SBI కస్టమర్లకు గుడ్ న్యూస్.. సంవత్సరంలో వారి ఆదాయం రెట్టింపు.. వారికి అదిరిపోయే బెనిఫిట్..

State Bank Of India: దేశీయ అతిపెద్ద బ్యాంక్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) ఎప్పటికప్పుడు తన వినియోగదారులకు అదిరిపోయే బెనిఫిట్స్ అందిస్తోంది.

SBI కస్టమర్లకు గుడ్ న్యూస్.. సంవత్సరంలో వారి ఆదాయం రెట్టింపు.. వారికి అదిరిపోయే బెనిఫిట్..
Sbi

Updated on: May 06, 2021 | 10:29 PM

State Bank Of India: దేశీయ అతిపెద్ద బ్యాంక్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) ఎప్పటికప్పుడు తన వినియోగదారులకు అదిరిపోయే బెనిఫిట్స్ అందిస్తోంది. అందుకే దేశంలోనే ఎస్బీఐకు కస్టమర్లు కూడా అధికంగానే ఉంటారు. ఈ బ్యాంక్ తన ఖాతాదారుల కోసం ఎన్నో రకాల సర్వీసులను అందిస్తోంది. బ్యాంక్ అకౌంట్ దగ్గరి నుంచి రుణాలు వరకు కస్టమర్లకు చాలా సేవలు ఆఫర్ చేస్తోంది. ఇక ఈ బ్యాంక్ ఏ చిన్న విషయమైన సోషల్ మీడియా ద్వారా తమ కస్టమర్లకు తెలియజేస్తుంది. ఇలా మిగతా బ్యాంకుల కంటే ఎస్బీఐ ముందుగానే తమ కస్టమర్లకు సమాచారాన్ని చేరవేయడంలో ముందంజలో ఉంది. తాజాగా మరోసారి ఎస్బీఐ కస్టమర్లకు అదిరిపోయే రాబడి అందిస్తోంది.

ఎస్బీఐ షేర్లు కేవలం ఒక సంవత్సరంలో రెట్టింపు అయ్యాయి. అంటే ఏడాది క్రితం ఎస్బీఐ షేర్లలో లక్ష రూపాయలు పెట్టి ఉంటే ఇప్పుడు అవి రూ. 2 లక్షలుగా మారాయి. 2020 మే 5న ఎస్‌బీఐ షేరు ధర రూ.171 వద్ద ఉండేది. 2021 మే 5న ఎస్‌బీఐ షేరు ధర రూ.356కు ఎగసింది. ఇక ఎస్బీఐ ఫిక్స్డ్ డిపాజిట్ల విషయానికి వస్తే.. 5.8 శాతం వరకు వడ్డీని అందిస్తోంది. ఫిక్స్డ్ డిపాజిట్లో డబ్బులు పెడితే ఎలాంటి రిస్క్ ఉండదు. అయితే రాబడి తక్కువగా ఉంటుంది. అదే సమయంలో స్టాక్ మార్కెట్లో డబ్బులు పెడితే ఎక్కువగా రాబడి వస్తుంది. అయితే రిస్క్ మాత్రం కాస్త ఎక్కువగానే ఉంటుంది.

ట్వీట్..

Also Read: మాటలు వినలేం.. ఫోన్ కూడా రాదు.. నా జీవితంలో అతి పెద్ద దుర్దినం ఇదే.. ఎమోషనల్ పోస్ట్ చేసిన సురేఖా వాణి కూతురు

మరో విషాదం.. కరోనా సోకి ప్రముఖ నటి మృతి.. సంతాపం ప్రకటించిన పలువురు సినీ ప్రముఖులు..

పెళ్ళి చేసుకున్న పాపులర్ కమెడియన్స్.. 9 రోజుల తర్వాత షాకిచ్చిన పోలీసులు.. ఇంతకీ ఏం జరిగిందంటే..

 

Loading...
Unable to load recommendations.
Follow Us