Pension Scheme: ఈపీఎఫ్‌ చందాదారుల అధిక పెన్షన్‌పై కొత్త ఆశలు.. సుప్రీం ఆదేశాలతో కార్యాచరణ షురూ..

|

Nov 08, 2022 | 11:18 AM

సుప్రీంకోర్టు ఈ నిర్ణయం తర్వాత సెప్టెంబరు 1, 2014 వరకు EPSలో సభ్యులుగా ఉన్న ఉద్యోగులు తమ 'అసలు' జీతంలో 8.33 శాతం వరకు పెన్షన్‌కు జమ చేయవచ్చు.

Pension Scheme: ఈపీఎఫ్‌ చందాదారుల అధిక పెన్షన్‌పై కొత్త ఆశలు.. సుప్రీం ఆదేశాలతో కార్యాచరణ షురూ..
EPF
Follow us on

ఉద్యోగులకు సుప్రీంకోర్టు గుడ్ న్యూస్ చెప్పింది. ఉద్యోగుల భవిష్యనిధి పింఛను పథకం (ఈపీఎస్‌)- 2014 సవరణపై సుప్రీంకోర్టు తాజా తీర్పుతో గరిష్ఠ వేతన పరిమితి రూ.15 వేల కన్నా ఎక్కువ వేతనం పొందుతూ ఇప్పటివరకు పెన్షన్‌ను పథకంలో చేరని ఉద్యోగులకు వెసులుబాటు కలిగింది. 2014 సవరణకు ముందు అధిక పెన్షన్‌ను పొందేందుకు ఈపీఎస్‌లో చేరని వారికి సుప్రీంకోర్టు మరికొంత సమయమిచ్చింది. నాలుగు నెలల్లోగా యజమానితో కలిసి ఉమ్మడిగా ఆప్షన్‌ ఇవ్వాలని సూచించింది. ఉమ్మడి ఆప్షన్‌ ఇచ్చిన తరువాత ఈపీఎఫ్‌ ఖాతాలో నగదును ఈపీఎస్‌లోకి మళ్లించాలని సూచించింది. సుప్రీంకోర్టు తీర్పును అధ్యయనం చేస్తున్న ఈపీఎఫ్‌వో త్వరలోనే అందులోని కొత్త రూల్స్ మేరకు నోటిఫికేషన్‌ జారీ చేయాలని ప్లాన్ చేస్తోంది. ఈపీఎస్‌లో చేరేందుకు వేతనం (బేసిక్‌‌తోపాటు డీఏ)పై ప్రస్తుతమున్న 8.33 శాతం వాటాను 12 శాతానికి పెంచడంపై స్టడీ చేస్తోంది. యజమాని చెల్లించే 12 శాతం మొత్తాన్ని ఈపీఎస్‌లోకి మళ్లించేలా సవరణ చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

దీనితో పాటు, ఉద్యోగి నెలకు 15,000 కంటే ఎక్కువ జీతంలో 1.16 శాతం తప్పనిసరిగా జమ చేయాలనే షరతును 2014 సవరణలలో సుప్రీంకోర్టు రద్దు చేసింది. ప్రధాన న్యాయమూర్తి యు.యు. లలిత్, జస్టిస్ అనిరుద్ధ బోస్, జస్టిస్ సుధాన్షు ధులియా ఉద్యోగుల పెన్షన్ (సవరణ) స్కీమ్ 2014ను సమర్థించారు.

ఉద్యోగులు..

సుప్రీంకోర్టు నిర్ణయం తర్వాత సెప్టెంబరు 1, 2014 వరకు ఉన్న EPS సభ్యులు తమ ‘అసలు’ జీతంలో 8.33 శాతం వరకు పెన్షన్‌కి అందించవచ్చు. ఇంతకుముందు, వారు పెన్షన్ జీతంలో 8.33 శాతం మాత్రమే అందించేవారు. గరిష్ట పరిమితిని నెలకు రూ. 15,000గా నిర్ణయించారు. కానీ ఇప్పుడు ఉద్యోగులు ఈ పథకంలో ఎక్కువ సహకారం అందించగలుగుతారు. మరిన్ని ప్రయోజనాలను కూడా ఇప్పటి నుంచి పొందుతారు. 2014లో గరిష్ఠ వేతన పరిమితిని రూ.15 వేలకు పెంచుతూ సవరణ చేసింది. దీనికి ముందు ఆప్షన్‌ ఇచ్చిన ఉద్యోగులు.. ఆరు నెలల్లోగా అధికవేతనంపై ఈపీఎస్‌లో చేరేందుకు ఆప్షన్‌ ఇవ్వాలని సూచించింది. అప్పుడు ఆప్షన్‌ ఇవ్వని వారికి మరో అవకాశం కల్పిస్తూ సుప్రీంకోర్టు తాజాగా ఉత్తర్వులిచ్చింది.

