SBI NEFT: ఈరోజు రాత్రి నుంచి నిలిచిపోనున్న నెఫ్ట్ సేవ‌లు.. ఖాతాదారుల‌ను అల‌ర్ట్ చేసిన ఎస్‌బీఐ.. ఎప్ప‌టి నుంచంటే.

|

May 22, 2021 | 8:08 AM

SBI Alert NEFT: ఆన్‌లైన్ ట్రాన్సాక్ష‌న్ కోసం ఉప‌యోగించే ఎల‌క్ట్రానిక్ ఫండ్స్ ట్రాన్స్‌ఫ‌ర్ (నెఫ్ట్‌) సేవ‌ల్లో అంత‌రాయం ఏర్ప‌డ‌నున్న‌ట్లు ఆర్‌బీఐ ఇప్ప‌టికే ప్ర‌క‌టించిన విష‌యం తెలిసిందే. నెఫ్ట్ వ్య‌వ‌స్థ‌లో కొత్త‌గా...

SBI NEFT: ఈరోజు రాత్రి నుంచి నిలిచిపోనున్న నెఫ్ట్ సేవ‌లు.. ఖాతాదారుల‌ను అల‌ర్ట్ చేసిన ఎస్‌బీఐ.. ఎప్ప‌టి నుంచంటే.
Sbi Alert About Neft
Follow us on

SBI Alert NEFT: ఆన్‌లైన్ ట్రాన్సాక్ష‌న్ కోసం ఉప‌యోగించే ఎల‌క్ట్రానిక్ ఫండ్స్ ట్రాన్స్‌ఫ‌ర్ (నెఫ్ట్‌) సేవ‌ల్లో అంత‌రాయం ఏర్ప‌డ‌నున్న‌ట్లు ఆర్‌బీఐ ఇప్ప‌టికే ప్ర‌క‌టించిన విష‌యం తెలిసిందే. నెఫ్ట్ వ్య‌వ‌స్థ‌లో కొత్త‌గా సాంకేతికంగా మార్పులు చేప‌డుతున్న నేప‌థ్యంలో ఈ అంత‌రాయం ఏర్ప‌డుతున్న‌ట్లు తెలిపారు. ఈ నేప‌థ్యంలో ఈరోజు (శ‌నివారం) అర్థ‌రాత్రి 12.00 గంట‌ల నుంచి ఆదివారం మ‌ధ్యాహ్నం 2.00 గంట‌ల‌కు ఈ సేవ‌లు అందుబాటులో ఉండ‌వు.
ఈ నేప‌థ్యంలోనే ప్ర‌ముఖ ప్ర‌భుత్వ రంగ బ్యాంక్ ఎస్‌బీఐ త‌న ఖాతాదారుల‌ను అల‌ర్ట్ చేసింది. ఈ విష‌యమై ట్వీట్ చేస్తూ.. ఖాతాదారుల‌కు ముఖ్య‌గ‌మ‌నిక రిజ‌ర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా చేప‌డుతోన్న టెక్నిక‌ల్ అప్‌గ్రేడ్ కార‌ణంగా నెఫ్ట్ సేవ‌ల్లో అంత‌రాయం ఏర్ప‌డనుంది అని తెలిపిన ఎస్‌బీఐ.. ఇంట‌ర్నెట్ బ్యాంకింగ్‌తో పాటు యోనో, యోనో లైట్‌లో నెఫ్ట్ సేవ‌లు అందుబాటులో ఉండ‌వు అంటూ ట్విట్ట‌ర్ వేదిక‌గా తెలిపింది. ఇక రియ‌ల్ టైమ్ గ్రాస్ సెటిల్‌మెంట్ (ఆర్‌టీజీఎస్) సేవ‌లు మాత్రం య‌ధావిధిగా కొన‌సాగుతాయ‌ని ఎస్‌బీఐ తెలిపింది. దీనికి అనుగుణంగా లావాదేవీల‌ను ప్లాన్ చేసుకోవాల‌ని సూచించింది. ఇదిలా ఉంటే ఆర్‌టీజీఎస్ సేవ‌ల్లోనూ ఇలాంటి సాంకేతిక అప్‌గ్రేడ్‌ను ఏప్రిల 18న చేపట్టారు.

ఎస్‌బీఐ చేసిన ట్వీట్‌..

Also Read: Petrol Diesel Price Today: నెమ్మదిగా సెంచరీ వైపు పెట్రోల్, డీజిల్ పరుగులు.. మీ నగరంలోని ధరలు ఇలా ఉన్నాయి..!

Bank Charges: మీకు బ్యాంక్ అకౌంట్ ఉందా? బ్యాంకులు విధిస్తున్న ఛార్జీలు ఏవో తెలుసుకోండి..!

లోన్ తీసుకున్నవారికి హెచ్చరిక.. టైమ్‏కు EMI కట్టకపోతే ఇక అంతే సంగతులు. .. భారీగా ఛార్జీలు..