Home Loan Tips: హోమ్‌లోన్ తీసుకుంటున్నారా..? ఈ మూడు టిప్స్ పాటించాల్సిందే..!

|

Oct 04, 2024 | 4:15 PM

ప్రస్తుత రోజుల్లో చాలా మందికి సొంత ఇల్లు ఉండాలని కలగా ఉంటుంది. అయితే ఇల్లు కొనుగోలు అనేది చాలా ఖర్చుతో కూడుకున్న వ్యవహారం. చాలా మందికి సొంత ఇల్లు కొనేంత ఆర్థిక స్థితి ఉండదు. అలాంటి పరిస్థితుల్లో గృహ రుణం తీసుకోవడం ఉత్తమ ఎంపిక అని మార్కెట్ నిపుణులు చెబుతున్నారు. హోమ్ లోన్‌లో ప్రతి నెలా కొంత సొమ్ము చెల్లించడం ద్వారా వారి సొంత ఇంటి కల నెరవేరుతుంది.

Home Loan Tips: హోమ్‌లోన్ తీసుకుంటున్నారా..? ఈ మూడు టిప్స్ పాటించాల్సిందే..!
Home Loan
Follow us on

ప్రస్తుత రోజుల్లో చాలా మందికి సొంత ఇల్లు ఉండాలని కలగా ఉంటుంది. అయితే ఇల్లు కొనుగోలు అనేది చాలా ఖర్చుతో కూడుకున్న వ్యవహారం. చాలా మందికి సొంత ఇల్లు కొనేంత ఆర్థిక స్థితి ఉండదు. అలాంటి పరిస్థితుల్లో గృహ రుణం తీసుకోవడం ఉత్తమ ఎంపిక అని మార్కెట్ నిపుణులు చెబుతున్నారు. హోమ్ లోన్‌లో ప్రతి నెలా కొంత సొమ్ము చెల్లించడం ద్వారా వారి సొంత ఇంటి కల నెరవేరుతుంది. రుణ మొత్తాన్ని తిరిగి చెల్లించగల సామర్థ్యం ఉన్న వ్యక్తులకు మాత్రమే బ్యాంకులు గృహ రుణాలు ఇస్తాయి. చాలా సార్లు బ్యాంకులు రుణాన్ని ఆమోదించవు. ఎందుకంటే దరఖాస్తుదారుల రుణ చెల్లింపు సామర్థ్యాన్ని బ్యాంక్ పరిగణించదు. అలాంటి పరిస్థితుల్లో మీ హోమ్ లోన్‌ను సులభంగా బ్యాంక్ ఆమోదించడానికి పాటించాల్సిన చిట్కాలను గురించి తెలుసుకుందాం. 

మంచి క్రెడిట్ స్కోర్ 

ఏదైనా బ్యాంకు గృహ రుణం ఇచ్చే ముందు మీ క్రెడిట్ స్కోర్‌ని కచ్చితంగా తనిఖీ చేస్తుంది. మీ క్రెడిట్ స్కోర్ మీరు రుణాన్ని తిరిగి చెల్లించే సామర్థ్యాన్ని చూపుతుంది. అటువంటి పరిస్థితిలో మీ క్రెడిట్ స్కోర్‌ను మెరుగ్గా ఉంచుకోవాలని నిపుణులు చెబుతున్నాు. మీరు మీ అన్ని బిల్లులను సకాలంలో చెల్లించడం ద్వారా మీ క్రెడిట్ స్కోర్‌ను మెరుగుపరచుకోవచ్చు.

డౌన్ పేమెంట్ 

లోన్ తీసుకుంటున్నప్పుడు, గరిష్టంగా డౌన్ పేమెంట్ చేయడానికి ప్రయత్నించాలి. సాధారణంగా లోన్ తీసుకునేటప్పుడు మీ డౌన్ పేమెంట్ మొత్తం లోన్ మొత్తంలో 10 నుండి 20 శాతం ఉండాలి.

ఇవి కూడా చదవండి

ఆదాయ వనరుల పెంపు

నెలవారీ ఆదాయం ఎక్కువగా ఉన్న వారికి బ్యాంకులు చాలా త్వరగా గృహ రుణాలను మంజూరు చేస్తాయి. అంతేకాకుండా ఉపాధి పరంగా ట్రాక్ రికార్డ్ స్థిరంగా ఉన్న వ్యక్తుల రుణాలను కూడా బ్యాంకులు ఆమోదిస్తాయి. లోన్ తీసుకునే ముందు మీరు ఎక్కువ జీతం ఇచ్చే ఉద్యోగం కోసం వెతకవచ్చు లేదా మీరు ఫ్రీలాన్సింగ్ ఎంపికను కూడా ఎంచుకోవచ్చు.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..