Stock Market: భారీ నష్టాల్లో స్టాక్ మార్కెట్లు.. అంతర్జాతీయ పరిణామాలే కారణమా..!

|

Jan 21, 2022 | 10:27 AM

వరుసగా నాలుగో రోజు స్టాక్ మార్కెట్లు నష్టాల్లో కొనసాగుతున్నాయి. గురువారం నష్టాల్లో ముగిసిన మార్కెట్లు ఈ శుక్రవారం కూడా నష్టాల్లో ప్రారంభమయ్యాయి.

Stock Market: భారీ నష్టాల్లో స్టాక్ మార్కెట్లు.. అంతర్జాతీయ పరిణామాలే కారణమా..!
Stock Market
Follow us on

వరుసగా నాలుగో రోజు స్టాక్ మార్కెట్లు నష్టాల్లో కొనసాగుతున్నాయి. గురువారం నష్టాల్లో ముగిసిన మార్కెట్లు ఈ శుక్రవారం కూడా నష్టాల్లో ప్రారంభమయ్యాయి. సెన్సెక్స్​, నిఫ్టీ సూచీలు భారీగా తగ్గాయి. సెన్సెక్స్ 353 పాయింట్లు క్షీణించి 59 వేల 77 ఎగువన ట్రేడవుతోంది. జాతీయ స్టాక్​ ఎక్స్చేంజి సూచీ నిఫ్టీ 122 పాయింట్లు కోల్పోయి 17 వేల 637 వద్ద కొనసాగుతోంది.

ఎంఫసిస్, డెల్ట కర్ప్, హిందుస్తాన్ యూనిలీవర్, పవర్​గ్రిడ్​ కార్పొరేషన్​, బీపీసీఎల్​, ఎన్​టీపీసీ లాభాల్లో కొనసాగుతున్నాయి. డాక్టర్ లాలు పాత్​ల్యాబ్, బజాజ్ న్​సర్వ్ నష్టాల్లో ట్రేడ్​అవుతున్నాయి. అంతర్జాతీయంగా బలహీన సంకేతాలతో దేశీయ స్టాక్​ మార్కెట్లు నష్టాల్లో కొనసాగుతోన్నట్లు ఆర్థిక విశ్లేషకులు చెబుతున్నారు.

Read Also.. Semiconductor: ముందుకొస్తున్న కంపెనీలు.. మరో రెండేళ్లలో అందుబాటులోకి దేశీయ సెమీకండక్టర్లు..!