Steel Prices: రష్యా- ఉక్రెయిన్ యుద్ధం(Russia Ukraine Crisis) కారణంగా ఉక్కు ధరలకు అమాంతం రెక్కలు వచ్చిన సంగతి తెలిసింది. గత నెలలో టన్ను ఉక్కు ధర గరిష్ఠంగా రూ.76,000కు చేరాయి. అయితే ఇవి ఈ ఆర్థిక సంవత్సరం చివరినాటికి అంటే వచ్చే ఏడాది మార్చికి టన్ను ఉక్కు ధర రూ.60,000కి దిగి రావొచ్చని క్రిసిల్ రేటింగ్(CRISIL Rating) సంస్థ అంచనా వేస్తోంది. కరోనా కారణంగా రవాణా, లాజిస్ట్కిక్స్ దెబ్బతినటం కారణంగా ప్రస్తుతం రేట్లు ఇంకా అధికంగానే ఉన్నాయి. రష్యా-ఉక్రెయిన్ మధ్య యుద్ధం, కర్బన ఉద్గారాలు తగ్గించుకునేందుకు వివిధ దేశాలు చేపట్టిన చర్యలు, ఉక్కు తయారీకి వినియోగించే ముడి పదార్థాల ధరలు పెరుగుదల, అంతర్జాతీయంగా మారుతున్న పరిస్థితులు ఇందుకు ప్రధాన కారణాలని పెరిగాయని క్రిసిల్ పేర్కొంది.
రానున్న వర్షాకాలంలో నిర్మాణాలు నెమ్మదించి ఉక్కుకు గిరాకీ తగ్గుతుందని, ఈ కారణంగా ధర తగ్గుముఖం పడుతుందని పేర్కొంది. ఈ కాలంలో దేశీయంగా ఉన్న ఉక్కు తయారీ పరిశ్రమలకు సరిపడా ముడి పదార్థాలు దిగుమతుల ద్వారా అందుతాయని అంచనా వేసింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ముగిసేసరికి ఉక్కు టన్ను రూ.60,000కు తగ్గవచ్చని తెలిపింది. 2021-22లో 50 శాతానికి పైగా పెరిగిన తర్వాత ఫ్లాట్ స్టీల్ ధరలు ఈ ఆర్థిక సంవత్సరంలో 3-5 శాతం పెరగవచ్చు. జనవరి-మార్చిలో డిమాండ్ తగ్గినప్పటికీ, అధిక ఇన్‌పుట్ ఖర్చులు, తేలికైన ఎగుమతుల కారణంగా ఉక్కు ధరలు పెరిగాయని క్రిసిల్ డైరెక్టర్ హేతల్ గాంధీ అంటున్నారు.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
ఇవీ చదవండి..
Stock Market: వడ్డీ రేట్ల షాక్ నుంచి తేరుకుంటున్న మార్కెట్లు.. వరుస నష్టాలకు బ్రేక్..