సుప్రీం కోర్ట్ తన నిర్ణయంలో ఏం చెప్పింది..

సుప్రీం కోర్ట్ 2014 నాటి ఉద్యోగుల పెన్షన్ (సవరణ) పథకాన్ని “చట్టబద్ధమైనది, చెల్లుబాటు అయ్యేది” అని పేర్కొంది. ఉద్యోగుల పెన్షన్ స్కీమ్‌లో చేరేందుకు ఇంకా ఎంపిక చేసుకోని ఉద్యోగులకు మరో 6 నెలల సమయం, అవకాశం ఇవ్వాలని సుప్రీంకోర్టు పేర్కొంది. చాలా మంది ఉద్యోగులకు ఊరటనిచ్చే ఈ నిర్ణయాన్ని గతవారం సుప్రీంకోర్టు వెలువరించింది.

ఆగస్టు 2014లో, పెన్షన్ స్కీమ్‌ని సవరించడం ద్వారా పింఛను పొందగల జీతం గరిష్ట పరిమితిని నెలకు రూ.6,500 నుండి రూ.15,000కి పెంచారు. దీని వల్ల సభ్యులు.. వారి యజమానులు వాస్తవ జీతంలో 8.33 శాతాన్ని అందించడం సాధ్యమైంది. అత్యున్నత న్యాయస్థానం ఆదేశాలను సత్వరమే అమలు చేసేందుకు వీలుగా పెన్షన్ ఫండ్ ఈపీఎఫ్‌వోకు చెందిన సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ట్రస్టీల అసాధారణ సమావేశాన్ని ప్రభుత్వం నిర్వహించాలని ఉద్యోగుల సంఘాలు డిమాండ్ చేశాయి.

అయితే.. ప్రతి ఉద్యోగి జీతంలో కొంత భాగాన్ని ఉద్యోగుల భవిష్య నిధి సంస్థ ఖాతాలో జమ చేస్తారు. మీరు EPFO ​​ఖాతాదారు అయితే, మీరు తప్పనిసరిగా ఉద్యోగుల ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ యొక్క EPS 95 పథకం గురించి తెలుసుకోవాలి. ఈ పథకం 1995 సంవత్సరం నుండి వర్తిస్తుంది. ఉద్యోగుల ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ కింద ఉన్న కంపెనీలన్నీ ఈ పథకం కిందకు వస్తాయి. ఈ పథకం కింద ప్రైవేట్ రంగ ఉద్యోగులకు కూడా ప్రతి నెలా పెన్షన్ సౌకర్యం లభిస్తుంది. EPFO యొక్క EPS పథకం కింద, సెప్టెంబర్ 1, 2014 నుండి, పింఛనుదారులందరికీ కనీసం రూ. 1,000 పెన్షన్ లభిస్తుంది. ఈ పెన్షన్ 58 ఏళ్ల తర్వాత పొందడం ప్రారంభమవుతుంది.

ఎవరికి పెన్షన్ సౌకర్యం లభిస్తుంది..

ఎంప్లాయిస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ ఖాతాదారులు మాత్రమే ఈ పథకం ప్రయోజనాన్ని పొందగలరు. EPFO చందాదారుల జీతంలో కొంత భాగం ప్రతి నెల EPFO ​​ఖాతాలో జమ చేయబడుతుంది. ఈ పథకం యొక్క ప్రయోజనాన్ని పొందడానికి, మీరు కనీసం 10 సంవత్సరాలు పనిచేసి ఉండాలి. మీరు 58 ఏళ్ల తర్వాత పెన్షన్ మొత్తాన్ని పొందవచ్చు. అదే సమయంలో, 50 సంవత్సరాల వయస్సు తర్వాత, మీరు మీ PF ఖాతా నుండి మీ అవసరాన్ని బట్టి తక్కువ వడ్డీ రేటుతో డబ్బును తీసుకోవచ్చు.

మరిన్ని బిజినెస్ న్యూస్ కోసం