Suzuki Motor: భారత్‌లో సుజుకీ మోటార్‌ భారీ పెట్టబడులు.. ఎలక్ర్టిక్‌ వెహికిల్స్‌ రంగంలో..

|

Mar 19, 2022 | 7:50 PM

జపాన్‌కు చెందిన ప్రముఖ వాహన తయారీ సంస్థ సుజకీ మోటార్‌ (Suzuki Motor) భారత్‌తో భారీ పెట్టుబడులు పెట్టనుంది. ఎలక్ట్రిక్‌ వెహికిల్స్‌, బ్యాటరీలను ఉత్పత్తికోసం సుమారు రూ.126 కోట్ల పెట్టుబడులు పెట్టనున్నట్లు తెలుస్తోంది.

Suzuki Motor: భారత్‌లో సుజుకీ మోటార్‌ భారీ పెట్టబడులు.. ఎలక్ర్టిక్‌ వెహికిల్స్‌ రంగంలో..
Maruti Suzuki
Follow us on

జపాన్‌కు చెందిన ప్రముఖ వాహన తయారీ సంస్థ సుజకీ మోటార్‌ (Suzuki Motor) భారత్‌తో భారీ పెట్టుబడులు పెట్టనుంది. ఎలక్ట్రిక్‌ వెహికిల్స్‌, బ్యాటరీలను ఉత్పత్తికోసం సుమారు రూ.126 కోట్ల పెట్టుబడులు పెట్టనున్నట్లు తెలుస్తోంది. భారత్‌లో పర్యటిస్తోన్న జపాన్‌ ప్రధాని ఫుమియో కిషిడా (Fumio Kishida) ఆదివారం (మార్చి20)న ప్రధాని నరేంద్ర మోడీతో సమావేశం కానున్నారు. ఇక్కడే దీనికి సంబంధించి అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉంది. 2025 నాటికి కార్యకలాపాలు ప్రారంభించాలనే లక్ష్యంతో సుజుకి భారతదేశంలో కొత్త ఎలక్ట్రిక్ వాహనాల ఉత్పత్తి శ్రేణిని నిర్మించాలనే తలంపుతో  ఉన్నట్లు జపాన్‌కు చెందిన ఓ ప్రముఖ వార్త పత్రిక రాసుకొచ్చింది. అయితే ఈ ఒప్పందానికి సంబంధించి అటు సుజుకీ మోటర్‌ ఎలాంటి ప్రకటన వెలువరించలేదు.

 

RRR ప్రి రిలీజ్ ఈవెంట్ లైవ్ దిగువన చూడండి