PAN Card: పాన్ కార్డ్‌లో ఇంటి పేరు మార్చుకోవాలా.? మొబైల్‌లోనే ఇలా సింపుల్‌గా..
ముఖ్యంగా ఆర్థిక పరమైన అంశాలన్నీ బ్యాంకులతో ముడిపడి ఉన్న ఈ రోజుల్లో పాన్ కార్డ్ వినియోగం అనివార్యంగా మారింది. బైక్ మొదలు భూ కొనుగోలు వరకు అన్నింటికీ పాన్ కార్డులను ఉపయోగించే రోజులు వచ్చేశాయ్. దీంతో పాన్ కార్డ్ విషయాల్లో ఎన్నో అనుమానాలు వ్యక్తమవుతుంటాయి. వీటిలో ఒకటి పెళ్లి తర్వాత మహిళల ఇంటి పేరు మారుతుంది. మరి పాన్ కార్డులో ఇంటి పేరును ఎలా మార్చుకోవాల్సి...
ఒకప్పుడు పాన్ కార్డ్ అంటే కేవలం కొందరికి మాత్రమే అవసరం అనే ఆలోచనలో ఉండే వారు. కానీ ప్రస్తుతం పరిస్థితి మారింది. ప్రతీ ఒక్కరికా పాన్ కార్డ్ అనివార్యంగా మారింది. ఆధార్ కార్డ్ ఎంత అత్యవసరంగా మారిందో పాన్ కార్డు కూడా అంతే ప్రాధాన్యతను సంతరించుకుంది. దీంతో ప్రతీ ఒక్కరూ పాన్ కార్డును తీసుకుంటున్నారు.
ముఖ్యంగా ఆర్థిక పరమైన అంశాలన్నీ బ్యాంకులతో ముడిపడి ఉన్న ఈ రోజుల్లో పాన్ కార్డ్ వినియోగం అనివార్యంగా మారింది. బైక్ మొదలు భూ కొనుగోలు వరకు అన్నింటికీ పాన్ కార్డులను ఉపయోగించే రోజులు వచ్చేశాయ్. దీంతో పాన్ కార్డ్ విషయాల్లో ఎన్నో అనుమానాలు వ్యక్తమవుతుంటాయి. వీటిలో ఒకటి పెళ్లి తర్వాత మహిళల ఇంటి పేరు మారుతుంది. మరి పాన్ కార్డులో ఇంటి పేరును ఎలా మార్చుకోవాల్సి ఉంటుంది. మరి పాన్ కార్డులో ఇంటి పేరును ఎలా మార్చుకోవాలి.? ఇందుకోసం ఎక్కడికి వెళ్లాలనే ప్రశ్న సహజంగానే తలెత్తుతుంది. అయితే ఎక్కడికి వెళ్లకుండానే ఇంట్లో ఉండే మొబైల్ ఫోన్‌లోనే ఈజీగా పేరు మార్చుకోవచ్చు. ఇందుకోసం ఈ సింపుల్ స్టెప్స్ ఫాలో అయితే చాలు..
పాన్ కార్డులో ఇంటి పేరు మార్చుకోవడానికి వివాహ ధృవీకరణ పత్రం/పెళ్లి పత్రిక అవసరం ఉంటుంది. అలాగే అధికారిక గెజిట్‌లో పేరు మార్పు ప్రచురణ, భర్త పేరు చూపించే పాస్‌పోర్ట్ కాపీ, గెజిటెడ్ అధికారి జారీ చేసిన సర్టిఫికేట్ (దరఖాస్తుదారు పేరు మార్పు కోసం మాత్రమే) వంటి డాక్యుమెంట్స్ ఉండాలి. పాన్ కార్డులో ఇంటి పేరు మార్చుకోవడం కోసం ముందుగా మొబైల్ లేదా కంప్యూటర్‌లో టీఐఎన్ ఎన్‌ఎస్‌డీఎల్ (www.tin-nsdl.com) వెబ్‌సైట్‌లోకి వెళ్లాలి. అనంతరం సర్వీస్ విభాగంలోని PAN అనే ఆప్షన్‌ను ఎంచుకోవాలి. అనంతరం కిందికి స్క్రోల్ చేసి.. చేంజ్/కరెక్షన్ ఇన్ పాన్ డేటా అనే సెక్షన్‌లో అప్లైపై క్లిక్ చేయాలి.
తర్వాత ‘అప్లికేషన్ టైప్’ ఆప్షన్‌లో.. ‘Changes or Correction in existing PAN data’ని సెలక్ట్ చేసుకోవాలి. అనంతరం పాన్ నంబర్‌తో పాటు పేరు, పుట్టిన తేదీ, ఇ-మెయిల్, ఫోన్ నంబర్ వంటి వివరాలను ఎంటర్ చేయాలి. చివరిగా సబ్‌మిట్ బటన్‌పై క్లిక్ చేయాలి. వెంటనే పాన్ కార్డ్‌కు సంబంధించిన కరెక్షన్ పేజీ డిస్ప్లే అవుతుంది. ఇప్పుడు మీ పేరు, పుట్టిన రోజు, ఫోన్ నెంబర్ వంటివి మార్చుకునే అవకాశం ఉంటుంది. మీరు కోరుకున్న వివరాలను మార్చేసి.. ఆ తర్వాత సబ్‌మిట్ చేయాలి. వెంటనే పేమెంట్ చేయమని ఆప్షన్ కనిపిస్తుంది. కార్డు లేదా ఆన్‌లైన్ బ్యాంకింగ్ విధానంలో పేమెంట్ చేసుకోవచ్చు. పేమెంట్ పూర్తికాగానే.. మీరు పాన్ కార్డును అప్‌డేట్ చేసినట్టుగా ఓ ఫారమ్ వస్తుంది. దాన్ని డౌన్‌లోడ్ చేసి ప్రింటవుట్ తీసుకోవాలి.
అనంతరం సదరు ఫామ్‌పై రెండు ఫొటోలు అతికించి దానిపై సంతకం చేయాలి. అలాగే పేరు మార్చిన తర్వాత దానికి సంబంధించిన డాక్యుమెంట్ ప్రూఫ్‌ను యాడ్ చేయాలి. ఎన్‌ఎస్‌డీఎల్ ద్వారా పాన్ కార్డ్‌లో మార్పులు చేస్తే, దరఖాస్తును ఎన్‌ఎస్‌డీఎల్‌కి పోస్ట్ చేయాలి. ఒకవేళ UTIITSL ద్వారా అప్‌డేట్ చేస్తే.. సదరు అప్లికేషన్‌ను UTIITSLకి పోస్ట్ చేయాలి. ఇలా మీ పాన్ కార్డులో పేరును మార్చుకోవచ్చు.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం క్లిక్ చేయండి..