SBI Offer: సాధారణంగా బ్యాంకులు పర్సనల్ లోన్, కార్ లోన్, హౌజింగ్ లోన్‌లు ఇస్తుంటాయి. అయితే వీటికి పెద్ద ప్రాసెస్ ఉంటుంది. ముందుగా ప్లే స్లిప్‌లు ఇవ్వాలి, సిబిల్ స్కోరు బాగుండాలి, ఇలా పెద్ద జాబితా ఉంటుంది. తీరా అన్ని చేశాక లోన్ కచ్చితంగా వస్తుందా.. అంటే అది కూడా నమ్మకం ఉండదు. అయితే పెద్ద పెద్ద వాటికి లోన్‌లకు వెళితే బాగుంటుంది. కానీ రెగ్యులర్‌గా చేసే షాపింగ్, చిన్న మొత్తాలకు లోన్ తీసుకోవడానికి అవకాశం ఉండదు. ఇందుకోసం క్రెడిట్ కార్డు ఉపయోగించాల్సి ఉంటుంది. అయితే అందరికీ క్రెడిట్ కార్డు ఉండదు కదా.! ఇలాంటి వారి కోసమే ఎస్‌బీఐ మంచి అవకాశాన్ని తీసుకొచ్చింది.
స్టేట్ బ్యాంకులో అకౌంట్ ఉండి, డెబిట్ కార్డు ఉపయోగిస్తున్న వారికి లోన్ అందించనుంది. ముఖ్యంగా షాపింగ్ ప్రియుల కోసం ఎస్‌బీఐ ఈ ఆఫర్‌ను తీసుకొచ్చింది. ఎస్‌బీఐ డెబిట్ కార్డుతో ఆఫ్‌లైన్ లేదా ఆన్‌లైన్‌లో షాపింగ్ చేస్తే ఆ మొత్తాన్ని సులభమైన వాయిదాల్లోకి (ఈఎమ్‌ఐ) మార్చుకునే అవకాశాన్ని అందించింది. ఇలా ఏకంగా రూ. లక్ష వరకు షాపింగ్ చేసుకొని దానిని ఈఎమ్‌ఐకి మార్చుకోవచ్చు. ఇక ఫెస్టివ్ ఆఫర్ కింద ప్రాసెసింగ్ ఫీజు కూడా మినహాయింపు ఇచ్చింది ఎస్‌బీఐ. మరి మీరు లోన్‌కు అర్హత ఉన్నారో లేదో తెలుసుకోవడానికి ఎస్‌బీఐ రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్ నుంచి 567676 నెంబర్‌కు DCEMI అనే మెసేజ్‌ను చేస్తే సరిపోతుంది.
Binge-shopping just got better with Easy EMIs. Choose SBI Debit Card EMI and get it done with the best festive offers.#SBI #GetItDoneWithSBI #SBIDebitCardEMI #EasyEMI #FestiveOffer pic.twitter.com/siQ6h5fxHw
— State Bank of India (@TheOfficialSBI) November 10, 2021
Also Read: Bigg Boss 5 Telugu: హౌస్ మేట్స్‌ను జంతువులతో పోల్చిన సన్నీ.. ఎవరెవరికి ఏమిచ్చాడంటే..
PM Modi: రైల్వే ప్రయాణికులకు పీఎం మోడీ గుడ్ న్యూస్.. మరో 200 స్టేషన్‌లలో ఆ సదుపాయాలు..
14 రోజులు పనిచేస్తే చాలు 9 లక్షల జీతం..! వింత ఉద్యోగం.. ఎక్కడో తెలుసా..?