Steel Price: రష్యా, ఉక్రెయిన్‌ యుద్ధంతో భారత్‌లో భారీగా పెరుగుతోన్న ఉక్కు ధర.. ఇప్పటికే మూడు సార్లు పెంపు..

|

Mar 24, 2022 | 5:47 PM

చాలా రకాల వస్తువులు తయారు చేయడానికి దాదాపు స్టీల్‌(Steel)ను వాడతాం. చిన్న మేకు నుంచి.. మీ బైక్ లేదా కారు తాళం, గరిటెలుSpoon) నుంచి విమానాల వరకూ మన నిత్యజీవితంలో ఉక్కుతో తయారయిన వస్తువు లేకుండా మన జీవితం సాగదు...

Steel Price: రష్యా, ఉక్రెయిన్‌ యుద్ధంతో భారత్‌లో భారీగా పెరుగుతోన్న ఉక్కు ధర.. ఇప్పటికే మూడు సార్లు పెంపు..
Steel
Follow us on

చాలా రకాల వస్తువులు తయారు చేయడానికి దాదాపు స్టీల్‌(Steel)ను వాడతాం. చిన్న మేకు నుంచి.. మీ బైక్ లేదా కారు తాళం, గరిటెలుSpoon) నుంచి విమానాల వరకూ మన నిత్యజీవితంలో ఉక్కుతో తయారయిన వస్తువు లేకుండా మన జీవితం సాగదు. ఈ నేపథ్యంలో పెరుగుతున్న ఉక్కు ధరలు మీ ఖర్చులను మరింత పెంచవచ్చు. వినియోగదారులే కాదు వ్యాపారులు కూడా ఈ విషయంపై ఆందోళన చెందుతున్నారు. అలీఘర్‌ను ఉదాహరణగా తీసుకోండి. ఈ నగరం మనందరికీ తాళాలు తాయారు చేస్తుంది. దేశంలోని 80 శాతం తాళాలు ఇక్కడే తయారవుతాయి. మన కోసం తాళాలు(Lock) తయారు చేసే ఆలీఘర్ లో ఉక్కు ఖరీదు కావడంతో అక్కడి ఫ్యాక్టరీలకు తాళాలు వేలాడే పరిస్థితి నెలకొంది. గతేడాది స్టీల్ షీట్ ధర కిలో రూ.200లోపే ఉందని, ఇప్పుడు రూ.300కు పైగా చెల్లించాల్సి వస్తోందని వినాయక్ ఇంటర్నేషనల్ అధినేత సౌరభ్ సైనీ చెబుతున్నారు.

తాళం తయారీలో 70 శాతం ఉక్కు మాత్రమే ఉంటుంది. ముడిసరుకు 30 నుంచి 35 శాతం వరకు ఖరీదు పెరిగింది కానీ తాళాల ధరను కేవలం 7 శాతం మాత్రమే పెంచాగాలిగారు. ఎందుకంటే ధర పెరగడం డిమాండ్‌ను ప్రభావితం చేస్తుంది. రష్యా – ఉక్రెయిన్ కలిసి సంవత్సరానికి 100 మిలియన్ టన్నుల ఉక్కును ఉత్పత్తి చేస్తాయి. ఇందులో 37 మిలియన్ టన్నుల ఉక్కు ఎగుమతి అవుతుంది. ఇది మొత్తం ప్రపంచ వాణిజ్యంలో 8 నుంచి 9 శాతం. అయితే ఈ మార్కెట్ల నుంచి సరఫరా తగ్గిపోయి ధరలు రాకెట్‌ వేగంతో పెరిగాయి. దేశీయ మార్కెట్లో ఉక్కు సగటు ధర టన్నుకు రూ. 70,000, దీనికి 18 శాతం జీఎస్టీ అదనంగా చెల్లించాలి. గతేడాది సగటు ధర రూ. 40000 దగ్గరగా ఉండేది. అంటే దాదాపు రెట్టింపు ధర పెరిగింది.

సరఫరా తగ్గడమే కాకుండా, బొగ్గు, ఇనుప ఖనిజం ధరల్లో పెరుగుదల కారణంగా ఉక్కు ధర పెరిగింది. ఉక్కు ఉత్పత్తి వ్యయంలో బొగ్గు వాటా 40 శాతం. మార్చి నెలలోనే బొగ్గు ధరలు దాదాపు 34 శాతం పెరిగాయి. దీనికి కారణం రష్యా కూడా. రష్యా ప్రపంచంలోనే మూడవ అతిపెద్ద బొగ్గు ఎగుమతిదారు. బొగ్గు మార్కెట్‌లో ఎక్కువ భాగం ఆస్ట్రేలియా నుంచి కూడా వస్తుంది. అయితే, అక్కడ వరదల పరిస్థితి బొగ్గు సరఫరాను తీవ్రంగా ప్రభావితం చేసింది. NMDC 2022లో ఇప్పటి వరకు మూడు సార్లు ఇనుము ధరలను పెంచింది. NMDC భారతదేశానికి అతిపెద్ద ఇనుప ఖనిజం సరఫరాదారు.

Read Also.. Stock Market: వరుసగా రెండో రోజు నష్టాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు.. సెన్సెక్స్ 89, నిఫ్టీ 23 పాయింట్లు డౌన్..