుతున్నాం.

ఇవీ చదవండి..

Stock Market: భారీగా తగ్గిన ఐపీఓల రాక.. ప్రస్తుత మార్కెట్‌ పరిస్థితులే కారణమా..

Sri Lanka Crisis: లంక ఆసుపత్రి దుస్థితిపై స్పందించిన జైశంకర్.. భారత్ తరఫున అలా సాయం..