2026లో ఇన్వెస్టర్లకు పండగే.. ఈ 4 రంగాల్లో పెట్టుబడి పెడితే మీ అదృష్టం మారడం ఖాయం..

2026వ సంవత్సరం ఇన్వెస్టర్లకు ఒక అద్భుతమైన అవకాశంగా మారబోతోంది. గ్లోబల్ వడ్డీ రేట్ల తగ్గింపు, కార్పొరేట్ లాభాల పెరుగుదల దీనికి కారణం. భారత ఆర్థిక వ్యవస్థ సత్తా, మారుతున్న సాంకేతికత నేపథ్యంలో ఇన్వెస్టర్ల పోర్ట్‌ఫోలియోను లాభాల బాట పట్టించబోయే కీలక రంగాలు ఏవి అనేది ఈ స్టోరీలో తెలుసుకుందాం..

2026లో ఇన్వెస్టర్లకు పండగే.. ఈ 4 రంగాల్లో పెట్టుబడి పెడితే మీ అదృష్టం మారడం ఖాయం..
Stock Market 2026 Predictions

Updated on: Dec 28, 2025 | 12:53 PM

భారత స్టాక్ మార్కెట్ సరికొత్త శిఖరాలను అధిరోహించేందుకు సిద్ధమవుతోంది. 2025లో ఎదురైన సవాళ్లను అధిగమించి 2026 నాటికి నిఫ్టీ-50 ఇండెక్స్ 28,000 మార్కును చేరుకోవచ్చని మార్కెట్ విశ్లేషకులు జోస్యం చెబుతున్నారు. గ్లోబల్ మార్కెట్లలో వడ్డీ రేట్ల తగ్గింపు, భారత కార్పొరేట్ రంగంలో పెరుగుతున్న లాభాలు ఇందుకు ప్రధాన కారణం కానున్నాయి. అయితే పాత పద్ధతుల్లో కాకుండా.. మారుతున్న ప్రపంచానికి అనుగుణంగా పెట్టుబడులు పెట్టే వారికే జాక్‌పాట్ తగిలే అవకాశం ఉంది. రాబోయే రెండేళ్లలో మార్కెట్‌ను శాసించబోయే ఆ కీలక రంగాలు ఇవే..

రియల్ ఎస్టేట్ – గ్లోబల్ క్యాపబిలిటీ సెంటర్లు

భారత్ ఇప్పుడు అంతర్జాతీయ కంపెనీలకు కేవలం బ్యాక్ ఆఫీస్ కాదు.. వ్యూహాత్మక నిర్ణయ కేంద్రం. గ్లోబల్ కంపెనీలు తమ రీసెర్చ్ సెంటర్లను భారత్‌లో ఏర్పాటు చేస్తుండటంతో అత్యాధునిక సౌకర్యాలున్న ఆఫీస్ వర్క్‌స్పేస్‌లకు డిమాండ్ పెరిగింది. కమర్షియల్ రియల్ ఎస్టేట్, కో-వర్కింగ్ స్పేస్ సర్వీసులు అందించే కంపెనీలు దీర్ఘకాలికంగా లాభాలను అందించవచ్చు.

AI విప్లవం: సాఫ్ట్‌వేర్ నుంచి సొల్యూషన్స్ వరకు

భారత్ ఇప్పుడు కేవలం ఐటీ సేవల దేశం మాత్రమే కాదు ఏఐ హబ్‌గా మారుతోంది. గూగుల్, మెటా వంటి దిగ్గజాలు సుమారు 90 బిలియన్ డాలర్ల భారీ పెట్టుబడులతో భారత ఏఐ మౌలిక సదుపాయాలను బలోపేతం చేస్తున్నాయి. 2026 ఫిబ్రవరిలో జరగబోయే ఇండియా ఏఐ ఇంపాక్ట్ సమ్మిట్ ఈ రంగానికి టర్నింగ్ పాయింట్ కానుంది.స్వదేశీ అవసరాల కోసం రూపొందిస్తున్న స్మాల్ లాంగ్వేజ్ మోడల్స్ అభివృద్ధి చేసే కంపెనీలపై కన్నేయడం లాభదాయకం.

ఇవి కూడా చదవండి

ఈవీ ఛార్జింగ్ స్టేషన్లే కీలకం

ఎలక్ట్రిక్ వాహనాల విక్రయాలు పెరుగుతున్నప్పటికీ, ఛార్జింగ్ స్టేషన్ల కొరత ప్రధాన సమస్యగా ఉంది. దాదాపు 45 శాతం మంది ఈవీ యజమానులు పబ్లిక్ ఛార్జింగ్ పాయింట్ల కోసమే వెతుకుతున్నారు. కేంద్రం అందిస్తున్న భారీ సబ్సిడీలతో ఈవీ ఛార్జింగ్ నెట్‌వర్క్ నిర్మించే కంపెనీల షేర్లకు 2026లో విపరీతమైన గిరాకీ ఉండవచ్చు.

లగ్జరీ వస్తువులు

భారతీయుల తలసరి ఆదాయం పెరుగుతుండటంతో వినియోగదారుల ధోరణి మారుతోంది. సాధారణ వస్తువుల కంటే ప్రీమియం ఉత్పత్తులకు ఆదరణ పెరుగుతోంది.హై-ఎండ్ రియల్ ఎస్టేట్, లగ్జరీ కార్లు, ఖరీదైన వాచీలు, ప్రీమియం ఎలక్ట్రానిక్స్ రంగంలోని కంపెనీల ఆదాయాలు 2026లో రెండంకెల వృద్ధిని నమోదు చేసే అవకాశం ఉంది.

ఇన్వెస్టర్లకు సూచన

2026వ సంవత్సరం భారత మార్కెట్‌కు ఒక మైలురాయిగా నిలవనుంది. గ్రీన్ ఎనర్జీ, ఏఐ, ప్రీమియం మ్యానుఫ్యాక్చరింగ్ రంగాల్లో పటిష్టమైన ఫండమెంటల్స్ ఉన్న కంపెనీలను ఎంచుకోవడం ద్వారా మదుపరులు సంపదను సృష్టించుకోవచ్చు.

(నోట్: స్టాక్ మార్కెట్ పెట్టుబడులు రిస్క్‌తో కూడుకున్నవి. పెట్టుబడి పెట్టే ముందు మీ ఆర్థిక సలహాదారుని సంప్రదించడం ఉత్తమం.)

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి