Swiggy: ప్రపంచ కప్ సమయంలో స్విగ్గీకి రికార్డ్ స్థాయిలో ఆదాయం.. ప్రతి ఆర్డర్‌పై భారీగా డబ్బులు

వాస్తవానికి స్విగ్గీ తన ఆర్డర్‌లపై ప్లాట్‌ఫారమ్ ఛార్జీని తగ్గించింది. గతంలో స్విగ్గీలో ఫుడ్ ఆర్డర్ చేసేటప్పుడు ప్లాట్‌ఫారమ్ ఫీజు రూ.5 చెల్లించాల్సి ఉండగా ఇప్పుడు రూ.2 నుంచి రూ.3 మేరకు తగ్గించారు. ప్రపంచ కప్ సందర్భంగా స్విగ్గిలో రికార్డ్ ఫుడ్, కిరాణా వస్తువులు  ఆర్డర్‌లు వచ్చాయి. దీని కారణంగా ఆన్‌లైన్ ఫుడ్, గ్రోసరీ డెలివరీ ప్లాట్‌ఫారమ్ బంపర్ ఆదాయాన్ని అందుకుంది. 

Swiggy: ప్రపంచ కప్ సమయంలో స్విగ్గీకి రికార్డ్ స్థాయిలో ఆదాయం.. ప్రతి ఆర్డర్‌పై భారీగా డబ్బులు
Swiggy Platform Fee

Updated on: Oct 16, 2023 | 12:05 PM

ప్రపంచకప్ సందర్భంగా స్విగ్గీ తన కస్టమర్లకు భారీ బహుమతిని అందించింది. దీని కారణంగా ఆన్‌లైన్ ఫుడ్ డెలివరీ ప్లాట్‌ఫారమ్‌లు ఈ రోజుల్లో బంపర్ ఆదాయాన్ని పొందుతున్నాయి. ప్లాట్‌ఫారమ్‌ చార్జీల పేరుతో ప్రజల నుంచి వసూలు చేయడమే ఇందుకు కారణం. వాస్తవానికి స్విగ్గీ తన ఆర్డర్‌లపై ప్లాట్‌ఫారమ్ ఛార్జీని తగ్గించింది. గతంలో స్విగ్గీలో ఫుడ్ ఆర్డర్ చేసేటప్పుడు ప్లాట్‌ఫారమ్ ఫీజు రూ.5 చెల్లించాల్సి ఉండగా ఇప్పుడు రూ.2 నుంచి రూ.3 మేరకు తగ్గించారు. ప్రపంచ కప్ సందర్భంగా స్విగ్గిలో రికార్డ్ ఫుడ్, కిరాణా వస్తువులు  ఆర్డర్‌లు వచ్చాయి. దీని కారణంగా ఆన్‌లైన్ ఫుడ్, గ్రోసరీ డెలివరీ ప్లాట్‌ఫారమ్ బంపర్ ఆదాయాన్ని అందుకుంది.

ఛార్జీని పెంచిన జొమాటో ప్లాట్‌ఫారమ్

స్విగ్గీ తన కస్టమర్ల నుండి రూ. 3 వసూలు చేయడం మొదలు పెట్టినప్పుడు దీని ప్రత్యర్థి జొమాటో కూడా కొన్ని ప్రాంతాల్లో ప్లాట్‌ఫారమ్ ఛార్జీని రూ. 2 నుండి రూ. 3కి పెంచింది. అయితే ఈ ఛార్జీలో కొంతమేర జొమాటో తన గోల్డ్, స్విగ్గీ వన్ కస్టమర్స్ కు రాయితీని ఇచ్చింది.

ఆర్డర్స్ తో భారీ ఆదాయం..

ఒక రోజులో స్విగ్గీలో నాలుగు ఫుడ్ ఆర్డర్‌లు చేస్తే.. అందులోని ఒక్కో ఆర్డర్‌పై రూ. 3 ప్లాట్‌ఫారమ్ ఛార్జ్ చేస్తారు. అంటే ఇప్పుడు కాస్టర్ చేసిన ఫుడ్ ఆర్డర్ కు చెల్లించే డబ్బులతో పాటు ప్లాట్‌ఫారమ్ ఫీజు కూడా  రూ.12 చెల్లించాల్సి ఉంటుంది. దీంతో ఒక్క ఆర్డర్ తో రూ.12 అదనంగా సంపాదిస్తుందన్నమాట. ఇలా స్విగ్గీకి రోజుకు 1 లక్ష ఆర్డర్లు వస్తే.. వాటిపై రూ. 3 ప్లాట్‌ఫారమ్ ఛార్జీ వసూలు చేయడంతో స్విగ్గీ సంపాదన భారీ పెరిగింది. స్విగ్గీ తన కొత్త ప్లాట్‌ఫారమ్ ఛార్జీని అక్టోబర్ 4 నుండి అంటే ప్రపంచ కప్‌ మ్యాచ్ లు మొదలు కావడానికి ఒక రోజు ముందు నుండి అమలు చేయడం మొదలు పెట్టింది.

ఇవి కూడా చదవండి

ప్రపంచ కప్ ద్వారా లాభాలు

ఇప్పుడు ప్రపంచ కప్ మ్యాచ్ లు జరుగుతున్న సమయంలో ప్రజలు స్విగ్గీలో ఆహారాన్ని, వస్తువులను భారీగా  ఆర్డర్స్ ను స్విగ్గీ అందుకుంది. అదే సమయంలో తమకు చేసిన ఆర్డర్స్ తో స్విగ్గి ప్లాట్‌ఫారమ్ ఛార్జీలు వసూలు చేసింది. దీంతో ఆన్‌లైన్ ఫుడ్ డెలివరీ ప్లాట్‌ఫామ్ భారీ లాభాలను ఆర్జించింది. అదే సమయంలో, స్విగ్గీ ఈ నిర్ణయం కారణంగా.. దీని సమీప ప్రత్యర్థి జొమాటో కూడా పోటీ పడుతోంది.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..